Baba Ka Dhaba: కన్నీళ్లు పెట్టించే వీడియో ఆ వృద్ధజంట నడిపే హోటల్‌కు మళ్లీ గిరాకీ తెచ్చింది

ఫొటో సోర్స్, Ani
ఒక వైరల్ ట్వీట్ ఆ వృద్ధ జంట కన్నీళ్లు తుడిచింది. సోషల్ మీడియాలో పెట్టిన ఓ వీడియో కళ తప్పిన ఆ 'బాబాయ్ హోటల్'కు మళ్లీ గిరాకీ వచ్చేలా చేసింది. అంతేనా... ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోలో కూడా ఇప్పుడా హోటల్ కనిపిస్తోంది.
కరోనా మహమ్మారి కారణంగా బేరాల్లేక ఆదాయం కోల్పోయిన 80 ఏళ్ల హోటల్ యజమాని కన్నీళ్లు పెట్టుకున్న వీడియో చూసిన వందలాది మంది ఇప్పుడా హోటల్‌కు పోటెత్తుతున్నారు. తాము కడుపు నింపుకొని ఆ వృద్ధ జంట కడుపు నింపాలన్న సదుద్దేశంతో 'బాబా కా ధాబా' ముందు క్యూ కడుతున్నారు.
ఇప్పుడు ఆ చిరు హోటల్ యజమాని కాంతా ప్రసాద్, ఆయన భార్య బాదామి దేవి స్థానికంగా సెలబ్రిటీలుగా మారిపోయారు.
ఇండియాలో స్ట్రీట్ ఫుడ్ చాలా పాపులర్. కానీ, కరోనా మహమ్మారి కారణంగా అలాంటి చిన్నచిన్న ఆహార దుకాణాలకు గిరాకీ పడిపోయింది. చాలా దుకాణాలు మూతపడిపోయాయి. చిరు వ్యాపారాలు దారుణంగా దెబ్బతిన్నారు.
కాంతాప్రసాద్, బాదామి దేవి జంట దక్షిణ దిల్లీలోని మాలవీయ నగర్‌లో 1990 నుంచి 'బాబా కా ధాబా' నడుపుతున్నారు. తమ ఇంట్లో వండే తాజా ఆహారాన్ని అక్కడ వడ్డిస్తారు. పరాఠాలు, రొట్టెలు, అన్నం, పప్పు, చట్నీ వంటివి అక్కడ లభిస్తాయి. రూ. 50 కంటే తక్కువకే 'బాబా కా ధాబా'లో కడుపు నిండా భోజనం చేయొచ్చు.

ఫొటో సోర్స్, Ani
హోటల్ పెట్టినప్పుటి నుంచి కాంతా ప్రసాద్ దంపతులు తిండికి ఇబ్బంది లేకుండా ఉన్నంతలో బతుకుతున్నారు. అయితే, కరోనా మహమ్మారి వచ్చి మొత్తం తలకిందులు చేసింది. 80 ఏళ్ల కాంతాప్రసాద్, ఆయన భార్యకు కష్టాలు తప్పలేదు. తన దగ్గరకొచ్చిన ఒక ఫుడ్ బ్లాగర్‌తో ఈ విషయాలన్నీ చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు కాంతా ప్రసాద్.
'బాబా కా ధాబా'కు వెళ్లిన గౌరవ్ వాసన్ అనే ఫుడ్ బ్లాగర్ అక్కడున్న ఆహార పదార్థాలన్నీ వీడియోలో చూపిస్తూ ఈ రోజు ఇంతవరకు ఎంత సంపాదించారు అని కాంతాప్రసాద్‌ను అడిగారు. నాలుగైదు 10 రూపాయల నోట్లను చూపించిన కాంతాప్రసాద్ ఒక్కసారిగా బోరుమన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
గౌరవ్ వాసన్ ఆ వీడియోను బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. క్షణాల్లో అది సోషల్ మీడియాలో వ్యాపించింది. ఓ మహిళ ఆ వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ''నా గుండె పగిలింది. దిల్లీ ప్రజలారా బాబా కా ధాభాకు వెళ్లి తినండి. కాంతా ప్రసాద్, ఆయన భార్యకు సాయం చేయండి'' అంటూ ఆ వీడియోను ట్వీట్ చేశారు.
ఆ వీడియోకు 40 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి.. బాలీవుడ్ స్టార్లు, క్రికెటర్లకు కూడా చేరింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
గురువారం రాత్రి జొమాటో ట్వీట్ చేస్తూ 'బాబా కా ధాబా'కు తమ యాప్‌లో స్థానం ఇచ్చినట్లు చెప్పింది. అలా ఇబ్బందులు పడుతున్న ఫుడ్ స్టాల్స్ ఏవైనా ఉంటే తమ దృష్టికి తెస్తే సాయం చేయగలుగుతామని చెప్పింది.

