గీతా గోపీనాథ్‌పై అమితాబ్ బచ్చన్ ప్రశంసల మీద ఎందుకు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి?

ఫొటో సోర్స్, Getty Images
‘‘ఎంత అందమైన ముఖం. ఆమె ఆర్థికవేత్త అని ఎవరూ ఊహించరు.’’
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) చీఫ్ ఎకానమిస్ట్, భారత సంతతికి చెందిన గీతా గోపీనాథ్‌ను ఉద్దేశించి నటుడు అమితాబ్ బచ్చన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
టీవీ షో ‘‘కౌన్ బనేగా కరోడ్‌పతి’’ కార్యక్రమంలో గీతా గోపీనాథ్‌కు సంబంధించి ప్రశ్నను ఓ మహిళా కంటెస్టెంట్‌ను అడుగుతూ అమితాబ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
గీత ఫోటోను స్క్రీన్‌పై చూపిస్తూ.. ‘‘ఎంత అందమైన మొహం.. ఆమె ఆర్థికవేత్తగా పనిచేస్తున్నారని ఎవరూ ఊహించలేరు’’అని అమితాబ్ అన్నారు.
అమితాబ్ వ్యాఖ్యలకు సంబంధించిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఫొటో సోర్స్, Gita Gopinath/Twitter
సంతోషంలో గీత
కౌన్ బనేగా కరోడ్‌పతిలో తన గురించి ప్రశ్న అడగడంపై గీతా గోపీనాథ్ కూడా సంతోషం వ్యక్తంచేశారు.
‘‘దీన్ని నేను ఎప్పటికీ మరచిపోలేను. దిగ్గజ నటుడు అమితాబ్‌కు నేను వీరాభిమానిని. ఆయన నాపై ప్రశ్న అడగడం ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోంది’’అని గీత ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
అమితాబ్ వ్యాఖ్యలను గీత ప్రశంలుగా తీసుకున్నారు. అయితే చాలా మంది సోషల్ మీడియాలో అమితాబ్‌పై విమర్శలు సంధిస్తున్నారు. మహిళలపై పక్షపాతం చూపేలా అమితాబ్ వ్యాఖ్యానించారని అంటున్నారు.
ఈ అంశంపై భారత ఆర్థికవేత్త రూపా సుబ్రహ్మణ్య స్పందించారు. ‘‘ఈ వ్యాఖ్యలు చూడటానికి చాలా పక్షపాతంతో, అవివేకంగా అనిపిస్తున్నాయి. వీటిని ఖండించాల్సింది పోయి మీరు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. అంటే మహిళలపై పక్షపాతంతో చేసే వ్యాఖ్యలను మీరు పట్టించుకోనట్లు అనిపిస్తోంది’’అని రూప వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
రూప సుబ్రహ్మణ్యతోపాటు మరికొంత మంది మహిళలు కూడా అమితాబ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు.
‘‘అందాన్ని తెలివితో పోలుస్తూ చేసిన ఆ వ్యాఖ్యలు నాకు అసలు నచ్చలేదు. అందమైన మహిళలు ఆర్థికవేత్తలు అవ్వలేరని అమితాబ్ అవివేకంతో చెబుతున్నట్లు ఉంది’’అని నమిత గిడ్వానీ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
‘‘నిజానికి ఇది మహిళలపై పక్షపాతం చూపించే వ్యాఖ్య. మీరు(గీత) ఒక మేధావి. కానీ అమితాబ్ మాత్రం మీ అందం గురించి మాట్లాడుతున్నారు. మన భవిష్యత్ తరాలకు ఎప్పటికీ గుర్తుండిపోయే విజయాల గురించి మనం మాట్లాడుకోవాలి. అంతేకానీ అందచందాల గురించి కాదు. మంచి అవకాశాలను అమితాబ్ వృథా చేస్తున్నారు’’అని మరో ట్విటర్ వినియోగదారుడు వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
‘‘ఆర్థికవేత్తలు అందంగా ఉండకూడదని అమితాబ్ భావిస్తున్నట్లున్నారు. సినిమా తెరలపై వివేకంతో మాట్లాడేవారికి.. నిజ జీవితంలో అంత వివేకం ఉండదని మరోసారి ఆయన నిరూపించారు’’అని లలిత వ్యాఖ్యానించారు.
