గల్వాన్ లోయ: సైనికులకు మార్ష‌ల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇస్తున్న చైనా.. భారత్‌తో ఘర్షణల్లో గన్స్ వాడకూడదన్న నిబంధన వల్లేనా?

జింగ్హౌ, గాంగ్షీ ప్రాంతంలోని సముద్రంలో ఆర్మ్‌డ్ పోలీసు అధికారులకు దుంగల్ని ఎత్తే శిక్షణ ఇస్తున్న చైనా (2020 జూన్ 16వ తేదీన తీసిన చిత్రం)

ఫొటో సోర్స్, Costfoto/Barcroft Media via Getty Images

ఫొటో క్యాప్షన్, చైనా తన ఆర్మ్‌డ్ పోలీసులు, సైనికులకు తీవ్రమైన పరిస్థితుల్ని తట్టుకునేలా శిక్షణ ఇస్తోంది. జింగ్హౌ, గాంగ్షీ ప్రాంతంలోని సముద్రంలో ఆర్మ్‌డ్ పోలీసు అధికారులకు దుంగల్ని ఎత్తే శిక్షణ ఇస్తున్న చైనా (2020 జూన్ 16వ తేదీన తీసిన చిత్రం)

త‌మ బ‌ల‌గాల‌కు శిక్ష‌ణ ఇచ్చేందుకు టిబెట్ పీఠభూమికి 20 మంది మార్ష‌ల్ ఆర్ట్స్ నిపుణుల్ని పంపిస్తున్న‌ట్లు చైనా తెలిపింది.

దీనికి వెనుక గ‌ల కార‌ణాల‌ను మాత్రం వెల్ల‌డించ‌లేదు. అయితే ల‌ద్దాఖ్‌లోని గల్వ‌ాన్ లోయ‌లో జ‌రిగిన‌‌ ఘ‌ర్ష‌ణ‌ల్లో 20 మంది భార‌త సైనికులు మ‌ర‌ణించిన అనంత‌రం తాజా ప‌రిణామం చోటుచేసుకుంది.‌

1996లో కుదిరిన ఒప్పందం ప్ర‌కారం.. రెండు దేశాలు ఈ ప్రాంతాల్లో తుపాకులు, పేలుడు ప‌దార్థాలు ఉప‌యోగించ‌కూడ‌దు.

ఘ‌ర్ష‌ణ‌లో త‌మ వైపు ఎంత మంది మ‌ర‌ణించారో చైనా వెల్ల‌డించ‌లేదు. అయితే, 20 మంది త‌మ సైనికులు అమ‌రుల‌య్యార‌ని, 76 మందికి గాయాల‌య్యాయ‌ని భార‌త్ తెలిపింది.

చైనా ఆర్మీ సైనికులు

ఫొటో సోర్స్, AFP

మార్ష‌ల్ ఆర్ట్స్ నిపుణుల‌తో సైన్యానికి శిక్ష‌ణ‌కు సంబంధించిన వార్త‌లు చైనా అధికారిక వార్తా సంస్థ‌ల్లో జూన్ 20న వ‌చ్చాయ‌ని హాంగ్‌కాంగ్ మీడియా వెల్ల‌డించింది.

ఎంబో ఫైట్ క్ల‌బ్‌కు చెందిన 20 మంది యోధుల‌ను టిబెట్ రాజ‌ధాని లాసాకు త‌ర‌లిస్తున్న‌ట్లు చైనా అధికారిక వార్తా సంస్థ సీసీటీవీ తెలిపింది. అయితే భార‌త్ స‌రిహ‌ద్దుల్లోని బ‌ల‌గాల‌కు వీరు శిక్ష‌ణ ఇవ్వ‌బోతున్నారా? అనే విష‌యాన్ని స్ప‌ష్టంచేయ‌లేదు.

ఈ నెల 15న గల్వ‌ాన్ లోయ‌లో ఘ‌ర్ష‌ణ‌ల‌కు సంబంధించి త‌ప్పు మీదంటే మీద‌ని అణ్వాయుధ దేశాలైన భార‌త్‌, చైనా ఒక‌రిపై మ‌రొక‌రు ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నాయి.

అక్సాయ్ చిన్‌కు స‌మీపంలో క‌ఠిన‌మైన వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌తోపాటు భారీ ఎత్తులో ఉండే ఈ వివాదాస్ప‌ద‌ ప్రాంతం త‌మ‌ద‌ని భార‌త్ చెబుతోంది. అయితే ప్ర‌స్తుతం ఇది చైనా నియంత్ర‌ణ‌లో ఉంది.

రెండు బ‌ల‌గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌ల్లో మ‌ర‌ణాలు సంభ‌వించ‌డం.. గ‌త 45 ఏళ్ల‌లో ఇదే తొలిసారి.

తాజా ఘ‌ర్ష‌ణ‌లకు కొన్ని వారాల‌ ముందు నుంచీ వాస్త‌వాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబ‌డి భార‌త్‌-చైనా స‌రిహ‌ద్దు బ‌ల‌గాల మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు చోటుచేసుకున్నాయి.

భారతీయ సైనికుడు

ఫొటో సోర్స్, Yawar Nazir/Getty Images

భారత్, చైనా దేశాల మధ్య గతంలో కుదిరిన ఒప్పందాల ప్రకారం.. గల్వాన్ లోయ ప్రాంతంలో సైనికులు తుపాకులు, ఇతర మారణాయుధాలను ఉపయోగించకూడదు.

ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల సైనికుల మధ్య తలెత్తిన ఘర్షణల్లో ఇనుప ముళ్ల గదలను, రాడ్డులను, కర్రలను ఉపయోగించినట్లు వార్తలు వచ్చాయి.

ఈ పరిస్థితుల మధ్య చైనా తమ సైనికులకు కఠోర పరిస్థితులను తట్టుకునేలా తీవ్రమైన శిక్షణ ఇస్తోంది.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)