టీమిండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ కంటే రోహిత్ శర్మే బెటరా? ఈ పోలిక ఎందుకు మొదలైంది?

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ

ఫొటో సోర్స్, Getty Images

ఆదివారం జరిగిన మూడో టీ20లో టీమిండియా న్యూజీలాండ్‌ను 73 పరుగులతో ఓడించి సిరీస్‌ను 3-0తో గెలుచుకుంది.

టీ20 ప్రపంచ కప్‌లో భారత క్రికెట్ జట్టు ఘోర వైఫల్యం తర్వాత ఇప్పుడు న్యూజీలాండ్‌తో క్లీన్ స్వీప్ చేసిందంటే అది కెప్టెన్ రోహిత్ శర్మ ఘనతే అని చాలామంది సోషల్ మీడియాలో చెబుతున్నారు.

రోహిత్ శర్మ ఈ సిరీస్‌లో మరోసారి ఆదివారం కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 56 పరుగులు చేశాడు.

టీ20 వరల్డ్ కప్‌ ప్రారంభానికి ముందే ఈ టోర్నీ తర్వాత టీ20 టీమ్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని విరాట్ కోహ్లీ ప్రకటించాడు. దాంతో తర్వాత టీ20 జట్టుకు కాబోయే కెప్టెన్ రోహిత్ శర్మేనని అందరూ ఊహించారు.

చివరికి అదే జరిగింది. న్యూజీలాండ్‌తో టీ20 సిరీస్‌కు రోహిత్ శర్మను కెప్టెన్‌గా చేశారు. అతడి కెప్టెన్సీలో భారత్ న్యూజీలాండ్‌ను ఓడించింది.

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ

ఫొటో సోర్స్, Getty Images

కోహ్లీ రికార్డు బద్దలు

మూడో టీ20లో హాఫ్ సెంచరీ చేసిన రోహిత్ శర్మ కొన్ని రికార్డులు కూడా చేశాడు.

వాటిలో మాజీ టీ20 కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డు కూడా ఉంది. 30వ సారి 50కి పైగా పరుగులు చేసిన రోహిత్ శర్మ కోహ్లీ రికార్డు బ్రేక్ చేశాడు. విరాట్ కోహ్లీ ఇప్పటివరకూ 29 సార్లు 50కి పైగా పరుగులు చేశాడు.

ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్న పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం 25 సార్లు 50కి పైగా పరుగులు చేశాడు.

రోహిత్ శర్మ రికార్డుల్లో నాలుగు టీ20 సెంచరీల రికార్డు కూడా ఉంది.

కోల్‌కతా ఈడెన్ గార్డెన్‌ మైదానంలో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో రోహిత్ ఈ ఫార్మాట్‌లో 150 సిక్సర్లు కొట్టిన రికార్డ్ కూడా అందుకున్నాడు. ఈ లిస్టులో అతడి కంటే పైనున్న న్యూజీలాండ్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ టీ20ల్లో 165 సిక్సర్లు కొట్టాడు.

రోహిత్ శర్మ

ఫొటో సోర్స్, Reuters

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పోలిక

రోహిత్ శర్మ కెప్టెన్సీ, అతడి రికార్డ్ ఇన్నింగ్స్ తర్వాత సోషల్ మీడియాలో అతడిని విరాట్ కోహ్లీతో పోల్చడం మొదలైంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ఐపీఎల్‌లో గత సీజన్ వరకూ విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు "రోహిత్ శర్మ… పుల్ షాట్స్" అనే ట్వీట్‌తో ఈ పోలిక మొదలైంది.

ఈ ట్వీట్ చేయడమే ఆలస్యం, దానిపై కామెంట్స్ వెల్లువెత్తాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

దానికి ఒక యూజర్ "కోహ్లీ ఫాల్స్ షాట్స్" అని ట్వీట్ చేశాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

అదే ట్వీట్‌కు కామెంట్ పెట్టిన మరో యూజర్ "అడ్మిన్ మారిపోయాడా… లేక ముంబయి ఇండియన్స్ వాళ్లు ఈ అకౌంట్ హాక్ చేశారా" అన్నాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

"ఎప్పుడైనా కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా గెలిచిందా... నాకు సందేహమే. తను ఒక్క మల్టీ నేషనల్ టోర్నమెంట్ కూడా గెలిపించలేకపోయాడు. అందుకే కెప్టెన్సీ విషయానికి వస్తే రోహిత్ గ్రేటర్ దాన్ కోహ్లీ" అని ఒక ట్వీట్‌కు కామెంట్ పెట్టిన అమరనాథ్ ఆచార్య అనే యూజర్ అన్నాడు.

ధార్మిక బత్రా అనే యూజర్ ఇద్దరి మధ్యా మరో పోలిక తీసుకొచ్చాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

"రోహిత్‌ను కోహ్లీ కంటే గ్రేట్‌గా చేసింది ఇదే.. రోహిత్ ఈ సిరీస్‌లో మూడు టాస్‌లూ గెలిచాడు" అన్నాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 6
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 6

కోచ్ ద్రవిడ్‌కూ ప్రశంసలు

రోహిత్ శర్మతోపాటూ భారత క్రికెట్ జట్టు కొత్త కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై కూడా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

"రోహిత్ శర్మ కెప్టెన్సీ, కొత్త కోచ్ రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలో టీమిండియా అద్భుత ప్రదర్శన ఇచ్చింది" అని భారత జట్టుకు శుభాకాంక్షలు చెప్పిన బీసీసీఐ సెక్రటరీ జైషా అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 7
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 7

"3-0 విజయం కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ నుంచి ఒక చక్కటి ప్రారంభం" అని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశారు.

రోహిత్ శర్మ ఇప్పటివరకూ 22 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లకు కెప్టెన్‌గా ఉన్నాడు. వాటిలో జట్టు 18 మ్యాచ్‌లు గెలిస్తే, 4 ఓడిపోయింది.

మరోవైపు కోహ్లీ 50 టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేశాడు. వాటిలో టీమిండియా 30 గెలిచింది. 16 ఓడిపోయింది. రెండు మ్యాచ్‌లు టై కాగా, మరో రెండింట్లో ఫలితం తేలలేదు.

టీ20 సిరీస్ తర్వాత ఇప్పుడు భారత జట్టు న్యూజీలాండ్‌తో రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడబోతోంది.

మొదటి టెస్ట్ నవంబర్ 25 నుంచి 29 వరకూ కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో, రెండో టెస్ట్ డిసెంబర్ 3 నుంచి 7 వరకూ ముంబయి వాంఖడే స్టేడియంలో జరుగుతాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)