భారత్-చైనా సరిహద్దు వివాదం: గల్వాన్ లోయలో ఘర్షణ వీడియోను విడుదల చేసిన చైనా

భారత సైనికుడు

ఫొటో సోర్స్, Getty Images

మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

2020 జూన్‌లో గల్వాన్ లోయలో భారత, చైనా సైన్యం మధ్య జరిగిన ఘర్షణ వీడియో ఫుటేజ్‌ను చైనా ప్రభుత్వ మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ విడుదల చేసింది.

అప్పుడు జరిగిన ఘర్షణల్లో భారత సైన్యానికి చెందిన 20 మంది సైనికులు చనిపోయారు.

ఈ గొడవల్లో తమ నలుగురు సైనికులు కూడా చనిపోయారని చైనా అంగీకరించింది.

చైనా తరఫున విడుదలైన ఒక వీడియోలో చనిపోయిన నలుగురు సైనికులకు చైనా ఆర్మీ గౌరవ వందనం చేస్తున్న దృశ్యాలు ఉన్నాయి.

ఈ వీడియోలో భారత్‌, చైనా సైనికుల మధ్య ఘర్షణ, ఇరు సైన్యాల అధికారులు మాట్లాడుకోవడం కూడా కనిపిస్తుంది.

చైనా ఈ వీడియోలో పరోక్షంగా భారత్‌ను ఉద్దేశిస్తూ "ఏప్రిల్ నుంచీ విదేశీ శక్తులు పాత ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నాయి. వంతెనలు, రోడ్డు వేయడం కోసం వాళ్లు సరిహద్దును దాటారు. త్వరత్వరగా నిఘా పూర్తి చేశారు" అని చెప్పింది.

"విదేశీ శక్తులు యధాతథ స్థితిలో మార్పు తెచ్చేందుకు ఏకపక్షంగా ప్రయత్నించారు. ఫలితంగా సరిహద్దుల్లో వేగంగా ఉద్రిక్తతలు పెరిగాయి, ఒప్పందాలను గౌరవిస్తూ మేం చర్చల ద్వారా పరిస్థితిని చక్కదిద్దాలని ప్రయత్నించాం" చూశాం అని పేర్కొంది.

ఈ వీడియో ఫుటేజిలో భారత, చైనా సైనికులు రాత్రి చీకట్లో ఒకరిపై ఒకరు కాల్పులు జరపడం కనిపిస్తోంది. అందులో చైనా సైనికులు గాయపడ్డ తమ సైనికుడిని తీసుకెళ్లడం కూడా ఉంది. అందులోనే చనిపోయిన తమ సైనికులకు చైనా ఆర్మీ గౌరవ వందనం చేయడం కూడా ఉంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

తమ సైనికులు కూడా చనిపోయారని మొదటిసారి ఒప్పుకున్న చైనా

అంతకు ముందు చైనా ఆర్మీ అధికారిక పత్రిక పీఎల్ఏ డెయిలీని ఉటంకిస్తూ ఒక వార్త ప్రచురించిన గ్లోబల్ టైమ్స్ "చైనా తన సౌర్వభౌమత్వాన్ని రక్షించుకోడానికి త్యాగాలు చేసిన సైనికులకు నివాళిగా వారి పేర్లు, వివరాలను మొదటిసారి వెల్లడించింది" అని చెప్పింది.

కారాకోరమ్ పర్వతాల్లో చైనా సైన్యంలోని ఐదుగురు అధికారులు, సైనికులను చైనా సెంట్రల్ మిలిట్రీ కమిషన్ గుర్తించిందని వారిని తగిన పదవులతో సత్కరిస్తామని పీఎల్ఏ డెయిలీ శుక్రవారం తన రిపోర్ట్‌లో చెప్పింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ఆ రిపోర్టులో చైనా ఆర్మీ మొదటిసారి గల్వాన్ ఘర్షణ గురించి వివరణాత్మక కథనం ఇచ్చింది. "భారత సైన్యం అక్కడికి పెద్ద సంఖ్యలో సైనికులను పంపించింది. వారంతా దాక్కున్నారు. చైనా సైన్యం వెనక్కు వెళ్లేలా బలవంతం చేశారు అని చెప్పింది.

ఆ దాడుల సమయంలో చైనా సైనికులు స్టీల్ రాడ్లు, మేకులు ఉన్న రాడ్లు, రాళ్లతో తమ సౌర్వభౌమాధికారాన్ని ఎలా రక్షించుకున్నారో కూడా చైనా ఆర్మీ ఆ రిపోర్టులో చెప్పింది.

వీడియో క్యాప్షన్, గాల్వన్ లోయ ఎక్కడుంది? ఎందుకంత కీలకం?
BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)