‘ఇడ్లీ అమ్మ’కు ఆనంద్‌ మహేంద్ర ఊహించని గిఫ్ట్‌.. చనిపోయే దాకా ఒక్క రూపాయికే ఇడ్లీ అమ్ముతానంటున్న కమలాత్తాళ్

కమలాతాల్

ఒక్క రూపాయికే ఇడ్లీ అమ్ముతూ 'ఇడ్లీ అమ్మ'గా పేరు తెచ్చుకున్నారు.. తమిళనాడుకు చెందిన వృద్ధురాలు కమలాత్తాళ్.

ఆమె సేవ చూసిన పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహేంద్ర 'ఇడ్లీ అమ్మ'కు ఊహించని గిఫ్ట్‌ ఇచ్చారు.

ఆమెకు సొంత ఇల్లు కట్టివ్వబోతున్నట్లు గతంలో ప్రకటించారు.

అక్కడే ఇడ్లీలు చేసి అమ్మేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.

'ఇడ్లీ అమ్మ' కమలాత్తాళ్ సొంతింటికి సంబంధించిన స్థలం రిజిస్ట్రేషన్ కూడా పూర్తయినట్లు ఆయన నిన్న ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

చనిపోయే వరకు ఒక్క రూపాయికే ఇడ్లీ అమ్ముతా..

చనిపోయే వరకు రూపాయికే ఇడ్లీ అమ్ముతానని, ఎట్టి పరిస్థితుల్లో రేటు పెంచబోనని కమలాత్తాళ్ చెబుతోంది.

కమలాత్తాళ్‌ది తమిళనాడులోని కోయంబత్తూర్‌ సమీపంలో ఉన్న వడివేలంపాలయం గ్రామం.

"ఇప్పుడు మనం 2021లో ఉన్నాం. ఇప్పటికీ మా ఊరిలో రూపాయికే ఇడ్లీ దొరుకుతోంది. 10 రూపాయలతో కడుపునిండా తినొచ్చు. కొన్నిసార్లు మా దగ్గర డబ్బులు లేకున్నా ఆ బామ్మ ఏమీ అనరు. నా జేబులో రూ.500 ఉన్నా సరే, ఇక్కడే ఇడ్లీ తింటాను" అన్నారు వడివెలంపాలయం గ్రామానికి చెందిన రామసామీ.

"రోజూ పొద్దున 5.30 గంటలకు నిద్రలేస్తాను. చట్నీ, సాంబార్ చేస్తా. 6 గంటలకల్లా పొయ్యి వెలిగిస్తా. మధ్యాహ్నం 12 దాకా ఇడ్లీలు అమ్ముతా. బియ్యం, పప్పు, కొబ్బరి, నూనె, ఇతర సామగ్రికి రూ.300 దాకా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చులు పోను రోజూ రూ.200 మిగులుతాయి" అని కమలాత్తాళ్ చెప్పారు.

వీడియో క్యాప్షన్, వీడియో: నేను చనిపోయే దాకా రూపాయికే ఇడ్లీ అమ్ముతా. ఎప్పటికీ ధర పెంచను

ఈ బామ్మ చేసే ఇడ్లీలు, చట్నీ, సాంబార్ కూడా భలే రుచికరంగా ఉంటాయని రామసామీ అంటున్నారు.

ఈ వయసులోనూ బామ్మ రుబ్బురోలును వాడుతున్నారు. తాను ఇప్పటికీ ఇంత బలంగా ఉండటానికి కారణం తన ఆహార అలవాట్లేనని ఆమె అంటున్నారు.

"నేను రాగి జావ తాగేదాన్ని. అలాంటి ఆహారం తినడం వల్లే నేను ఇప్పటికీ పనిచేస్తున్నాను. ఇప్పుడు అందరూ ఎక్కువగా అన్నం తింటున్నారు. కానీ, బియ్యంలో సరైన పోషకాలు ఉండవు" అని ఆమె అన్నారు.

ఇడ్లీ

సాధారణంగా తమిళనాడులో ఒక ఇడ్లీ ఖరీదు రూ.5 నుంచి రూ.20 ఉంటుంది. కానీ, ఈ బామ్మ ఒక్క రూపాయికే ఇడ్లీ ఇవ్వడం అందరినీ ఆలోచింపజేస్తోంది.

"మా ఊరి నుంచి రెండు కిలోమీటర్లు వెళ్తే మెయిన్ రోడ్డు వస్తుంది. అక్కడ ఉండే హోటళ్లలో ఒక్క దోశ తింటే 15 రూపాయలు అవుతాయి. అది తిన్న గంటలోపే మళ్లీ ఆకలేస్తుంది. అవే డబ్బులతో ఇక్కడ ఇడ్లీ కడుపునిండా తొనొచ్చు. మధ్యాహ్నం దాకా ఆకలి బాధే ఉండదు" మరో గ్రామస్థుడు సెల్వ సుందరం వివరించారు.

"నేను చనిపోయే దాకా రూపాయికే ఇడ్లీ అమ్ముతా. ఎప్పటికీ ధర పెంచను" అంటున్నారు ఈ బామ్మ.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

వీడియో క్యాప్షన్, వీడియో: 98 ఏళ్ల బామ్మ యోగా ఎలా చేస్తున్నారో చూశారా?

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)