విరాట్ కోహ్లీ: స్థాయి లేనోడా? భయం లేనోడా? ఈ సంజ్ఞపై ఎందుకింత చర్చ?

విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Christopher Lee

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలో ఉన్నా, డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నా.. తన భావోద్వేగాలను ఏమాత్రం నియంత్రించుకోకుండా ప్రదర్శిస్తుంటాడు. దూకుడైన తన వైఖరితో కోహ్లీ ఎప్పుడూ చర్చల్లో నిలుస్తుంటాడు.

సోమవారం ఓవల్ మైదానంలో ఇంగ్లండ్‌పై ఘన విజయం నేపథ్యంలో కోహ్లీ సంబరాలు మళ్లీ వార్తల్లో నిలిచాయి.

మరీ ముఖ్యంగా.. మైదానంలోని ఇంగ్లండ్ ప్రేక్షకులను ఉద్దేశించి కోహ్లీ చేసిన ఒక సంకేతం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. కోహ్లీ తీరును కొందరు విమర్శిస్తోంటే, మరికొందరు సమర్థిస్తున్నారు.

ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న భారత జట్టు ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా.. మొదటి టెస్టుకు వర్షం అడ్డుపడటంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. రెండో టెస్టులో భారత జట్టు 151 పరుగుల తేడాతో గెలిచింది. మూడో టెస్టులో ఇంగ్లండ్ జట్టు ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో గెలిచింది. నాలుగో టెస్టులో భారత జట్టు 157 పరుగుల తేడాతో గెలిచింది. ఐదో టెస్టు ఈనెల 10వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.

అయితే, నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌట్ అయ్యి, దాదాపు వంద పరుగులు వెనకబడ్డ భారత జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో పుంజుకుని 466 పరుగుల భారీ స్కోరు సాధించడం, బౌలింగ్‌లోనూ సత్తా చూపి ఇంగ్లండ్‌ను రెండో ఇన్నింగ్స్‌లో 210 పరుగులకు ఆలౌట్ చేయడంతో చారిత్రక విజయం సాధించింది.

2007 తర్వాత ఇంగ్లండ్‌లో భారత క్రికెట్ జట్టు ఒక్కసారి కూడా టెస్ట్ సిరీస్‌లో విజయం సాధించలేదు.

ఈ సిరీస్‌లో 2-1తో ఆధిక్యం సాధించిన భారత్, చారిత్రాత్మక సిరీస్ విజయం సాధించాలని ఎదురుచూస్తోంది.

బార్మీ ఆర్మీ

ఫొటో సోర్స్, Stu Forster

నాలుగో టెస్ట్ ఐదో రోజు మ్యాచ్ సందర్భంగా.. వికెట్ పడిన ప్రతిసారీ కోహ్లీ సంబరాలు చేసుకున్నాడు.

అయితే, ఈ సంబరాల్లో భాగంగా ఇంగ్లండ్ క్రికెట్ జట్టు అభిమానుల సంఘం 'బార్మీ ఆర్మీ'ని లక్ష్యంగా చేసుకున్నదిగా భావిస్తున్న ఒక సంజ్ఞపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.

కోహ్లీ లాంటి ఆటగాడు ఇలా చేయడం తగదని కొందరు అంటున్నారు.

కోహ్లీ చేసిన సంకేతంపై విజ్డెన్ ఎడిటర్, ఇంగ్లండ్ డైలీ మెయిల్ వ్యాసకర్త లారెన్స్ బూత్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ''బాగుంది. తన సహచరులంతా వికెట్ తీసినందుకు సంబరాలు చేసుకుంటుంటే, కోహ్లీ మాత్రం ఇంగ్లండ్ ఫ్యాన్స్‌ను గేలి చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాడు'' అని ఒక ట్వీట్ చేశాడు. దానికి తర్వాత మరింత వివరణ ఇస్తూ.. ''ఇది అసలు నాకు ఏమాత్రం నచ్చలేదు. ఒక అగ్రశ్రేణి క్రీడాకారుడు మ్యాచ్ గెలిచినందుకు గానీ, ప్రత్యర్థి కన్నా మెరుగ్గా ఆడినందుకు సంతృప్తి చెందకుండా.. అభిమానులను కూడా విడిచిపెట్టకపోవడం సరికాదు'' అని పేర్కొన్నాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

దీనిని ఇంగ్లండ్ మాజీ క్రికెట్ నిక్ కాంప్టన్ మద్దతు పలికాడు.

''ఔను. ఇది అతనికి (కోహ్లీకి) ఏమాత్రం బాగోదు. అవసరం లేదు'' అని ట్వీట్ చేశాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

కాగా, విరాట్ కోహ్లీ ఫొటోను పెట్టి ఇంగ్లండ్ బార్మీ ఆర్మీ ఒక ట్వీట్ చేసింది.

''ఔను, మాకు తెలుసు.. నువ్వు మా ఆర్మీలో చేరాలనుకుంటున్నావు విరాట్. మాకు అర్థమైంది'' అని వ్యంగ్యంగా పేర్కొంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

అయితే, ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న భారత జట్టును బార్మీ ఆర్మీ లక్ష్యంగా చేసుకుందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

భారత ఆటగాళ్లను గేలి చేస్తూ ప్రేక్షకులు శబ్దాలు చేశారు. కొందరు ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకున్నారు. హెడింగ్లే టెస్టులో ఔటైన తర్వాత కోహ్లీ పెవిలియన్‌కు తిరిగి వస్తున్నప్పుడు బార్మీ ఆర్మీ స్టేడియంలో సందడి చేసింది.

కాగా, విరాట్ కోహ్లీ బార్మీ ఆర్మీని టార్గెట్ చేసినప్పుడు కొందరు అతనికి మద్దతు పలికారు.

కోహ్లీ సంజ్ఞను ఫాక్స్ క్రికెట్ 'క్లాస్‌ లెస్‌'గా అభివర్ణించడాన్ని భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ తప్పుపట్టాడు. కోహ్లీ ధైర్యంగల కెప్టెన్ అని, ప్రాణం పోయిన మ్యాచ్‌ను ఒక చారిత్రాత్మక విజయంగా మలిచాడని అభివర్ణించాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

మూడో టెస్టులో భారత జట్టు ఓడిపోయింది. ఆ టెస్టు సందర్భంగా బార్మీ ఆర్మీ భారత క్రికెటర్లను ట్రోల్ చేసిందని, ఇప్పుడు కెప్టెన్ తిరిగి ఇచ్చేశాడని కొందరు మద్దతుదారులు అంటున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 6
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 6

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 7
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 7

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 8
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 8

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)