‘‘ఈ వీడియోను నేను పదిసార్లు చూశాను. ముఖ్యంగా అక్కడవున్న మహిళా కంటెస్టెంట్ ముఖ కవళికలు గమనించాను. ఆమె కాసేపు గందరగోళంలో పడినట్లు అనిపించారు. నేను అంత అందంగా లేనా? అనే ఆలోచన ఆమెలో వచ్చినట్లు ఉంది’’అని మరో ట్విటర్ వినియోగదారుడు వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Gita Gopinath/Twitter
అదే సమయంలో చాలా మంది అమితాబ్‌ను సమర్థిస్తున్నారు కూడా. కేవలం గీతను ప్రశంసిస్తూ అమితాబ్ వ్యాఖ్యలు చేశారని, దీనిలో ఎలాంటి తప్పూలేదని అంటున్నారు.
‘‘ఆర్థికవేత్తలు చాలా సీరియస్‌గా ఉంటారని, కానీ గీత అలా కాదని అమితాబ్ చెప్పాలని భావించి ఉండొచ్చు’’అని ట్విటర్ వినియోగదారుడు చెప్పారు.
మహిళల విషయంలో ‘‘బ్యూటీ విత్ బ్రెయిన్’’అనే అంశంపై చర్చ ఎప్పటినుంచో నడుస్తోంది. కొంత మంది ఈ వ్యాఖ్యలను ప్రశంసలుగా భావించరు. మహిళలపై పక్షపాతం, వివక్షలను ఈ వ్యాఖ్యలు ప్రోత్సహిస్తున్నాయని.. అందమైన మహిళలకు తెలివి అంతగా ఉండదనే అర్థాన్ని ఇవి ఇస్తున్నాయనేది వారి అభిప్రాయం.
మహిళలను ప్రతిభ, విజయాల ఆధారంగా కాకుండా వారి శరీరాలు, ముఖాల ఆధారంగా అంచనా వేయడంపై ఎప్పటినుంచో చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

ఫొటో సోర్స్, Geeta Gopinath/Twitter
గీతా గోపీనాథ్ ఎవరు?
2018లో భారత సంతతికి చెందిన ప్రొఫెసర్ గీతా గోపీనాథ్.. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) చీఫ్ ఎకానమిస్ట్‌గా నియమితులయ్యారు.
హార్వర్డ్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ స్టడీస్ ఆఫ్ ఎకానమిక్స్‌లో ప్రొఫెసర్‌గా గీత పనిచేసేవారు. ఇంటర్నేషనల్ ఫైనాన్స్, మ్యాక్రో ఎకానమిక్స్‌లో ఆమె పరిశోధనలు చేశారు.
‘‘ప్రపంచ ప్రముఖ ఆర్థికవేత్తల్లో గీతా గోపీనాథ్ ఒకరు. ఆమెకు అద్భుత మేధోశక్తి, అనుభవం ఉన్నాయి’’అని గీత నియామక సమయంలో ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టినా లగార్డే వ్యాఖ్యానించారు.
ఐఎంఎఫ్‌లో కీలక పదవిని చేపట్టిన భారత ప్రముఖల్లో గీత రెండోవారు. భారత రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కూడా ఇదివరకు చీఫ్ ఎకానమిస్ట్‌గా పనిచేశారు.
గత ఏడాది గీతా గోపీనాథ్‌ను రాష్ట్ర ఆర్థిక సలహాదారుగా కేరళ ప్రభుత్వం నియమించింది. గీత జన్మించింది కేరళలోనే.
గీతను ప్రభుత్వ ఆర్థిక సలహాదారుగా నియమించే సమయంలో పినరయి విజయన్ ప్రభుత్వం.. సొంత పార్టీలోనే కొందరి నుంచే వ్యతిరేకతను ఎదుర్కొంది.
ఈ పదవిని తనకు ఇవ్వడం గర్వకారణంగా అనిపిస్తోందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గీత చెప్పారు.

