దక్షిణ మధ్య రైల్వే మూసివేస్తున్న 31 రైల్వే స్టేషన్లు ఇవే.. - BBC Newsreel

ఫొటో సోర్స్, Getty Images
ఆదాయం లేని 31 స్టేషన్లను మూసివేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఇందులో 29 స్టేషన్లను ఫిబ్రవరి 1వ తేదీ నుంచి, మరో రెండు స్టేషన్లను ఏప్రిల్ 1వ తేదీ నుంచి మూసివేస్తున్నట్లు తెలిపింది.
వీటిలో 16 స్టేషన్లు సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలోను, మూడు స్టేషన్లు గుంతకల్ రైల్వే డివిజన్ పరిధిలోను, నాలుగు స్టేషన్లు గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోను, ఒకటి నాందేడ్ రైల్వే డివిజన్ పరిధిలోను, ఏడు స్టేషన్లు హైదరాబాద్ డివిజన్ పరిధిలోను ఉన్నాయి.
మూతపడనున్న 31 స్టేషన్ల వివరాలు..
స్టేషన్ పేరు......సెక్షన్......డివిజన్
నవాడ్గి......కమలాపూర్-కురుకొట్ట...... సికింద్రాబాద్
అంస్కాపూర్......ఆర్మూర్-మోర్తాడ్...... సికింద్రాబాద్
మరుగుట్టి......హళ్లికేడ్ కే - కమలాపూర్...... సికింద్రాబాద్
పోడూర్......లింగంపేట జగిత్యాల - గంగాధర......సికింద్రాబాద్
మామిడిపల్లి......నిజామాబాద్ - ఆర్మూర్...... సికింద్రాబాద్
కట్టలి...... హమ్నాబాద్ - హళ్లికేడ్ కే...... సికింద్రాబాద్
కట్లకుంట మేడిపల్లి......కోరట్ల - లింగంపేట జగిత్యాల......సికింద్రాబాద్
మైలారం......ధరూర్ - గోడంగుర...... సికింద్రాబాద్
మహాగావ్......కమలాపూర్ - కోరుకోట...... సికింద్రాబాద్
కొత్తపల్లి హవేలి......గంగాధర - కరీంనగర్...... సికింద్రాబాద్
చిట్ట హాల్ట్......మటల్‌కుంట - బీదర్...... సికింద్రాబాద్
నందగావ్ హళ్లి......హళ్లికేడ్ బి - హమ్నాబాద్......సికింద్రాబాద్
గేట్ కారేపల్లి......పోచారం - కారేపల్లి...... సికింద్రాబాద్
నుకన్‌పల్లి మల్లియాల్......లింగంపేట్ జగిత్యాల్ - గంగాధర......సికింద్రాబాద్
నాగేశ్‌వాడి హాల్ట్......అంబిక రోహిన - చాకూర్...... సికింద్రాబాద్
మారుతి హాల్ట్......పాన్‌గావ్ - ఘాట్ నందూర్......సికింద్రాబాద్
వలివేడు హాల్ట్...... పులిచెర్ల - దామల్‌చెరువు......గుంతకల్లు
రెడ్డిపల్లి......ఓబులవారిపల్లె - పుల్లంపేట......గుంతకల్లు
మళ్లపగేట్ హాల్ట్......గుంతకల్లు జంక్షన్ - మడ్డికెర......గుంతకల్లు
లింగంగుంట్ల హాల్ట్......సిరిపురం - పెద్దకూరపాడు......గుంటూరు
గుడిపూడి......పెద్దకూరపాడు - సత్తెనపల్లి......గుంటూరు
గుడిమెట్ట హాల్ట్......యడవల్లి - సోమిదేవిపల్లి......గుంటూరు
మండపాడు హాల్ట్......బండారుపల్లి - సిరిపురం...... గుంటూరు
పింప్ల చౌరే హాల్ట్......మర్సుల్ - బసంట్...... నాందేడ్
వల్లూరు హాల్ట్......ఇతిక్యాల - మనోపాడు...... హైదరాబాద్
షకార్‌నగర్......జనకంపేట - మనోపాడు......హైదరాబాద్
శంకర్‌పూర్ హాల్ట్......మీర్జాపల్లి - అంకంపేట......హైదరాబాద్
యడపల్లి......జనకంపేట - బోధన్......హైదరాబాద్
చింకా...... ధర్మాబాద్ - కర్ఖేలి......హైదరాబాద్
పీజేపీ రోడ్ హాల్ట్(01.04.2021 నుంచి)......పాండురంగస్వామి రోడ్ - గద్వాల్......హైదరాబాద్
డోకుర్ (01.04.2021 నుంచి)......దేవరకద్ర - కౌకుంట్ల......హైదరాబాద్

ఫొటో సోర్స్, Reuters
కరోనావైరస్ ట్యాక్స్: ధనవంతులపై ప్రత్యేక పన్ను విధించిన అర్జెంటీనా ప్రభుత్వం
కోవిడ్-19తో కుప్పలు తెప్పలుగా వచ్చి పడిన వైద్య ఖర్చులను భరించేందుకు, తీవ్రంగా నష్టపోతున్న వ్యాపారులను ఆదుకొనేందుకు.. అర్జెంటీనాలోని ధనికులపై కరోనావైరస్ ట్యాక్స్ పేరుతో ప్రత్యేక పన్నును విధిస్తున్నారు.
