విరాట్ కోహ్లీ: టెస్ట్ కెప్టెన్సీకి గుడ్ బై.. అత్యుత్తమ కెప్టెన్ అంటూ ప్రశంసలు

ఫొటో సోర్స్, Getty Images
టీమిండియా టెస్ట్ క్రికెట్ జట్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ వైదొలిగారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో ఒక ప్రకటన విడుదల చేశారు.
విరాట్ కోహ్లీ 68 టెస్ట్ మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించారు. అందులో 40 మ్యాచ్‌లను భారత జట్టు గెలవగా 17 మ్యాచ్‌లలో ఓటమి పాలైంది. 11 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.
తాజాగా దక్షిణాఫ్రికాలో ముగిసిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్ జట్టు 2-1 తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమి అనంతరం కోహ్లీ కెప్టెన్సీ నుంచి వైదొలుగుతూ నిర్ణయం తీసుకున్నారు.
కాగా టీ20 జట్టు కెప్టెన్‌గా కోహ్లీ ఇప్పటికే తప్పుకోగా వన్డే కెప్టెన్సీ నుంచి ఆయన్ను బీసీసీఐ తొలగించింది. ఆ తొలగింపుపై వివాదం కూడా చోటుచేసుకుంది.
తాజాగా టెస్ట్ కెప్టెన్సీకి కూడా కోహ్లీ గుడ్ బై చెప్పడంతో మూడు ఫార్మట్లలోనూ విరాట్ నాయకత్వం లేనట్లయింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
‘నాపై నమ్మకం ఉంచిన ధోనీకి థాంక్స్’
‘‘జట్టును సరైన దిశలో నడిపించటానికి ఏడేళ్లుగా కష్టపడ్డాను, కఠినంగా శ్రమించాను, నిర్విరామంగా పనిచేశాను. పరిపూర్ణ నిజాయితీతో నా విధి నిర్వర్తించాను. ఏదీ వదిలిపెట్టలేదు. ప్రతీదీ ఏదో ఒక దశలో ముగింపు రావాల్సిందే. భారత టెస్ట్ కెప్టెన్‌గా ఇప్పుడు నాకు ఆ దశ వచ్చింది. ఈ ప్రయాణంలో ఎన్నో ఎత్తులున్నాయి. కొన్ని పల్లాలూ ఉన్నాయి. కానీ ఎన్నడూ ప్రయత్నలోపం లేదు. విశ్వాస లోపం లేదు.
నేను చేసే ప్రతి పనికీ నూటికి 120 శాతం నా శక్తిసామర్థ్యాలను వెచ్చించాలనే నేను ఎల్లప్పుడూ విశ్వసించాను. అలా చేయలేకపోతే అది సరైంది కాదని నాకు తెలుసు.
నా హృదయంలో సంపూర్ణ స్పష్టత ఉంది. నా జట్టును నేను వంచించలేను. ఇంత సుదీర్ఘ కాలం నా దేశానికి సారథ్యం వహించే అవకాశం నాకు ఇచ్చినందుకు బీసీసీఐకి నేను కృతజ్ఙతలు చెప్తున్నా.
మరీ ముఖ్యంగా జట్టు కోసం నేను కన్న కలలను తొలి రోజు నుంచీ విశ్వసించిన, ఎటువంటి పరిస్థితుల్లోనూ సడలని విశ్వాసంతో ఉన్న జట్టు సభ్యులకు దన్యవాదాలు చెప్తున్నా.
మీరు ఈ ప్రయాణాన్ని ఎంతో అందంగా మరపురానిదిగా మలిచారు. టెస్ట్ క్రికెట్‌లో మమ్మల్ని స్థిరంగా పైకి తీసుకెళ్లిన ఈ వాహనానికి చోదకశక్తిగా ఉన్న రవి భాయ్‌కి, మద్దతు బృందానికి.. మీరంతా ఈ స్వప్నం సాక్షాత్కారం కావటంలో భారీ పాత్ర పోషించారు.
చివరిగా.. కెప్టెన్‌గా నామీద విశ్వాసం ఉంచిన, భారత క్రికెట్‌ను ముందుకు నడిపించగల వ్యక్తిగా నన్ను గుర్తించిన ఎంఎస్ ధోనికి బిగ్ థ్యాంక్స్’’ అని కోహ్లీ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

పోస్ట్ of X ముగిసింది, 3
ఎవరేమన్నారంటే...
