Virat Kohli: ధోనీ తప్ప ఎవరూ తనకు నేరుగా మెసేజ్ చేయలేదన్న విరాట్ కోహ్లీ.. ఎద్దేవా చేసిన సునీల్ గావస్కర్

ఎంఎస్ ధోనీతో విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

మహేంద్ర సింగ్ ధోనీ మీద ఉన్న అభిమానాన్ని అవకాశం వచ్చిన ప్రతిసారీ విరాట్ కోహ్లీ చూపిస్తూనే ఉంటాడు. కృతజ్ఞతను తెలుపుతూనే ఉంటాడు.

ధోనీతో కలిసి కొన్ని సంవత్సరాల పాటు కోహ్లీ క్రికెట్ ఆడాడు. ధోనీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఆ తరువాత ధోనీ వారసునిగా టీం ఇండియా పగ్గాలు చేపట్టాడు.

తాజాగా మరొకసారి ధోనీకి ధన్యావాదాలు తెలిపాడు కోహ్లీ. తాను టెస్ట్ కెప్టెన్సీ వదులుకున్న నాడు ధోనీ ఒక్కడే తనకు మెసేజ్ చేశాడని, ఇంకెవరూ చేయలేదని కోహ్లీ అన్నాడు.

ఆసియా కప్‌ సూపర్-4లో ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ తరువాత అనేక విషయాల మీద మీడియాతో మాట్లాడాడు కోహ్లీ. జనవరిలో టెస్ట్ కెప్టెన్సీ వదులుకున్న తరువాత కోహ్లీ మీడియా ముందకు రావడం ఇదే తొలిసారి. ఈ ప్రెస్ మీట్‌లో విరాట్ కోహ్లీ చాలా కూల్‌గా కనిపించాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

'నేను టెస్ట్ కెప్టెన్సీకి రాజీనామా చేసినప్పుడు, నాతో ఆడిన వ్యక్తుల్లో ఒక్కరి నుంచి మాత్రమే నాకు మెసేజ్ వచ్చింది. ఆయనే ఎంఎస్ ధోనీ.

చాలా మంది వద్ద నా నెంబర్ ఉంది. టీవీలలో నాకు ఎంతో మంది సలహాలు ఇచ్చారు. నా నెంబర్ ఉన్న ఆ వ్యక్తులు ఎవరూ నాకు మెసేజ్ చేయలేదు.

ఒక వ్యక్తి మీద మీకు గౌరవం ఉన్నప్పుడు, ఆ వ్యక్తితో నిజమైన అనుబంధం ఉన్నప్పుడు అది ఇలా కనిపిస్తుంది' అని విరాట్ కోహ్లీ అన్నాడు.

ఎవరు ఎలాంటి వారో తనకు ఇప్పుడు బాగా తెలిసింది అన్నట్లుగా కోహ్లీ మాట్లాడాడు.

గతంలో కూడా ధోనీ మీద తనకు గల అభిమానాన్ని ప్రకటించాడు కోహ్లీ. ఈ ఏడాది జులై 7న ధోనీ పుట్టిన రోజు సందర్భంగా కోహ్లీ ఇలా ట్వీట్ చేశాడు...

'నీ లాంటి నాయకుడు మరొకరు ఉండరు. భారత క్రికెట్‌కు నువ్వు అందించిన సేవలకు ధన్యవాదాలు. నువ్వు నాకు పెద్దన్నలాంటి వాడివి. నీ మీద ప్రేమ, గౌరవం ఎల్లప్పుడూ ఉంటాయి.

హ్యాపీ బర్త్‌డే స్కిప్పర్'

రిటైర్ అయినప్పటికీ ధోనీని కెప్టెన్ అనే కోహ్లీ పిలుస్తుంటాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

గత కొంత కాలంగా తన ఫాంతో కోహ్లీ ఇబ్బంది పడుతున్నాడు. 2019లో చివరి సారి సెంచరీ కొట్టిన, కోహ్లీ ఇంత వరకు మరొక సెంచరీ కొట్టలేదు. సుమారు రెండున్నర ఏళ్ల నుంచి భారీ పరుగులు తీసేందుకు కోహ్లీ కష్టపడ్డాడు.

ఆట తీరు వల్లే టీ20 కెప్టెన్సీ వదులుకున్నాడు. వన్డే కెప్టెన్సీ నుంచి బోర్డు తొలగించింది. టెస్ట్ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు.