ఫొటో సోర్స్, Ani
తాను, తన భార్య ఉదయం 6.30 నుంచే వంట ప్రారంభించి 9.30కి పూర్తి చేస్తామని కాంతాప్రసాద్ దంపతులు ఆ వీడియోలో చెప్పారు.
కార్మికులు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు చాలామంది ఉదయం అక్కడ అల్పాహారం చేసేవారు. అయితే కరోనా కారణంగా చాలామందికి ఉద్యోగాలు పోవడం, పనులు లేకపోవడం.. మరికొందరు ఇళ్ల నుంచే పనిచేస్తుండడంతో 'బాబా కా ధాబా'కు వచ్చేవారు పూర్తిగా తగ్గిపోయారు.
ఒక్కో రోజు వండిందంతా మిగిలిపోయేదని.. ఒక్కోసారి వంట చేయడానికి కావాల్సిన సరకులు కొనడానికి కూడా తమ దగ్గర డబ్బులు లేని పరిస్థితి ఏర్పడిందని బాదామి దేవి చెప్పారు.
అయితే, గౌరవ్ పోస్ట్ చేసిన వీడియో వైరల్ కాగానే వినియోగదారులు రావడం ప్రారంభమైంది. వారిలో కొందరు ఇప్పుడు ఫేమస్ ప్లేస్‌గా మారిపోయిన బాబా కా ధాబా దగ్గర సెల్ఫీలు దిగుతున్నారు.
మీడియాకు చెందినవారు కాంతాప్రసాద్ దంపతులతో మాట్లాడడానికి వస్తున్నారు. బాలీవుడ్ నటి సోనమ్ కపూర్, క్రికెటర్ ఆర్.అశ్విన్ సహాయం అందించడానికి ముందుకొచ్చారు.
అనుకోకుండా వచ్చి అప్పటికప్పుడు వీడియో చేశాను
తాను అనుకోకుండా బాబా కా ధాబాకు వచ్చానని.. వారితో మాట్లాడాక ప్రతి రోజూ నష్టాలే వస్తున్నాయని వారు చెప్పడంతో అప్పటికప్పుడు వీడియో చేసి షేర్ చేశానని బ్లాగర్ గౌరవ్ వాసన్ ఏఎన్ఐ వార్తాసంస్థకు చెప్పారు.
కాంతాప్రసాద్ ఫుడ్ స్టాల్, ఇంటిని మరమ్మతులు చేసుకోవడానికి సుమారు రూ. 2 లక్షల విరాళాలు వచ్చినట్లు గౌరవ్ చెప్పారు.
''మళ్లీ మా హోటల్‌కు కస్టమర్లు రావడమన్నది గౌరవ్ వాసన్ వల్లే సాధ్యమైంది'' అని కాంతాప్రసాద్ చెప్పారు. ''దీనికి ముందు మాకు అస్సలు వ్యాపారం జరగలేదు.. ఇప్పుడు దేశమంతా మాతో ఉంది'' అన్నారాయన.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: మేడిన్ ఆంధ్రప్రదేశ్ టెస్టింగ్ కిట్లు.. పీపీఈలు, వెంటిలేటర్లు, మాస్కుల్ని కూడా ఉత్పత్తి చేస్తున్న ఏపీ
- కరోనావైరస్ గురించి ఇంకా మనకెవరికీ తెలియని 9 విషయాలు..
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్-అమెరికా: బాధితుల్లో నల్లజాతీయులు ఎక్కువగా ఉండటానికి కారణాలేంటి?
- కరోనావైరస్: ఈ వ్యాధి చికిత్సకు క్లోరోక్విన్ పనిచేస్తుందా? అందుకు ఆధారాలు ఉన్నాయా?
- కరోనావైరస్-లాక్డౌన్ ఎప్పుడు, ఎలా ముగుస్తుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









