కరోనావైరస్-అమెరికా: బాధితుల్లో నల్లజాతీయులు ఎక్కువగా ఉండటానికి కారణాలేంటి?

అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో నల్లజాతీయులు ఎక్కువగా గుండె, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని కొందరు వైద్యులు చెబుతున్నారు

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో నల్లజాతీయులు ఎక్కువగా గుండె, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని కొందరు వైద్యులు చెబుతున్నారు

అమెరికాలోని షికాగో నగరంలో కరోనావైరస్ సోకి మరణిస్తున్న వారిలో అత్యధిక మంది నల్లజాతీయులేనని నగర వైద్య అధికారులు వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి.

షికాగో నగర జనాభాలో నల్లజాతీయులు 30 శాతం మాత్రమే ఉన్నప్పటికీ, కోవిడ్-19 మరణాల్లో 70 శాతానికి పైగా వారే ఉన్నారు. నగరంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో సగానికి పైగా నల్లజాతీయులు ఉన్నారు.

డెట్రాయిట్, మిల్వాకీ, న్యూ ఆర్లీన్స్, న్యూయార్క్ సహా నల్లజాతీయులు అధికంగా ఉన్న ఇతర నగరాలు కరోనావైరస్‌కు కేంద్రాలుగా మారాయి.

ఇప్పటి వరకు అమెరికాలో సుమారు 4 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాదాపు 13,000 మంది చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 14 లక్షల మందికి పైగా ఈ వైరస్ బారిన పడగా, దాదాపు 82,000 మంది మరణించారు.

భారత్‌లో కరోనావైరస్ కేసులు

17656

మొత్తం కేసులు

2842

కోలుకున్నవారు

559

మరణాలు

ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

‌అప్‌డేట్ అయిన సమయం 11: 30 IST

షికాగో గణాంకాలు ఏం చెబుతున్నాయి?

ఏప్రిల్ 5 నాటికి, షికాగోలో 4,680 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో 1,824 మంది నల్లజాతీయులు అని అధికారులు తెలిపారు.

ఈ నగరంలో ఆదివారం నాటికి మొత్తం 98 మంది చనిపోయారు. అందులో 72 శాతం మంది నల్లజాతీయులు. షికాగోతో పాటు ఇల్లినాయిస్ రాష్ట్రమంతటా ఈ అసమానత ప్రతిబింబించింది. ఈ రాష్ట్ర జనాభాలో నల్లజాతీయులు 14 శాతం ఉన్నారు. కోవిడ్-19 మరణాల్లో మాత్రం 41 శాతం మంది వారే.

'నాశనం చేస్తోంది'

షికాగోలో శ్వేత జాతీయులతో పోలిస్తే నల్లజాతీయులు సగటున 8.8 ఏళ్లు తక్కువ కాలం జీవిస్తున్నారని షికాగో ప్రజారోగ్య విభాగం కమిషనర్ డాక్టర్ అల్లిసన్ అర్వాడీ చెప్పారు.

"బ్లాక్ షికాగోను కరోనావైరస్ నాశనం చేస్తోంది" అని మేయర్ లోరీ లైట్‌ఫూట్ వ్యాఖ్యానించారు. అందరూ సామాజిక దూరం పాటిస్తున్నారో లేదో తనిఖీ చేసేందుకు దుకాణాలకు సిబ్బందిని పంపిస్తామని ఆమె చెప్పారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

దేశవ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉంది?

కరోనావైరస్‌కు కుల, మత, వర్ణ భేదాలు లేవని, అందరి మీద అది ఒకేలా ప్రభావం చూపుతుందని ఇన్నాళ్లూ భావించారు. కానీ, పక్క పక్కన ఉన్నా కొందరిపై ఈ మహమ్మారి ఎక్కువ హాని కలిగించే అవకాశం ఉందని తాజా గణాంకాలు చెబుతున్నాయి.