ఫాం లేకపోయినా కోహ్లీని టీంలో కొనసాగిస్తున్నందుకు అనేక విమర్శలు వచ్చాయి. ఆసియా కప్‌కు కోహ్లీని ఎంపిక చేయడాన్ని కూడా చాలా మంది తప్పు పట్టారు. కానీ ఆసియా కప్‌లో కోహ్లీ మళ్లీ ఫాంలోకి వచ్చినట్లు కనిపించాడు.

పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 35 పరుగులు చేసిన కోహ్లీ... హాంకాంగ్ మీద 59, సూపర్-4లో పాకిస్తాన్ మీద 60 పరుగులు చేశాడు. 154 పరుగులతో ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో వ్యక్తిగా కోహ్లీ ఉన్నాడు.

సునీల్ గావస్కర్

ఫొటో సోర్స్, Getty Images

సునీల్ గావస్కర్ స్పందన

ధోనీ మాత్రమే తనకు మెసేజ్ చేశారంటూ తాజాగా ప్రెస్ మీట్‌లో కోహ్లీ చేసిన వ్యాఖ్యల మీద టీం ఇండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ స్పందించారు. కాస్త వ్యంగ్యంగా మాట్లాడారు.

'అతను ఎలాంటి మెసేజ్ కోరుకుంటున్నాడు? ఎంకరేజ్‌మెంట్? ఒకసారి కెప్టెన్సీ వదిలేశాక అతనికి ఎంకరేజ్‌మెంట్ అవసరం ఏంటి? ఆ చాప్టర్ ముగిసి పోయింది' అని స్పోర్ట్స్ తక్‌తో మాట్లాడుతూ గావస్కర్ అన్నారు.

'ఎవరి గురించి విరాట్ కోహ్లీ మాట్లాడారో చెప్పడం కష్టం. ఆయన పేర్లు ఏమైనా చెప్పి ఉంటే మీరు కోహ్లీని కాంటాక్ట్ అయ్యారా లేదా అని ఆ వ్యక్తులను అడగొచ్చు. నేను విన్నది ఏందంటే, కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ వదిలేసినప్పుడు తనకు ఎంఎస్ ధోనీ మాత్రమే కాల్ చేశాడు' అని సునీల్ గావస్కర్ అన్నట్లు వార్తా సంస్థ పీటీఐ రిపోర్ట్ చేసింది.

అనుష్క శర్మ, సునీల్ గావస్కర్

ఫొటో సోర్స్, Getty Images

గతంలోనూ వివాదం

కెప్టెన్సీ వదిలేయడం వల్ల కలిగే లాభం ఏంటంటే ఆట మీద పూర్తిగా దృష్టి పెట్టొచ్చని గావస్కర్ అన్నారు. 1985లో బెన్సన్ అండ్ హెడ్జెస్ వరల్డ్ చాంపియన్ షిప్ గెలిచిన తరువాత, తాను కెప్టెన్సీ వదిలేసినప్పుడు తనకు ఎవరూ మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయలేదని ఆయన చెప్పారు.

2020 సెప్టెంబరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్, కింగ్స్ లెవన్ పంజాబ్ మధ్య జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా కోహ్లీ మీద సునీల్ గావస్కర్ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి.

ఆ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ ఇచ్చిన క్యాచ్‌ను కోహ్లీ వదిలేశాడు. దాంతో రాహుల్ సెంచరీ కొట్టాడు. ఆ తరువాత చేజింగ్‌లో కోహ్లీ విఫలమయ్యాడు. 5 బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే చేశాడు.

'లాక్‌డౌన్‌లో అనుష్క బౌలింగ్‌తో మాత్రమే కోహ్లీ ప్రాక్టీస్ చేశాడు. ఆ వీడియో కూడా చూడొచ్చు' అని నాడు గావస్కర్ కామెంట్ చేశారు.

నాడు గావస్కర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటి మీద అనేక విమర్శలు వచ్చాయి. ఆయన మాటలను అనుష్క శర్మ కూడా తప్పు పట్టింది.

అయితే తాను అనుష్క శర్మను ఏమీ అనలేదని, లాక్‌డౌన్ ప్రాక్టీస్ చేసే అకాశం క్రికెటర్లకు రాలేదు అని చెప్పడమే తన ఉద్దేశమని ఆ తరువాత గావస్కర్ వివరణ ఇచ్చారు.

వీడియో క్యాప్షన్, Farmers Cricket Team: పంచె కట్టి... బ్యాట్ పట్టి.. పరుగులు కొల్లగొట్టి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)