ఫొటో సోర్స్, IMF/Twitter
దిల్లీలో విద్యాభ్యాసం..
అమెరికా ఎకానమిక్స్ రివ్యూ కో ఎడిటర్‌గానూ గీత పనిచేస్తున్నారు. అమెరికాకు చెందిన నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ (ఎన్‌బీఈఆర్) సంస్థలోని ఇంటర్నేషనల్ ఫైనాన్స్ అండ్ మ్యాక్రోఎకానమిక్స్ విభాగం కో డైరెక్టర్‌గానూ ఆమె కొనసాగుతున్నారు.
వాణిజ్యం, పెట్టుబడులు, అంతర్జాతీయ సంక్షోభం, ద్రవ్య విధానాలు, రుణాలు తదితర అంశాలపై గీత 40కిపైగా పరిశోధనా పత్రాలు ప్రచురించారు.
2001 నుంచి 2005 మధ్య షికాగో యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. 2005లో హార్వర్డ్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు.
2010లో ఆమె అదే వర్సిటీ ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందారు. 2015లో ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ ఎకానమిక్స్ ప్రొఫెసర్‌గానూ బాధ్యతలు తీసుకున్నారు.
గీత మాస్టర్ డిగ్రీ వరకు భారత్‌లోనే చదువుకున్నారు. 1992లో దిల్లీ యూనివర్సిటీకి చెందన లేడీ శ్రీరామ్ కాలేజీ నుంచి ఎకానమిక్స్‌లో గీత డిగ్రీ పట్టా పొందారు.
ఆ తర్వాత దిల్లీ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్‌లో మాస్టర్ డిగ్రీ చదివారు. 1994లో ఆమె వాషింగ్టన్ యూనివర్సిటీలో చేరారు.
2001లో ప్రిన్సెటన్ యూనివర్సిటీ నుంచి ఎకానమిక్స్‌లో పీహెచ్‌డీ పట్టా పొందారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: హిందూ దేవతల విగ్రహాలు ధ్వంసం చేశానన్న ప్రవీణ్ చక్రవర్తి అసలు ఎవరు?
- వూహాన్లో కోవిడ్-19 విజృంభణకు ఏడాది: కరోనావైరస్పై చైనా విజయం సాధించిందా? లేక నిజాలను దాచిపెడుతోందా?
- అశోక్ గజపతి రాజు ఇంటర్వ్యూ: ‘రాజకీయాలు దిగజారాయని మనం దిగజారకూడదు’
- సింగర్ సునీత వివాహం: మహిళలు రెండో పెళ్లి చేసుకోవడం తప్పా
- అతి సాధారణ మహిళలు నాజీ క్యాంపుల్లో ‘రాక్షసుల్లా’ ఎలా మారారు?
- భారత్‌ను పొగిడిన పాకిస్తానీ టీవీ ప్రజెంటర్ - దేశద్రోహి అంటున్న నెటిజన్లు.. సమర్థిస్తున్న సెలబ్రిటీలు
- ఇస్లామిక్ స్టేట్: పాకిస్తాన్ నుంచి సిరియాలోని మిలిటెంట్లకు నిధులు ఎలా వెళ్తున్నాయి?
- బంగారం స్మగ్లింగ్‌లో భారత్ గుత్తాధిపత్యానికి తెరదించిన పాకిస్తాన్ 'గోల్డ్ కింగ్'
- సిరాజ్: తండ్రి కల నెరవేర్చాడు.. కానీ చూసి సంతోషించడానికి ఆ తండ్రి ఇప్పుడు లేరు
- అయిదేళ్లుగా స్నానం చేయడం మానేసిన డాక్టర్.. అసలు రోజూ స్నానం అవసరమా?
- అర్నబ్ గోస్వామి వాట్సాప్ చాట్ లీక్ వివాదం.. ఇమ్రాన్ ఖాన్ వరుస ట్వీట్లు.. మోదీపై ఆరోపణలు
- సెక్స్ అపోహలు: లైంగిక భాగస్వాములు ఎవరికి ఎక్కువగా ఉంటారు... పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








