కరోనా వైరస్ టెస్ట్: ఇంట్లోనే సులభంగా పరీక్షించుకోవచ్చు.. గంటలోనే ఫలితం తెలుస్తుంది

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మిషెల్ రాబర్ట్స్
- హోదా, బీబీసీ హెల్త్ ఎడిటర్
కరోనా వైరస్ సోకిందో లేదో తెలుసుకునేందుకు ఇంటి వద్దే ఎవరికివారు టెస్ట్ చేసుకునేలా కొత్త విధానాన్ని బ్రిటన్‌లో పరీక్షిస్తున్నారు.
దీనివల్ల ప్రజలు ఇంటి దగ్గరే తమ లాలాజలంతో స్వయంగా పరీక్ష చేసుకుని, వైరస్ సోకిందో లేదో నిర్ధరించుకునే వీలు కలుగుతుంది.
14,000కి పైగా ఉద్యోగులు, ఇతర కార్మికులు ఈ ప్రయోగ పరీక్షల్లో పాల్గొంటున్నారు. సౌత్ ఆంప్టన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ పైలట్ ప్రాజెక్టును 4 వారాల పాటు నిర్వహిస్తున్నారు.
ఇది విజయవంతం అయితే ప్రజలకి కరోనా వైరస్ నిర్ధరణ చేసుకోవడం సులభమవుతుందని నిపుణులు భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
స్వాబ్ పరీక్షలు చేయాలంటే గొంతు లోపలి నుంచి నమూనాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, ఈ లాలాజల పరీక్ష అలా కాకుండా చాలా సులభంగా ఉంటుంది.
ల్యాబ్ లో పరీక్షలు చేయడానికి యూనివర్సిటీ ఉద్యోగులు, కొంత మంది విద్యార్థులు శాంపిళ్లను ఇస్తారు.
ఈ కిట్లను ఇళ్లకే సరఫరా చేస్తారు. లాలాజలం సేకరించిన తర్వాత ఈ ప్రయోగం పై పని చేస్తున్న సిబ్బంది వీటిని సేకరించి పరిశీలిస్తారు.
ఇలాంటి పరీక్షలు, కరోనావైరస్ లక్షణాలు లేకుండా వైరస్ సోకిన వారిని త్వరగా గుర్తిస్తుంది. దీంతో , వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించవచ్చు.
ఈ పరీక్షలు, బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్ నిర్వహిస్తున్న పరీక్షలకు అదనంగా చేసుకోవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ ప్రయోగంలో పాల్గొంటున్న వారిని బ్రిటన్ వైద్య కార్యదర్శి మాట్ హాన్ కాక్ ప్రశంసించారు. "ఈ ప్రయోగం విజయవంతమైతే ప్రజలు ఇంటి దగ్గరే పరీక్షలు చేసుకోవచ్చని అన్నారు. దీని వలన, కేసులను తొందరగా గుర్తించే అవకాశం కలుగుతుందని” అన్నారు.
ఎవరికైనా పాజిటివ్ వస్తే వైరస్ వ్యాప్తి చెందకుండా సెల్ఫ్ ఐసోలేషన్ కి వెళ్లమని సూచించవచ్చని చెప్పారు.
ఈ లాలాజల పరీక్ష లూప్ మెడియటేడ్ ఐసో థర్మల్ ఆమ్ప్లిఫికేషన్ విధానం ద్వారా వైరస్ లో ఉండే జెనెటిక్ పదార్ధాన్ని గుర్తిస్తుంది.స్వాబ్ పరీక్షల కన్నా ఈ విధానం ద్వారా పరీక్షలు నిర్వహించడం, సులభమని నిపుణులు చెబుతున్నారు.
ఈ పరీక్షల ఫలితాలు ఒక గంటలో వచ్చేస్తాయి.
దీంతో పాటు, యూనివర్సిటీ పరిశోధకులు మరిన్ని కొత్త విధానాల కోసం పరిశోధనలు జరుపుతున్నారు.
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:
- డెక్సామెథాసోన్: కరోనా 'లైఫ్ సేవింగ్' మెడిసిన్‌కు, భారత్‌కు ఉన్న బంధం ఏంటి?
- కరోనావైరస్: డెక్సామెథాసోన్ ఏంటి? ఈ మందు ఎలా పనిచేస్తుంది? దీని ధర ఎంత?
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనా వైరస్: అన్ని దేశాలూ వణుకుతున్నా, థాయిలాండ్ మాత్రం చైనీయులకు తమ తలుపులు తెరిచే ఉంచింది.. ఎందుకు? ః
- కరోనావైరస్ ప్రపంచవ్యాప్త మహమ్మారిగా మారిందా? వైద్య నిపుణులు ఏమంటున్నారు?
- కరోనా వైరస్: పిల్లలపై ప్రభావం చూపలేకపోతున్న వైరస్.. కారణాలు చెప్పలేకపోతున్న వైద్య నిపుణులు
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనా వైరస్: 'తుమ్మినా, దగ్గినా ఇతరులకు సోకుతుంది.. దగ్గు, జ్వరంతో మొదలై అవయవాలు పనిచేయకుండా చేస్తుంది'
- కరోనావైరస్ లక్షణాలు: ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








