కరోనా వైరస్‌పై వియత్నాంలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఎలా పోరాడుతోంది?

ఫేస్ మాస్కుతో వియత్నాం సైనికుడు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, వియత్నాం రాజధాని నగరానికి సమీపంలోని గ్రామాల్లోని ప్రజలందరినీ క్వారంటైన్ చేశారు

కరోనా వైరస్ ప్రభావాన్ని అరికట్టడానికి వియత్నాం ప్రజల్ని చైతన్యపరచడంలో అధికారులు చేపట్టిన చర్యలు ప్రశంసలకునోచుకుంటున్నాయి . అయితే వీటి మూల్యం ఎంత ?

హోం చిన్ మిన్ నగరంలో ప్రభుత్వ అధీనంలో నిర్బంధంలో ఉన్న ఒక మహిళతో బీబీసీ మాట్లాడింది.

వియత్నాం కరోనావైరస్ మొదటిగా పుట్టిన చైనా దేశంతో సరిహద్దు కల్గి ఉన్నప్పటికీ ఇక్కడ కేసులు చాలా తక్కువసంఖ్యలో నమోదు అయ్యాయి. కరోనావైరస్ సోకిందనే అనుమానం ఉన్న ప్రతి ఒక్కరినీ ప్రభుత్వ నిర్బంధంలో పెట్టడమే దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. రెండు వారాల ఆస్ట్రేలియా పర్యటన తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన లాన్ ఆన్ ని ప్రభుత్వ అధీనంలో ఉన్న నేషనల్ యూనివర్సిటీలో నిర్బంధంలో ఉంచారు. అక్కడ ఆమె ఎదుర్కొన్న పరిస్థితులను బీబీసీకి వివరించారు .

భారత్‌లో కరోనావైరస్ కేసులు

17656

మొత్తం కేసులు

2842

కోలుకున్నవారు

559

మరణాలు

ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

‌అప్‌డేట్ అయిన సమయం 11: 30 IST

అక్కడ ఉన్న టాయిలెట్ నల్లని మురికి పట్టి సింక్ అంతా నీటితో నిండిపోయి ఉందని లాన్ ఆన్ చెప్పారు. "దుర్గంధం లేదు కానీ చాలా మురికిగా ఉంది. పడుకునే మంచం అంతా తుప్పు పట్టి ఉంది. సాలీళ్లు అక్కడ అంతా గూళ్ళుపెట్టాయి" అని చెప్పారు.

"మొదటి రోజు రాత్రి కొంత మందికి పడుకోవడానికి ఒక్క చాప మాత్రమే ఇచ్చారు. తలగడలు కానీ దుప్పట్లు కానీ ఇవ్వలేదు. గదిలో ఓకే ఒక్క సీలింగ్ ఫ్యాన్ ఉంది. బయట వాతావరణం వేడిగా ఉండటంతో మా గదిలో ఉన్న ఒకరికి జ్వరం కూడా వచ్చింది. ఆ వ్యక్తిని పర్యవేక్షణలో పెట్టాల్సి వచ్చింది’' అని ఆమె చెప్పారు.

"అదే ప్రదేశానికి చాలా మంది వస్తూ ఉండేవారు. అక్కడ నెలకొన్న పరిస్థితులు మాత్రం మా భయాలని మరింత పెంచాయి. అక్కడ ఎవరికైనా కరోనా వైరస్ ఉందేమోనని భయం కూడా మమ్మల్ని వెంటాడింది" అని ఆమె అన్నారు.

"మాకు పెద్దగా సౌకర్యాలు అక్కరలేదు. కానీ మేము ఉంటున్న ప్రాంతం శుభ్రంగా ఉండటం అవసరం. మురికిగా ఉన్నటాయిలెట్లు, సింక్‌లు, వాష్ బేసిన్లు వైరస్‌కి మరింత కారణమవుతాయి. ఒకవేళ మాకు ఏదన్నా అయి ఉంటే అక్కడ ఉన్నపరిస్థితులు మరింత విషమ స్థితిలోకి నెట్టేసి ఉండేవి.’’

వియత్నాంలో విమానం దిగుతున్న ప్రయాణీకులు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, మార్చి 8వ తేదీ తర్వాత దేశంలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరినీ వియత్నాం ప్రభుత్వం గుర్తించి, క్వారంటైన్ చేస్తోంది

వియత్నాం ప్రభుత్వం వైద్య సిబ్బందిని, భద్రతా దళాలను, సామాన్య ప్రజలను రంగంలోకి దించి కరోనాపై యుద్ధం ప్రకటించింది. అయితే వియత్నాం అవలంబించిన విధానం పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించి కరోనా వ్యాప్తిని అరికట్టామని చెప్పుకుంటున్న దక్షిణ కొరియా పాటించిన పద్దతికి భిన్నంగా ఉంది.

9.6 కోట్ల జనాభా కలిగిన వియత్నాంలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం కరోనా వ్యాప్తిని అరికట్టడానికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంది. వియత్నాంలో నమోదు అయిన తొలి 141 కేసులు (మార్చ్ 25 వ తేదీ నాటికి) అన్నీ విదేశాల నుంచి వచ్చినవే అని తేలడంతో విదేశీ ప్రయాణం చేసి వచ్చిన వారందరినీ నిర్బంధంలో ఉంచాలని ఆదేశించింది.