కోహ్లీ రాజీనామా ట్వీట్‌కు స్పందించిన బీసీసీఐ ''68 టెస్ట్ మ్యాచ్‌లలో భారత జట్టుకు నాయకత్వం వహించి 40 మ్యాచ్‌లలో గెలిపించిన అత్యంత విజయవంతమైన కెప్టెన్ విరాట్ కోహ్లీ, గొప్ప నాయకత్వలక్షణాలున్న కోహ్లీకి అభినందనలు'' అని పేర్కొంది.
ఐసీసీ కూడా కోహ్లీ రికార్డులను ఉటంకిస్తూ భారత జట్టు అత్యుత్తమ కెప్టెన్ అంటూ కీర్తించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఐపీఎల్ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూర్, అంతకుముందు ఆయన ప్రాతినిధ్యం వహించిన దిల్లీ కేపిటల్స్ సహా పలు ఐపీఎల్ ఫ్రాంచైజీలు కోహ్లీ రాజీనామా నేపథ్యంలో ట్విటర్ వేదికగా తమ స్పందన తెలియజేశాయి.
కోహ్లీ అద్భుతమైన నాయకుడని, స్ఫూర్తిదాయకమైన ఆటగాడని ప్రశంసించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తమకు ఎన్నటికీ కోహ్లీయే కెప్టెన్ అని చెప్పింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
భారత టెస్ట్ కెప్టెన్లలో అత్యంత విజయవంతమైన ఆటగాడు కోహ్లీ అని.. టెస్ట్ జట్టుకు, దేశానికి చేసిన సేవకు కృతజ్ఞతలు అంటూ దిల్లీ కేపిటల్స్ ఐపీఎల్ జట్టు ట్వీట్ చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
టీమిండియా మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ ట్విటర్ వేదికగా కోహ్లీకి అభినందనలు చెబుతూ ఆయన సామర్థ్యాన్ని ప్రశంసించారు.
''ఇండియా టెస్ట్ కెప్టెన్‌గా అద్భుతమైన కెరీర్ ఉన్న కోహ్లీకి అభినందనలు. కోహ్లీ కేవలం అత్యుత్తమ ఇండియన్ టెస్ట్ కెప్టెన్ మాత్రమే కాదు. ప్రపంచ టెస్ట్ జట్ల అత్యుత్తమ కెప్టెన్లలోనూ ఆయన ఒకరు. గణాంకాలు అబద్ధం చెప్పవు. నిన్ను చూసి గర్వపడాలి. ఇకపై బ్యాట్‌తో సత్తా చూపుతావని ఎదురుచూస్తున్నాను'' అని సెహ్వాగ్ ట్వీట్ చేశారు.
ఇర్ఫాన్ పఠాన్ తదితరులూ కోహ్లీ వైదొలగడంపై స్పందించారు.
క్రికెట్ మాజీ ఆటగాళ్లే కాకుండా రాజకీయ, సినీ రంగాలతో ఇతర రంగాలకు చెందిన వారు కూడా కోహ్లీ నాయకత్వం స్ఫూర్తిదాయకమంటూ సోషల్ మీడియా వేదికగా తమ స్పందన తెలియజేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: 'గుడిసె' ఉన్నట్లుండి సినిమా షూటింగ్ స్పాట్ ఎలా అయింది... జనాలెందుకు అక్కడికి క్యూ కడుతున్నారు?
- సెక్స్ కోరికలు వయసు పెరుగుతుంటే తగ్గిపోతాయా...
- ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో ముస్లింలు ఎటు వైపు... బీజేపీ పాలనపై వారు ఏమంటున్నారు?
- చిరంజీవి ‘రాజ్యసభ సీటు ఆఫర్’ వార్తలపై ఏమన్నారంటే... – ప్రెస్‌రివ్యూ
- సరైన పద్ధతిలో ఉపవాసం ఎలా ఉండాలి, దానివల్ల కలిగే ప్రయోజనాలేంటి?
- పాతికేళ్ల కిందట పంది గుండెను మనిషికి అమర్చిన భారతీయ వైద్యుడిని జైలులో ఎందుకు పెట్టారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)