సెక్స్ కోరికలు వయసు పెరుగుతుంటే తగ్గిపోతాయా...

వృద్ధాప్యం

ఫొటో సోర్స్, Getty Images

క్లాడియా, లూయిస్‌లు చిన్నవయసులోనే కలుసుకున్నారు. అలా కలుసుకున్న తొలినాళ్లలోనే వారు తాము ఒకరికి ఒకరం అని తెలుసుకున్నారు. ఒకరి గురించి మరొకరు ఆలోచించకుండా ఉండలేకపోయారు. మనసులతో పాటే తనువులూ కలిశాయి. తరచూ ప్రేమసాగరంలో మునిగితేలేవారు.

ఆ తరువాత వారు జీవితమంతా కలిసే ఉన్నారు. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలున్నా వారి సంసార జీవితం సాఫీగా సాగుతోంది.

ఇప్పుడు వారు తమ రోజువారీ జీవితంలో భాగంగా ప్రతి రోజూ కొంత సమయం సమీపంలోని డే కేర్ సెంటర్‌లో గడుపుతారు.

కాసేపు వాకింగ్ చేస్తారు. ఇంటి పనులు ఇద్దరూ కలిసి చేసుకుంటారు. అప్పుడప్పుడు మనవళ్లు, మనవరాళ్ల మంచీచెడ్డలు చూస్తారు.

వయసు మీదపడినా ఇప్పటికీ వారికి ఒకరంటే మరొకరికి ఏమాత్రం ఆకర్షణ తగ్గలేదు. వారి అనురాగాన్ని, దేహాలను ఆస్వాదిస్తున్నారు.

లైంగికత, ఇంద్రియ సుఖాలు రెండూ దేనికవే భిన్నమైనవైనప్పటికీ మానవ లైంగిక చర్యలో సమగ్ర అంశాలు. భాగస్వాముల మధ్య ప్రేమలో దేహం, లైంగిక తృప్తి, పరస్పర ఆస్వాదన అన్నీ జీవితం పొడుగునా నేర్చుకుంటూ రోజువారీ ఆనందకర జీవితాన్ని అనుభవించేలా తీర్చిదిద్దుకుంటారు.

వృద్ధుల శృంగారం

ఫొటో సోర్స్, Getty Images

వృద్ధులకూ సుఖసంతోషాల కోసం యువతలాంటి అవసరాలే ఉంటాయి.

వృద్ధాప్యంలో లైంగిక జీవితం గడపడాన్ని వారి ప్రాథమిక హక్కుగా భావించాలి. అది వారి జీవన ప్రమాణ నాణ్యతకు సూచికగా భావించాలి.

ప్రతి వ్యక్తి తనను తాను మహిళగానో, పురుషుడిగానో వ్యక్తీకరించుకునే విధానమే జీవితాంతం నిలిచే వాస్తవం. అదే వారి లైంగికత కూడా.

అవతలి వ్యక్తి శరీర భాగస్వామ్యంలో ఇంద్రియాలతో తృప్తి పొందడమే లక్ష్యంగా ఈ వాస్తవ వ్యక్తీకరణ ఉంటుంది. ఇది వాంఛ, ఇతరులను ఆకర్షించగల సామర్థ్యం వంటివాటిపై ఆధారపడి ఉంటుంది.

వయసు పెరిగినా తృప్తి తగ్గదు

వృద్ధుల్లో చాలామంది లైంగికంగా యాక్టివ్‌గా ఉంటారు. వయసు పెరిగినంత మాత్రాన సెక్స్ పట్ల ఆసక్తి, తృప్తి పొందడం సాధారణంగా తగ్గవు.

జీవితమంతా అనుభవించిన ఆనందాలు వృద్ధాప్యంలో పొందలేకపోవడానికి వయసు కారణం కానప్పటికీ శారీరక పరిమితులు, వ్యాధులు, వాడే మందుల ప్రభావం వంటివి కారణమవుతాయని భావిస్తారు.

Relationship

ఫొటో సోర్స్, Getty Images

లైంగికంగా చురుగ్గా ఉన్నప్పుడు ఇంద్రియ శృంగారంపై ఇలాంటి మార్పుల ప్రభావం పెద్దగా కనిపించదు. ఊహించుకోవడం, ఇంద్రియ ప్రేరణ, ఇతర అన్ని రకాల శృంగారభరిత వాతావరణం స్త్రీపురుషుల కలయిక, తృప్తిని పెంచుతాయి.

వయోధికులు తమ అవసరం కోసం ఏమేం బాహ్య ప్రేరకాలు కోరుకుంటున్నారు, కొనుక్కుంటున్నారనేది కొన్ని ఎరోటిక్ షాప్‌లను సంప్రదించి వివరాలు తెలుసుకున్నాం.

పురుషులలో అంగస్తంభన కలిగించే క్రీములు, పట్టీల కోసం వస్తున్నట్లు ఆ దుకాణాల ద్వారా తెలిసింది. మహిళల విషయానికొస్తే కలయిక సమయంలో వాడేందుకు లూబ్రికెంట్‌లు, లోదుస్తులు, పెర్ఫ్యూమ్‌లు, శృంగారోద్దీపక బొమ్మలు, మసాజర్లు, వైబ్రేటర్ల కోసం వస్తున్నట్లు దుకాణాదారులు చెబుతున్నారు.

అయినప్పటికీ చాలామంది వృద్ధులు శృంగారంలో పాల్గొనకూడదని నిర్ణయించుకుంటున్నారు.

వృద్ధ జంట

ఫొటో సోర్స్, Getty Images

భాగస్వామిని కోల్పోవడం

ఒక వయసు దాటాక లైంగికతను ప్రభావితం చేసే మానసిక, సామాజిక అంశాలు ప్రధానమైనవి.

భాగస్వామిని కోల్పోవడం, లైంగిక ఆరోగ్యంలో సమస్యలు వంటి ఎన్నో అంశాలు వృద్ధాప్యంలో సెక్స్‌ని దూరం చేస్తున్నాయి.

యూనివర్సిటీ ఆఫ్ కేస్టిలా లా మాంచా(యూసీఎల్ఎమ్) వయోధిక విద్యార్థుల్లో జరిపిన సర్వేలో 93 శాతం మంది ఆరోగ్యరీత్యా శృంగారం అత్యంత ప్రాధాన్యాంశమని చెప్పారు. సెక్స్ చేసుకోవడం తగ్గినప్పటికీ శృంగార వాంఛలు కొనసాగుతాయని 71 శాతం మంది చెప్పారు. బంధాన్ని, అనురాగాన్ని ఆస్వాదిస్తామని 69 శాతం మంది వయోధికులు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)