గల్వాన్ లోయలో చైనా జెండా.. ఫొటోలు, వీడియో విడుదల చేసిన చైనా సైన్యం.. మోదీ సమాధానం చెప్పాలన్న రాహుల్

ఫొటో సోర్స్, @SHEN_SHIWEI
చైనా అంశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి పదే పదే ప్రశ్నలు సంధించే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం ఆయన్ను మరోసారి లక్ష్యంగా చేసుకున్నారు.
ఈసారీ కొత్త సంవత్సరం సందర్భంగా గల్వాన్‌లో చైనా జెండా ఎగరేయడంపై ప్రధాని మోడీకి ఒక ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
"గల్వాన్‌లో మన త్రివర్ణ పతాకమే బాగుంటుంది. చైనాకు సమాధానం ఇవ్వాలి మోదీ గారూ. మౌనం వీడండి" అన్నారు.
రాహుల్ గాంధీ గత ఏడాది చివరి రోజున కూడా ఒక ట్వీట్ చేశారు. చైనా అరుణాచల్ ప్రదేశ్‌లో 15 ప్రాంతాలకు కొత్త పేర్లు పెట్టడం గురించి ప్రధానికి సవాలు విసిరారు.
రాహుల్ గాంధీ ఆ రోజు ఒక వార్తా పత్రికలో ప్రచురించిన కథనాన్ని కూడా తన ట్వీట్‌తో షేర్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
"కొన్ని రోజుల క్రితమే మనం 1971లో భారత్ సాధించిన అద్భుత విజయాన్ని గుర్తు చేసుకున్నాం. దేశ భద్రత, విజయం కోసం తెలివైన, బలమైన నిర్ణయాలు అవసరం. ప్రగల్భాలతో విజయం లభించదు" అన్నారు.
అయితే, అరుణాచల్ ప్రదేశ్‌లో పేర్లు మార్చిన అంశంపై భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన ద్వారా తమ నిరసన వ్యక్తం చేసింది.
"చైనా ఇంతకు ముందు కూడా ఇలాంటి ప్రయత్నమే చేసింది. కానీ ఇలా చేయడం వల్ల వాస్తవాలను మారిపోవు" అంది.
కానీ, గల్వాన్‌లో జెండా ఎగురవేసిన ఘటనపై భారత ప్రభుత్వం ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటనా చేయలేదు.
గల్వాన్‌లో చైనా జెండా
చైనా అధికార కమ్యూనిస్ట్ పార్టీ అధికారవాణి గ్లోబల్ టైమ్స్ పత్రిక జనవరి 1న ఒక రిపోర్ట్ ప్రచురించింది. కొత్త సంవత్సరం సందర్భంగా గల్వాన్ లోయలో చైనా జెండాను ఎగురవేశారని రాసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
"2022 సంవత్సరం తొలి రోజున దేశవ్యాప్తంగా చైనా ఐదు నక్షత్రాల ఎర్ర జెండా ఎగురవేశారు. వీటిలో హాంకాంగ్ ప్రత్యేక పాలిత ప్రాంతం, గల్వాన్ లోయ కూడా ఉన్నాయి" అని తన కథనంలో చెప్పింది.
ఈ వార్తా కథనం వివరాల ప్రకారం దీనికి సంబంధించి పత్రికకు ఒక వీడియో కూడా పంపించారు.
ఆ వీడియోలో భారత సరిహద్దుల దగ్గర గల్వాన్ లోయలో బండరాళ్లపై 'ఒక అంగుళం భూమి కూడా వదలొద్దు' అని మాండరిన్‌లో రాసిన నినాదం ముందు నిలబడిన చైనా సైనికులు, చైనా ప్రజలకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెబుతుండడం కనిపిస్తోంది.
"మా సరిహద్దును కాపాడుకుంటామని మేం మా మాతృభూమికి ప్రమాణం చేస్తున్నాం" అని చైనా సైనికులు గట్టిగా చెప్పడం కూడా ఇందులో కనిపిస్తోంది.
గ్లోబల్ టైమ్స్ వివరాల ప్రకారం ఆ తర్వాత చైనా జెండాను ఒక డ్రోన్‌తో ఆకాశంలో పైకి తీసుకెళ్లారు. అక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్న చైనా వెస్టర్న్ థియేటర్ కమాండ్ సైనికులు ఆ జెండాకు సెల్యూట్ చేశారు. దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ ఘటన జరిగిన ఒక రోజు తర్వాత గ్లోబల్ టైమ్స్ రెండు ట్వీట్లు కూడా చేసింది. అందులో కొన్ని ఫొటోలతోపాటూ భారత మీడియాను ఉటంకిస్తూ.. "కొత్త సంవత్సరం సందర్భంగా వాస్తవాధీన రేఖ దగ్గర భారత, చైనా సైనికులు పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. స్వీట్లు పంచుకున్నారు. వాటిలో తూర్పు లద్దాఖ్‌లో ఘర్షణ జరిగిన ప్రాంతం కూడా ఉంది" అని చెప్పింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
"ఇది నిజమైతే అక్టోబర్లో జరిగిన కోర్ కమాండర్ స్థాయి చర్చలు భారత్ అర్థం లేని డిమాండ్ల వల్ల ప్రతిష్టంభనతో ముగిసినా దీనిని ఇప్పుడు ఒక సానుకూల సంకేతంగా చూడాలి" అని గ్లోబల్ టైమ్స్ రాసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
"కొత్త సంవత్సరం రోజున భారత్, చైనా సైనికులు ఎల్ఏసీలోని చాలా పోస్టుల దగ్గర స్వీట్లు పంచుకున్నారు. పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఇందులో తూర్పు లద్దాఖ్ దగ్గర పోస్టులు కూడా ఉన్నాయి" అని అధికారులు తమకు చెప్పారని పీటీఐ తెలిపింది.
