కరోనా లాక్‌డౌన్: విపరీతంగా బయటపడుతున్న ఎలుకలు.. వీటిని నివారించడం ఎలా?

ఎలుక

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, కొత్త పరిస్థితులకి తొందరగా అలవాటు పడిపోయే జీవులు ఎలుకల

ప్రపంచంలో అనేక దేశాల్లో అమలులో ఉన్న నిర్బంధంతో అనేక రెస్టారెంట్లు మూతపడ్డాయి. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ పరిస్థితి ఎలుకల ప్రవర్తనా శైలిలో, తినే తిండి విషయంలో మార్పులు తెచ్చిందని నిపుణులు చెబుతున్నారు.

న్యూ ఆర్లీన్స్ ఫ్రెంచ్ వీధుల్లో గత నెలాఖరులో విపరీతంగా ఎలుకలు వీధుల్లో తిరుగుతూ కనిపించాయి.

లూసియానాలో బార్లు రెస్టారెంట్లు మూత పడటంతో చాలా ఎలుకలు రోడ్ల మీదకి వచ్చి తిరుగుతున్నాయి.

ఇదేమీ ఆశ్చర్యపడాల్సిన విషయం కాదని, రోడెన్టోలోజిస్ట్ రాబర్ట్ కొరిగాన్ అన్నారు.

"అది డిస్ట్రిక్ట్ అఫ్ కొలంబియా (డిసి) అయినా కావచ్చు, న్యూయార్క్ నగరం అయినా కావచ్చు, పర్యాటకులు రాత్రి పూట రోడ్ల మీద విసిరేసే చెత్త ఒకేసారి మాయం అవ్వగానే, వాటి మీద ఆధారపడి బ్రతికే ఎలుకలకి కూడా ఏమి చేయాలో అర్ధం కాదు.’’

“ఈ ఎలుకలు ఆకలితో ఉన్నాయి" అని న్యూ ఆర్లీన్స్ పెస్ట్ కంట్రోల్ బోర్డులో పని చేస్తున్న క్లాడియా రీగల్ అన్నారు.

కరోనా మహమ్మారితో మనుషులే తమ ప్రవర్తనని మార్చుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌లో కరోనావైరస్ కేసులు

17656

మొత్తం కేసులు

2842

కోలుకున్నవారు

559

మరణాలు

ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

‌అప్‌డేట్ అయిన సమయం 11: 30 IST

కరోనావైరస్ నుంచి మిమ్మల్ని మీరు ఇలా రక్షించుకోండి

కొన్ని చోట్ల నిర్బంధంలో ఎలుకలకి కూడా ఆహారం దొరకదు. అవి కూడా నెమ్మదిగా పరిస్థితులకి అలవాటు పడతాయి.

రాత్రిపూట కొన్ని ప్రాంతాలలో ఎలుకలు తిరుగుతున్నట్లు తనకి కొంత మంది స్నేహితులు ఫోన్ చేసి చెప్పారని రాబర్ట్ కొరిగాన్ చెప్పారు.

ఇదే పరిస్థితి అన్ని చోట్లా లేదు. నివాస ప్రాంతాల్లో లభించే చెత్త మీద ఆధారపడి బ్రతుకుతున్న ఎలుకలు బయట కనిపించటంలేదు.

హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్‌లు, స్కూళ్ళు మూసివేయడం వలన ఊహించని పరిణామాలు చూడవలసి వస్తుందని యూకేలో నేషనల్ పెస్ట్ టెక్నిషన్స్ కంట్రోల్ అసోసియేషన్ హెచ్చరించింది.

చాలా జీవులు ఖాళీగా ఉండే భవనాల్లో తచ్చాడుతాయని, ఇది వాటి స్వేచ్చని మరింత పెంచుతుందని చెప్పారు.

కొత్త పరిస్థితులకి తొందరగా అలవాటు పడిపోయే జీవులు

ఆకలితో ఉన్న ఎలుకలు ఎంత దూరమైనా ప్రయాణించి కొత్త స్ధలానికి వెళ్లగలవని కొరిగాన్ చెప్పారు.

ఇవి ఆహారాన్ని వాసన చూసి పసిగట్టగలిగే శక్తివంతమైన జీవులని, ఆహారం సంపాదించుకోవడానికి చెక్క, బట్టలు, ప్లాస్టిక్ లాంటి అవాంతరాలు ఉంటే, వాటిని తమ పళ్లతో కొరికి దారిని చేసుకునే శక్తి ఉందని అన్నారు.

ఇవి ప్రపంచమంతా ఉన్నాయి. చాలా తొందరగా పరిస్థితులకి అలవాటు పడిపోతాయి.

వీధుల్లో ఎలుకలు కనిపిస్తున్నంత మాత్రాన నగరాలు ఏమి ఎలుకలతో నిండిపోవు.

ఎలుకల జనాభాని నిరోధించడానికి ఇదే తగిన సమయమని కొరిగాన్ అన్నారు.

ఆకలితో ఉన్న ఎలుకలు వాటిని పట్టుకోవడానికి పెట్టిన బోనుకి సులభంగా చిక్కుతాయి.

క్రిమి సంహారకాలు చల్లడం వలన, తిండి లేకపోవడం వలన ఎలుకలు తిరిగి ఎలుకలని తినడం మొదలు పెట్టి వాటి జనాభాని వాటంతట అవే తగ్గించుకుంటాయని చెప్పారు.

తిండి లేని చోట స్వజాతిని చంపి తినడం సాధారణం.

ఎలుకలు దుమ్ముతో సహా చాలావాటిని తినే గుణాన్ని కలిగి ఉంటాయి.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఎలుకలు ఇంటిలో ఉండటానికి ఎవరూ ఎందుకు ఇష్టపడరు?

ఆకలితో ఉన్న ఎలుకల వలన చాలా ప్రమాదాలు ఉంటాయి.

వాటి రాకని అరికట్టకపోతే, అవి బెడ్ రూమ్ లోకి, వంట గదిలోకి, హాస్పిటల్ గదుల్లోకి చేరే ప్రమాదం ఉంది.

ఎలుకల్లో సుమారు 55 రకాల వ్యాధికారక క్రిములు ఉంటాయి.

ఇవి చెక్క, ఎలక్ట్రికల్ వైర్ ల మీద కూడా కదలగలవు. దీంతో ఇంట్లో అగ్ని ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉంటుంది.

ఎవరూ దగ్గరకి తీసుకోవాలని అనుకోని జీవుల్లో ఇదొకటి.

ఇళ్ల నుంచి ఎలుకలని తరమడం ఎలా?

ఇంటి చుట్టూ ఉన్న కన్నాలు, పైపులు, గోడ సందుల్లో ఖాళీలు లేకుండా చూసుకోవాలి.

ఇంటిలో అనవసరమైన చెత్త లేకుండా చూసుకోవాలి. ఎక్కువ చెత్త ఉన్న ప్రాంతాలలో అవి దాగుంటాయి. ఆహారాన్ని అవి చేరలేని ప్రదేశాలలో, పాత్రల్లో పెట్టాలి.

ఒకవేళ ఇంకా ఎలుకలు మీ ఇంట్లో ఎక్కువగా తిరుగుతుంటే, పెస్ట్ కంట్రోల్ వాళ్ళని పిలవాలని కొరిగాన్ సలహా ఇచ్చారు.

ఒక వేళ కరోనా వైరస్ వలన ఎలుకలు మీ చుట్టు పక్కల ప్రాంతాలలో ఎక్కువైతే దాని గురించి పట్టించుకోనవసరం లేదు.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్
వీడియో క్యాప్షన్, వీడియో: కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా?
పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)