కరోనావైరస్‌తో కరువు బారిన పడనున్న 50 కోట్ల ప్రజలు - ఐక్య రాజ్య సమితి నివేదిక

కరోనావైరస్: ప్రపంచవ్యాప్తంగా కరువుని మిగులుస్తుందా?

ఫొటో సోర్స్, Getty Images

కరోనావైరస్ ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా కనీసం 50 కోట్ల జనాభా కరువు బారిన పడే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి అధ్యయనం తెలిపింది. కరోనావైరస్ ఆర్ధిక, మానవ వనరులకి ఎటువంటి నష్టం చేకూరుస్తుంది అనే అంశంపై ఐక్యరాజ్య సమితి ఒక అధ్యయనం నిర్వహించింది.

గత 30ఏళ్లలో ప్రపంచ వ్యాప్తంగా ఒకేసారి కరువు పెరగడం ఇదే తొలిసారి అవుతుందని ఈ నివేదిక తెలిపింది. కింగ్స్ కాలేజీ లండన్, ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీలో నిపుణులు.. ఐక్యరాజ్య సమితి నిర్వహించిన అధ్యయన నివేదికను తయారు చేశారు.

వచ్చే వారంలో ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్), జి20 దేశాలకు చెందిన ఆర్ధిక మంత్రులు సమావేశం కానున్నారు.

భారత్‌లో కరోనావైరస్ కేసులు

17656

మొత్తం కేసులు

2842

కోలుకున్నవారు

559

మరణాలు

ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

‌అప్‌డేట్ అయిన సమయం 11: 30 IST

కరోనావైరస్ నుంచి మిమ్మల్ని మీరు ఇలా రక్షించుకోండి

"ఇప్పుడు తలెత్తిన ఆరోగ్య విపత్తు కంటే రానున్న ఆర్ధిక విపత్తు మరింత తీవ్ర ప్రభావం చూపిస్తుంది" అని ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీలో పని చేస్తున్న క్రిస్టోఫర్ హొయ్ అన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా కనీసం 40 -60 కోట్ల మంది ప్రజలు కరువు బారిన పడతారని ఈ నివేదిక తెలిపింది. 2030 కల్లా ప్రపంచంలో కరువుని అంతం చేయాలనే ఐక్యరాజ్య సమితి అభివృద్ధి లక్ష్యాలకు కూడా ఆటంకంగా నిలుస్తుందని పేర్కొంది.

"అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రజలకి సామాజిక భద్రతని పెంచవలసిన అవసరం ఉందని ఈ నివేదిక సూచించింది. ముఖ్యంగా కోవిడ్-19కి ప్రభావితమైన దేశాలలో ప్రజలకి అంతర్జాతీయంగా ఎటువంటి సహాయం లభించగలదో చూడాల్సిన అవసరం ఉందని" కింగ్స్ కాలేజీ లండన్ ప్రొఫెసర్ ఆండీ సంనర్ అన్నారు.

ఈ మహమ్మారి పూర్తిగా తగ్గే సమయానికి ప్రపంచ జనాభా (780 కోట్లు)లో సగం మంది కరువు అనుభవిస్తూ ఉంటారు. ఇందులో 40 శాతం మంది తూర్పు ఆసియా, పసిఫిక్, సబ్ సహారా ఆఫ్రికా, దక్షిణ ఆసియా దేశాలకి చెందినవారై ఉంటారు.

ఈ వారం మొదట్లో అభివృద్ధి చెందుతున్న దేశాలకి ఈ సంవత్సరం రుణ మాఫీలు చేస్తామని కనీసం 100 అంతర్జాతీయ సంస్థలు ప్రకటించాయి. దీంతో ఆయా దేశాలకి వారి ఆర్ధిక వ్యవస్థల్ని పునరిద్దురించుకోవడానికి కనీసం 19 లక్షల కోట్ల రూపాయిలు (25 బిలియన్ డాలర్ల నిధి) ద్రవ్య రూపంలో మిగులుతుంది.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్
వీడియో క్యాప్షన్, వీడియో: కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా?
పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)