కరోనా వ్యాక్సీన్: ఆస్ట్రాజెనెకా క్లినికల్ ట్రయల్స్ నిలిచిపోవడం దేనికి సంకేతం? ఈ వ్యాక్సీన్ సురక్షితమేనా?

ఫొటో సోర్స్, Oxford University / John Cairns
పరీక్షల సమయంలో ఒక వలంటీర్ అస్వస్థతకు గురికావడంతో కరోనావైరస్ చివరి దశ క్లినికల్ ట్రయల్స్ నిలిపివేశారు. ఇది ఇప్పుడు చాలా ప్రమాదకరంగా అనిపిస్తోంది.
కానీ, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి ఈ వ్యాక్సీన్ తయారుచేస్తున్న ఆస్ట్రాజెనెకా సంస్థ ఇలాంటి విరామం మామూలే అంటోంది. ఈ రియాక్షన్‌కు ఏదైనా ‘వివరించలేని అనారోగ్యం’ కారణం అయ్యుండవచ్చని అనుమానిస్తోంది.
అయితే క్లినికల్ ట్రయల్ నిలిచిపోవడం ఎంత సాధారణం? దీనివల్ల ఎంతో ఎదురుచూస్తున్న కోవిడ్-19 వ్యాక్సీన్ ఏమవుతుంది?

ఫొటో సోర్స్, Getty Images
వ్యాక్సీన్ ట్రయల్ గురించి మనకు ఏం తెలుసు?
కరోనావైరస్ నుంచి రోగనిరోధక శక్తి పొందేందుకు ప్రపంచవ్యాప్తంగా మొదలైన వ్యాక్సీన్ రేస్‌లో ముందంజలో ఉన్న వాటిలో ఆస్ట్రాజెనెకా-ఆక్స్ ఫర్డ్ వ్యాక్సీన్ ఒకటి. అందుకే ఇది ఏమాత్రం ఆలస్యం అయినా నిరుత్సాహపరుస్తుంది.
బ్రిటన్‌లోని ఒక వలంటీర్‌లో తీవ్రమైన రియాక్షన్ కనిపించడంతో వ్యాక్సీన్ తయారీలో విరామం వచ్చింది. మంగళవారం స్టాట్ న్యూస్ ప్రసారం చేసిన ఒక కథనం ప్రకారం ఆ వలంటీరును ఆస్పత్రిలో చేర్పించారు.
దీనిపై మరిన్ని వివరాలు తెలీకపోయినా, ఆ రోగి కోలుకుంటాడని ఆశిస్తున్నట్లు కొన్ని వర్గాల ద్వారా తమకు తెలిసిందని స్టాట్ న్యూస్ చెప్పింది.
“భద్రతా డేటాను సమీక్షించడానికి వీలుగా మా ప్రామాణిక సమీక్షా విధానం ప్రకారం వ్యాక్సీన్ తయారీకి 'విరామం' ఇచ్చామ”ని ఆస్ట్రాజెనెకా ఒక ప్రకటనలో చెప్పింది.
ఈ ప్రక్రియకు ‘రోజులు’ పట్టవచ్చని బీబీసీ మెడికల్ ఎడిటర్ ఫెర్గస్ వాల్ష్ అంటున్నారు.
భారత్‌లో కూడా ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్ ట్రయల్స్ నిలిచిపోయాయి.

ఫొటో సోర్స్, EPA
వ్యాక్సీన్ ట్రయల్స్ నిలిచిపోవడం మామూలేనా?
ఇలాంటి విరామాలు ఎప్పుడూ వినని విషయమేం కాదని వాల్ష్ చెబుతున్నారు. “ఒక వలంటీరును ఎప్పుడైనా ఆస్పత్రిలో అడ్మిట్ చేస్తే, వారి అనారోగ్యానికి కారణం ఏంటనేది వెంటనే తెలీదు. అలాంటప్పుడు సంస్థలు ఆ అధ్యయనాన్ని నిలిపివేయాల్సి వస్తుంది” అన్నారు.