తమ ఆస్తుల విలువ 200 మిలియన్ పెసోలు (16.76 కోట్ల రూపాయల) కంటే ఎక్కువ ఉంటే.. దేశంలోని ఆస్తులపై 3 శాతం, విదేశాల్లోని ఆస్తులపై 5 శాతం పన్నును చెల్లించాల్సి ఉంటుంది.
దేశంలో దాదాపు 12,000 మందికి ఈ పన్ను వర్తిస్తుంది. ఈ ట్యాక్స్ ద్వారా మూడు బిలియన్ డాలర్లను (సుమారు రూ. 21,872 కోట్లు) సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది.
మిలియనీర్స్ ట్యాక్స్‌గా పిలుస్తున్న ఈ పన్నుకు ఇప్పటికే దేశ సెనేటర్లు ఆమోదం తెలిపారు. అయితే దీనిపై ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
ప్రస్తుతం ఒకసారి మాత్రమే విధించేలా తీసుకొచ్చిన ఈ పన్నును.. శాశ్వతంగా ఇలానే ఉంచేస్తారేమోనని ఆందోళనలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
కరోనావైరస్‌తో అర్జెంటీనా తీవ్రంగా ప్రభావితమైంది. దేశంలోని 40 శాతం ప్రజలు ఇప్పటికే పేదరికంలో గడుపుతున్నారు. ఇక్కడ నిరుద్యోగ రేటు 11 శాతం వరకు ఉంది. ఈ నేపథ్యంలో పరిస్థితులను కరోనావైరస్ మరింత దిగజార్చింది.
ఇవి కూడా చదవండి:
- మదనపల్లె హత్యలు: ‘కాళికనని చెబుతూ.. నాలుక కోసి..
- మెహులీ ఘోష్: జాతరలో బెలూన్లు కాల్చిన ఈ షూటర్ గురి ఇప్పుడు ఒలింపిక్స్‌పై
- గీతా గోపీనాథ్‌పై అమితాబ్ బచ్చన్ ప్రశంసల మీద ఎందుకు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి?
- ఆంధ్రప్రదేశ్: హిందూ దేవతల విగ్రహాలు ధ్వంసం చేశానన్న ప్రవీణ్ చక్రవర్తి అసలు ఎవరు?
- వైట్ టైగర్: హాలీవుడ్ సినిమాల్లో అసలైన భారతదేశాన్ని చూపించేదెప్పుడు
- కాసిం సులేమానీ హత్య ఐఎస్‌కు వరంగా మారుతుందా
- మగాళ్లు రేప్ ఎందుకు చేస్తారు? అలాంటి ఆలోచనలు వారికి ఎందుకు వస్తాయి?
- సుభాష్ చంద్రబోస్ 'ద గ్రేట్ ఎస్కేప్': బ్రిటిష్ వాళ్ల కళ్లుగప్పి నేతాజీ దేశం ఎలా దాటారు?
- ISWOTY - సుశ్రీ దివ్యదర్శిని ప్రధాన్: ఒడిశా నుంచి దూసుకొచ్చిన ఆఫ్-స్పిన్నర్
- సూర్యుడ్ని కోల్పోయిన బీచ్.. ఇక్కడ పట్టపగలైనా చలి, చీకటే...
- బంగారం స్మగ్లింగ్‌లో భారత్ గుత్తాధిపత్యానికి తెరదించిన పాకిస్తాన్ 'గోల్డ్ కింగ్'
- అర్నబ్ గోస్వామి వాట్సాప్ చాట్ లీక్ వివాదం.. ఇమ్రాన్ ఖాన్ వరుస ట్వీట్లు.. మోదీపై ఆరోపణలు
- సింగపూర్: కోట్లు ఇస్తామన్నా ఈ రెండు ఇళ్ల యజమానులు కదలటం లేదు.. ఎందుకు?
- కోడి రామ్మూర్తి నాయుడు: ‘కలియుగ భీముడు’గా పేరు తెచ్చుకున్న ఈ తెలుగు వీరుడి కథేంటి?
- సెక్స్ అపోహలు: లైంగిక భాగస్వాములు ఎవరికి ఎక్కువగా ఉంటారు... పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