గత ఏడాదిన్నరగా చాలా ప్రాంతాల గురించి ప్రతిష్టంభన కొనసాగుతున్న సమయంలో తాజాగా రెండు పక్షాల మధ్యా ఇలాంటి స్థితి కనిపించింది అని గ్లోబల్ టైమ్స్ తన రిపోర్టులో చెప్పింది.
గత ఏడాది మే 5న తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్ సరస్సు దగ్గర రెండు దేశాల సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగాయి. ఆ తర్వాత ఇరు దేశాలు మెల్లమెల్లగా ఆ ప్రాంతాల్లో భారీ సంఖ్యలో సైనికులను మోహరించాయి.

ఫొటో సోర్స్, Getty Images
గల్వాన్ ఘర్షణ
భారత్, చైనా సైనికుల మధ్య 2020 జూన్‌లో గల్వాన్ లోయలో ఘర్షణ జరిగింది. ఇందులో 20 మంది భారత సైనికులు చనిపోయారు. ఈ ఘర్షణలో తమ నలుగురు సైనికులు చనిపోయినట్లు చైనా తర్వాత చెప్పింది.
ఏప్రిల్ మూడో వారంలో లద్దాఖ్ సరిహద్దుల్లో ఎల్ఏసీ దగ్గర చైనా ఆర్మీ సైనిక దళాలు, భారీ ట్రక్కుల సంఖ్య పెరిగినప్పటి నుంచి ఈ గొడవ మొదలయ్యిందని భారత్ చెప్పింది.
చైనా సైన్యం ఆ ప్రాంతంలో తమ గుడారాలు వేసిందని, కందకాలు తవ్విందని, భారత్ తమ భూభాగంగా భావిస్తున్న ప్రాంతంలోకి ఎన్నో కిలోమీటర్లు లోపలి వరకూ చైనా తమ భారీ మిలిటరీ పరికరాలను తీసుకువచ్చిందని ఆరోపించింది.
ఈ ఘటనతో కలవరపడ్డ భారత్ వేలాది సైనికులను, సైనిక పరికరాలను లద్దాఖ్ సరిహద్దుల్లోకి తరలించింది. ఆ తర్వాత జూన్ 15-16 రాత్రి లద్దాఖ్ దగ్గర గల్వాన్ లోయలో రెండు దేశాల సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణలో భారత సైన్యంలోని ఒక కల్నల్ సహా 20 మంది సైనికులు మృతిచెందారు.
ఈ ఘర్షణలకు మీరంటే మీరే కారణం అని భారత, చైనా పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి.
భారత్, చైనా మధ్య దాదాపు 3440 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. కానీ 1962 యుద్ధం తర్వాత నుంచి ఈ సరిహద్దులో ఎక్కువ భూభాగంపై ఒక స్పష్టత లేదు. దీంతో రెండు దేశాలు ఆ భూభాగంపై రకరకాల వాదనలు చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- భారత్, పాకిస్తాన్ల మధ్య తీర్థయాత్రలు.. సత్సంబంధాలకు కొత్త ప్రయత్నమా
- శవాల మధ్య దాక్కుని ప్రాణాలు కాపాడుకున్న 9 మంది మహిళలు
- భారత్, పాకిస్తాన్ల మధ్య తీర్థయాత్రలు.. సత్సంబంధాలకు కొత్త ప్రయత్నమా
- 1971 భారత్-పాక్ యుద్ధం: పారిపోవడానికి ఎత్తులు వేసిన పాక్ యుద్ధఖైదీలకు చుక్కలు చూపిన భారత సైన్యం
- 88 ఏళ్ల కిందటే భారత్‌లో జరిగిన ఒక దారుణ బయో మర్డర్ కుట్ర కథ
- డన్‌కర్క్: ‘చరిత్ర చెప్పని, పుస్తకాల్లో చోటు దక్కని’ 300 మంది భారత సైనికుల కథ
- రాజస్థాన్, గుజరాత్ సరిహద్దుల్లోని మాన్‌గఢ్ కొండ మీద 1500 మంది ఊచకోత.. వందేళ్ల కిందటి ఈ నరమేధానికి కారణమేమిటి
- ఆంధ్రా యూనివర్సీటిలో 2,663 తాళపత్ర గ్రంథాలు.. వీటిలో ఏం రాసి ఉంది?
- గోవాను 451 ఏళ్ల బానిసత్వం నుంచి రామ్ మనోహర్ లోహియా ఎలా విడిపించారు?
- ‘భారత సైన్యానికి లొంగిపోకపోతే మరో పాకిస్తాన్‌ను కూడా కోల్పోవాల్సి ఉండేది’
- చరిత్ర: ‘విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు’ ఎలా సాధించుకున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)