“భారీ ట్రయల్స్ జరుగుతున్నప్పుడు అనుకోకుండా కొందరు అనారోగ్యం పాలవుతుంటారు. కానీ దానిని జాగ్రత్తగా తనిఖీ చేయాలంటే, వారిని కచ్చితంగా ప్రత్యేకంగా ఉంచి సమీక్షించాలి” అని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రతినిధి ఒకరు చెప్పారు.
ఈ కరోనావైరస్ ట్రయల్‌లో ఇలా జరగడం ఇదే తొలిసారి కాదని కూడా వాల్ష్ చెబుతున్నారు.
“ఇది నిజానికి రెండోసారి జరిగింది. మొదటి వలంటీర్లు ఏప్రిల్‌లో రోగనిరోధక శక్తి పొందినప్పటి నుంచి ఇలా జరగడం ఇది రెండోసారి” అన్నారు.
కోవిడ్-19 వ్యాక్సీన్‌ను త్వరగా తయారుచేసే ఈ కార్యక్రమానికి అమెరికా ఉన్నతాధికారి మాన్సెఫ్ స్లాయీ ఇన్‌ఛార్జిగా ఉన్నారు.
అమెరికా, బ్రిటన్ కాకుండా బయటి నిపుణులతో కూడిన ఒక పానెల్‌తో మాట్లాడిన ఆయన “కంపెనీకి చెందిన వలంటీరు గురించి చాలా లోతైన సమీక్ష నిర్వహిస్తున్నాం. ఒక ప్రతికూల ఘటన జరిగినపుడు ప్రామాణిక విధానాలు పాటిస్తాం” అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
కోవిడ్-19పై వచ్చే వ్యాక్సిన్ సురక్షితమేనా?
ఈ వార్త బయటికి వచ్చిన వెంటనే, మార్కెట్లోకి వచ్చే ఏ వ్యాక్సీన్ అయినా ప్రజలకు సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతోనే అలా చేశామని ఆస్ట్రాజెనెకా, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ చెప్పాయి.
“తొలి వ్యాక్సీన్ తయారీలో భద్రతకు పెద్ద పీట వేస్తామని” ఆస్ట్రాజెనెకాతోపాటూ కోవిడ్-19 వ్యాక్సీన్ తయారీలో ఉన్నతొమ్మిది ఫార్మస్యూటికల్ దిగ్గజాలు మంగళవారం ఒక ‘చారిత్రక ప్రతిజ్ఞ’పై సంతకాలు చేశాయి.
ఈ సంస్థల్లో జాన్సన్ అండ్ జాన్సన్, బయోఎన్‌టెక్. గ్లాక్సోస్మిత్‌క్లైన్, ఫైజర్, మర్క్, మోడెర్నా, సనోఫీ, నోవావాక్స్ లాంటివి ఉన్నాయి. వ్యాక్సీన్ తయారీలో సైన్సుకు అండగా నిలవడానికి ఏకం అవుతామని వాగ్దానం చేశాయి.
దీనితోపాటూ క్లినికల్ ట్రయల్స్, కఠినమైన తయారీ ప్రక్రియకు సంబంధించి అధిక శాస్త్రీయ, నైతిక ప్రమాణాలకు కట్టుబడి ఉంటామని, ప్రపంచమంతా టీకాను అందుబాటులోకి తీసుకురావడంతోపాటూ, వ్యాక్సీన్‌ను ఎంచుకునేలా వాటి రేంజ్, సరఫరా సమర్థంగా ఉండేలా చూస్తామని సంస్థలు ప్రతిజ్ఞ చేశాయి.

ఫొటో సోర్స్, EPA
కోవిడ్-19 వ్యాక్సిన్‌కు మనం ఎంత దగ్గరలో ఉన్నాం?
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 180 టీకాలను పరీక్షల దశలో ఉన్నాయని, కానీ ఇప్పటివరకూ వాటిలో ఏదీ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది.