మిచిగాన్‌ జనాభాలో, ఆఫ్రికన్ అమెరికన్లు 14 శాతం మంది ఉన్నారు. కరోనావైరస్ కేసుల్లో మాత్రం 33 శాతం వారే. మరణాల్లో 41 శాతం నల్లజాతీయులేనని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మిచిగాన్‌లో నమోదైన మొత్తం కేసుల్లో 23 శాతం, మరణాల్లో 28 శాతం శ్వేతజాతీయులు ఉన్నారు.

డెట్రాయిట్‌ నగరంలో నమోదైన కేసుల్లో దాదాపు 80 శాతం మంది నల్లజాతీయులే.

షికాగో నగరంలో 98 మంది చనిపోయారు. అందులో 72 శాతం మంది నల్లజాతీయులే

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, షికాగో నగరంలో 98 మంది చనిపోయారు. అందులో 72 శాతం మంది నల్లజాతీయులే
BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

విస్కాన్సిన్‌లోని మిల్వాకీలోనూ ఇదే తరహా అసమానత కనిపిస్తోంది.

"మిల్వాకీ కౌంటీ జనాభాలో నల్లజాతీయులు ఉన్నది 26 శాతం మందే. కానీ, ఇక్కడ గత శుక్రవారం నాటికి దాదాపు 1,000 కేసులు నమోదవ్వగా, అందులో సగం పైగా కేసులు నల్లజాతీయులవే. 27 మంది చనిపోగా వారిలో 21 మంది నల్లజాతీయులే" అని ప్రోపబ్లికా అధ్యయనం వెల్లడించింది.

తీవ్రంగా ప్రభావితమైన లూసియానాలో కోవిడ్-19 కారణంగా చనిపోయినవారిలో 70శాతం మంది నల్లజాతీయులే. కానీ ఇక్కడి జనాభాలో ఆఫ్రికన్ అమెరికన్లు కేవలం 32శాతమే.

లూసియానాలో చోటుచేసుకున్న మరణాల్లో 40శాతం న్యూఆర్లీన్స్‌లోనే సంభవించాయి. ఇక్కడ జనాభాలో కూడా అధికభాగం నల్లజాతీయులే.

ఈ ప్రాంత వాసుల్లో ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటుతో బాధపడేవారి శాతం దేశ సగటు కంటే ఎక్కువగా ఉందని, అందుకే కోవిడ్-19 వారిపై ఎక్కువ ప్రభావం చూపుతోందని వైద్య అధికారులు చెబుతున్నారు.

ఈ అసమానతలకు కారణం?

మధుమేహం, గుండె జబ్బులు, శ్వాసకోశ సమస్యలు నల్లజాతి సముదాయాల్లో తీవ్రంగా ఉన్నాయని నగర మేయర్ లైట్‌ఫూట్ తెలిపారు.

“నగరంలో అందరికీ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. కానీ, ఆహార అలవాట్లలో తేడాలు, వాకింగ్ చేసేందుకు వీలుగా వీధులు లేకపోవడం వల్ల ఇక్కడి ప్రజల ఆరోగ్యంలో అసమానతలు కనిపిస్తున్నాయి" అని డాక్టర్ అర్వాడీ వివరించారు.

కరోనావైరస్ నుంచి మిమ్మల్ని మీరు ఇలా రక్షించుకోండి

కరోనావైరస్ మహమ్మారి వల్ల అమెరికాలో జాతి, ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని ఆఫ్రికన్-అమెరికన్ వైద్యుడు కామెరాన్ వెబ్ బీబీసీతో చెప్పారు.

"అమెరికా సమాజంలోని అసమానతలు, లోపాలను ఈ గణాంకాలు బహిర్గతం చేస్తున్నాయి" అని ఆయన అన్నారు.

కొందరు ప్రభుత్వ సూచనలను పెడచెవిన పెట్టడం కూడా ఈ వ్యత్యాసానికి కారణమని కొందరు అంటున్నారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)