కోవిడ్: తెలంగాణ సరిహద్దుల్లో ఆంధ్రప్రదేశ్ అంబులెన్సుల నిలిపివేత - Newsreel

తెలంగాణ సరిహద్దులో ఆగిపోయిన అంబులెన్సులు

ఫొటో సోర్స్, Ani

ఆంధ్రప్రదేశ్ నుంచి కరోనా రోగులను తీసుకొస్తున్న అంబులెన్సులను తెలంగాణ సరిహద్దులలో నిలిపివేస్తున్నారని ఏఎన్ఐ వార్తాసంస్థ వెల్లడించింది.

తెలంగాణలోని ఆసుపత్రులతో వారికి బెడ్ కేటాయించినట్లు ఆధారం చూపిస్తేనే రానిస్తున్నారు.

అలా కాకుండా వచ్చిన అంబులెన్సులను సరిహద్దుల నుంచే తిప్పి పంపిస్తున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

దీంతో ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తున్న అంబులెన్సులు తెలంగాణ సరిహద్దులలో తెలంగాణ సరిహద్దుల్లో నిలిచిపోయాయి.

కాగా, ఆంధ్రప్రదేశ్ ఉన్నతాధికారులు ఈ విషయంలో తెలంగాణ ఉన్నతాధికారులతో మాట్లాడారని.. సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ అధికారులు హామీ ఇచ్చారని ఏఎన్ఐ తెలిపింది.

పుష్ప శ్రీవాణి

ఫొటో సోర్స్, facebook/pushpasreevani

ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి కరోనా పాజిటివ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణికి కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధరణైంది.

ఆమె భర్తకు కూడా పాజిటివ్ అని తేలింది.

వైరస్ లక్షణాలు కనిపించడంతో ఇద్దరూ టెస్ట్ చేయించుకోగా కరోనా సోకినట్లు నిర్ధరణైంది.

ప్రస్తుతం దంపతులిద్దరూ విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

జూనియర్ ఎన్టీఆర్

ఫొటో సోర్స్, facebook/Jr.NTR

జూనియర్ ఎన్టీఆర్‌కు కరోనా పాజిటివ్

జూనియర్ ఎన్టీఆర్ కరోనా బారిన పడ్డారు. ట్విటర్ వేదికగా ఆయన ఈ విషయాన్ని కొద్దిసేపటి కిందట వెల్లడించారు.

''నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణైంది. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. ఎవరూ ఆందోళన చెందవద్దు. నేను, నా కుటుంబ సభ్యులం ఐసోలేషన్‌లో ఉన్నాం. వైద్యుల పర్యవేక్షణలో అన్ని కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తున్నాం. కొద్దిరోజులుగా నన్ను కలిసినవారంతా టెస్ట్ చేయించుకోవాలని కోరుతున్నాను'' అంటూ ఆయన ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

కాగా ఇటీవలే టాలీవుడ్ హీరోలు పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ కూడా కరోనా బారిన పడ్డారు.

సినీ పరిశ్రమకు చెందిన మరికొందరూ కోవిడ్ బారిన పడి కోలుకున్నారు.

కొలరాడో స్ప్రింగ్స్ పోలీస్

ఫొటో సోర్స్, Getty Images

అమెరికాలోని కొలరాడో స్ప్రింగ్స్‌లో బర్త్ డే పార్టీలో కాల్పులు, ఆరుగురి మృతి

అమెరికాలోని కొలరాడో స్ప్రింగ్స్‌లో ఆదివారం జరిగిన ఒక పుట్టినరోజు వేడుకలో ఆరుగురిని కాల్చి చంపిన ఒక వ్యక్తి తర్వాత తనను తాను కాల్చుకుని చనిపోయినట్లు పోలీసులు చెప్పారు.

ఒక మొబైల్ హోం పార్కులో కొన్ని కుటుంబాల వారు ఒక ట్రైలర్‌లో వేడుక చేసుకుంటున్నప్పుడు ఈ కాల్పుల ఘటన జరిగింది.

నిందితుడు బాధితుల్లో ఉన్న ఒక యువతికి బాయ్‌ఫ్రెండ్‌గా భావిస్తున్నారు.

"అక్కడికి వచ్చిన అతడు నేరుగా ట్రైలర్ లోపలికి వెళ్లి పార్టీలో ఉన్నవారిపై కాల్పులు జరపడం ప్రారంభించాడు, తర్వాత తనను తాను కాల్చుకుని చనిపోయాడు" అని కొలరాడో స్ప్రింగ్స్ పోలీస్ శాఖ చెప్పింది.

నిందితుడు ఎందుకు కాల్పులు జరిపాడనేది ఇంకా తెలీలేదు. మృతులు ఆరుగురూ పెద్దవారే. కానీ కాల్పులు జరిగిన సమయంలో ట్రైలర్‌లో కొందరు పిల్లలు కూడా ఉన్నారు.

బాధితులు, కాల్పులు జరిపిన వ్యక్తి వివరాలను పోలీసులు వెల్లడించలేదు.

"ఈ దారుణ ఘటన వల్ల ఆరుగురు చనిపోయారు ట్రైలర్‌లో గాయపడకుండా తప్పించుకున్న పిల్లలు ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులతో ఉన్నారు" అని స్థానిక పోలీసులు చెప్పారు.

స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.18కి కాల్ రాగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

మేం అక్కడకు వెళ్లగానే, ఆరు మృతదేహాలతోపాటూ, తీవ్రంగా గాయపడ్డ ఒక పురుషుడు కనిపించారు. మేం ఆయన్ను స్థానిక ఆస్పత్రికి తరలించాం. తర్వాత ఆయన చనిపోయారు" అని పోలీసులు ఒక ప్రకటనలో చెప్పారు.

ఈ ఘటనలో గాయపడినవారికి, కుటుంబ సభ్యులను కోల్పోయినవారికి కొలరాడో మేయర్ జాన్ సుథెర్స్ తన సంతాపం ప్రకటించారు.

ఈ ఏడాది మార్చిలో కొలరాడో బౌల్డర్ నగరంలోని ఒక గ్రాసరీ స్టోర్‌లో కాల్పులు జరిగాయి. ఆ ఘటనలో పది మంది చనిపోయారు. నిందితుడిని తర్వాత అరెస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)