"ఈ ఏడాది ఒక్క వ్యాక్సీన్ కూడా సమర్థత, భద్రతా మార్గదర్శకాలను అందుకుంటుందని మాకు అనిపించడం లేదు. ఎందుకంటే వాటిని సురక్షితంగా పరీక్షించాలంటే సమయం పడుతుంద"ని తెలిపింది.
ఇప్పటికే మొదటి, రెండో దశ పరీక్షలు పూర్తి చేసిన ఆస్ట్రాజెనెకా-ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సీన్ ఈ పరుగులో ముందంజలో ఉన్న వాటిలో బలమైనదిగా కనిపించింది.
కొన్ని వారాల క్రితమే అది మూడో దశ పరీక్షలు ప్రారంభించింది. అమెరికా, బ్రిటన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికాల్లో 30 వేల మంది వీటిలో పాల్గొంటున్నారు. కానీ, ఇప్పుడు వాటిని నిలిపివేశారు.
వ్యాక్సీన్ మూడో దశ ట్రయల్స్ లో తరచూ వేలాది వలంటీర్లు పాల్గొంటారు. అది కొన్నేళ్ల పాటు కొనసాగుతుంది.
నవంబర్ 3న అధ్యక్ష ఎన్నికలు జరిగేలోపు కరోనా వ్యాక్సీన్‌ను అమెరికాలో అందుబాటులోకి తీసుకురావాలని తాను కోరుకుంటున్నట్లు ఆ దేశాధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అన్నారు.
కానీ, ఆయన వ్యాఖ్యల వల్ల వ్యాక్సీన్ రేస్‌లో భద్రత కంటే రాజకీయాలకు ఎక్కడ ప్రాధాన్యం లభిస్తుందేమోనని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రష్యా త్వరగా తయారుచేస్తున్న వ్యాక్సీన్ గురించి కూడా శాస్త్రవేత్తలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. రష్యా అధ్యయనంలోని కొన్ని ఫలితాలను వారు సవాలు చేస్తున్నారు.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?
- లక్షణాలు: కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ప్రభావం: కరోనావైరస్ మీ శరీరాన్ని ఏం చేస్తుంది?
- మందు, చికిత్స: కరోనావైరస్: కోవిడ్-19కు చికిత్స చేసే మందు ఎప్పుడు వస్తుంది? ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు?
- టిప్స్: కరోనావైరస్ చిట్కాలు: మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? వైరస్ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలి?
- కోలుకోవడం: కరోనావైరస్ బారిన పడితే తిరిగి కోలుకోవడానికి ఎంత కాలం పడుతుంది?
- వ్యాక్సిన్: కరోనావైరస్ వ్యాక్సిన్ పరిశోధనలు ఎంత వరకూ వచ్చాయి? వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది?
- లాక్డౌన్: తిరిగి సాధారణ జీవితం ఎప్పుడు, ఎలా మొదలవుతుంది?
- ఎండ్‌గేమ్: కరోనావైరస్ మహమ్మారి నుంచి బయటపడటం ఎలా?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్: ప్రపంచ మహమ్మారి మీద యుద్ధంలో మానవాళి గెలుస్తోందా?
- చలికాలంలో కరోనా మరింత విజృంభిస్తుందా.. ప్రాణనష్టం పెరుగుతుందా
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్‌లను ఎదుర్కోవచ్చా?
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- సరకులు కొనేటప్పుడు ఆ ప్యాకెట్లను పట్టుకుంటే కరోనావైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకినవారు మీ వీధిలో ఉంటే ఏం చేయాలి... ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కోవిడ్-19 నుంచి కోలుకున్నా అనారోగ్యం ఎందుకు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- హస్త ప్రయోగం, మల్టీ విటమిన్లు, ప్రో బయోటిక్స్.. ఇవి రోగ నిరోధక శక్తి బూస్టర్‌లా?
- కరోనా వైరస్ సర్వే: మన శరీరంలో యాంటీబాడీస్ ఉంటే వైరస్ మళ్లీ సోకదా?
- కరోనా వ్యాప్తిలో పిల్లల పాత్ర ఎంత? తాజా అధ్యయనం ఏం చెప్తోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