అలా వెతికి పట్టుకున్న వారిలో ముగ్గురు బ్రిటిష్ పర్వతారోహకులు, పర్యటకులు ఉన్నారు. వారంతా 20 సంవత్సరాల వయస్సులో ఉన్నవారే. వారితో పాటు ప్రయాణం చేసి వచ్చిన మరో అమ్మాయికి కోవిడ్ 19 పాజిటివ్ అని తేలింది. వీరు వియత్నాంలో బస చేసిన హాస్టల్‌కి వెళ్లి పోలీసులు పట్టుకుని నిర్బంధంలో ఉంచారు. వీరి నిర్బంధం పూర్తి అవ్వగానే హాస్టల్ సిబ్బంది వారుపడుకున్న పరుపులని ఇతర వస్తువులను కాల్చేశారు.

అందులో ఒక అమ్మాయి అలైస్ పార్కర్ హాస్పిటల్ చాలా భయంకరంగా ఉందని చెప్పారు. అక్కడ టాయిలెట్ ఉంది కానీ స్నానం చేసే అవకాశం లేదని చెప్పారు. చాలా మంది చెప్పిన విషయాలు వింటుంటే మేము చాలా మందికంటే మెరుగైన స్థితిలో ఉన్నామని అన్పించింది అన్నారు.

యూరోపియన్ దేశాల లాగే వియత్నాం ప్రజలను లాక్ డౌన్ చేయలేకపోయింది. కానీ వైరస్ సోకిన వారిని మాత్రం నిర్బంధంలో ఉంచింది.

అలా నిర్బంధంలో సుమారు 21,000 మంది ఉండగా మరో 30,000 మంది స్వీయ నిర్బంధంలో ఉన్నారని మార్చి 25 వతేదీన ఆసియా న్యూస్ రిపోర్టింగ్ పేర్కొంది.

రెండవ దశలో తలెత్తుతున్న ఇన్ఫెక్షన్లు అరికట్టడానికి ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవడం ప్రారంభించింది . మార్చి 22 వతేదీ నుంచి వియత్నాం విదేశీ ప్రయాణికులను దేశంలో అడుగు పెట్టకుండా కట్టడి చేసింది. వియత్నాం దేశస్తులని, వారి కుటుంబ సభ్యులని కూడా విదేశీ ప్రయాణం చేసి వస్తే దేశంలోకి అనుమతించటం లేదు.

మార్చి 8వ తేదీ నుంచి దేశంలో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహిస్తోంది. సామాజికంగా కరోనా వైరస్ వ్యాప్తిచెందే అవకాశం ఉన్న ఈ దశలో కఠిన చర్యలు తీసుకోవడం అవసరమని వియత్నాం ప్రధాని గుయెన్ క్సుయాన్ అన్నారు.

వియత్నాంలో జ్వరం పరీక్షలు చేస్తున్న వైద్య సిబ్బంది

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, దక్షిణ కొరియా వంటి ధనిక దేశాలకంటే వియత్నాం తక్కువ మందికి వైద్య పరీక్షలు జరిపింది

వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో వియత్నాం చేపట్టిన చర్యలు ప్రశంసలకు నోచుకున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించడం వలన వైరస్ వ్యాప్తి అరికట్టడానికి తోడ్పడిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.

వియత్నాంలో ఒకే ఒక్క పాలక పార్టీ ఉంది. ప్రభుత్వ భద్రతా దళాలు మిలిటరీ, పార్టీ కూడా ఈ మహమ్మారిని ఎదుర్కోవటానికి సంయుక్తంగా పని చేశాయని న్యూ సౌత్ వేల్స్ కాన్‌బెర్రా యూనివర్సిటీ ప్రొఫెసర్ కార్ల్ తాయేర్ అన్నారు.

‘ప్రజలను చైతన్యవంతం చేయడం వలన చుట్టుపక్కల వారిపై దృష్టి పెట్టడం మాత్రమే కాకుండా నిర్బంధంలో పెడతారని భయంతో కొంతమంది రహస్యంగా ఉండిపోయారు' అని బీబీసీ వియత్నాం ఎడిటర్ జియాంగ్ గుయెన్ అన్నారు.

చైతన్యవంతమైన సమాజం నిర్బంధంలో ఉన్న ప్రజలపై ప్రభుత్వం పర్యవేక్షణ ప్రజల గోప్యతను హరించిందని కొంతమంది అభిప్రాయ పడ్డారు.

ఆయితే ఇదంతా ప్రజల సంక్షేమం కోసమే అని ప్రభుత్వ మీడియా చేసిన ప్రచారం బాగా పనికి వచ్చింది. 1975లో అమెరికాపై చేసిన మిలిటరీ యుద్ధ ప్రాతిపదికన ప్రజలు మళ్లీ కరోనా వైరస్ నిర్మూలనకు కూడా సమాయత్తమవ్వాలని ఆ దేశ ప్రధాని ఇచ్చిన పిలుపు కూడా బాగా పని చేసింది.

రానున్న రోజుల్లో దేశంలో కొన్ని వేల కేసులు నమోదు కావచ్చని ఆయన అన్నారు. అమెరికాతో జరిగిన యుద్ధంలో ధ్వంసమైన బాచ్ మై హాస్పిటల్ ప్రస్తుతం చాలా మంది డాక్టర్లు సిబ్బందికి కోవిడ్ 19 సోకింది. అక్కడ పని చేస్తున్న 500 మంది వైద్య సిబ్బంది కూడా కరోనా వైరస్ పరీక్షలు చేయించుకుంటున్నారు.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్
వీడియో క్యాప్షన్, వీడియో: కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా?
పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)