బీజింగ్ ఎయిర్‌పోర్ట్ ఫొటోను నోయిడా ఎయిర్‌పోర్ట్‌ అంటూ కేంద్ర మంత్రులు ఎందుకు పోస్ట్ చేశారు?

చైనా ఎయిర్‌పోర్ట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చైనా ఎయిర్‌పోర్ట్ చిత్రం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడా నుంచి చైనా వరకు, గత కొన్నిగంటలుగా సామాజిక మాధ్యమాల్లో ఒక ఫొటో గురించి విపరీతంగా చర్చ జరుగుతోంది.

రెండు రోజుల క్రితం భారత కేంద్ర మంత్రులు, నాయకుల్లో చాలా మంది ఈ ఫొటోను తమ ట్విట్టర్ ఖాతాల ద్వారా పంచుకున్నారు. గ్రేటర్ నోయిడాలో కొత్తగా నిర్మించనున్న జేవర్ ఎయిర్‌పోర్ట్‌ ఇదేనని పేర్కొంటూ ఆ ఫొటోను షేర్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన వీడియోలో కూడా ఈ ఫొటోకు చోటు దక్కింది.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని జేవర్‌లో నిర్మించనున్న నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 25న శంకుస్థాపన చేశారు. ఈ నిర్మాణం పూర్తయితే, ఆసియా ఖండంలోనే ఇదే అతిపెద్ద విమానాశ్రయంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

వీడియో క్యాప్షన్, చైనాకు ఇంత పెద్ద మరో విమానాశ్రయం అవసరమా?

అధికార పార్టీలోని అగ్ర నాయకులు, పలువురు కేంద్ర మంత్రులు కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడిస్తూ, సోషల్ మీడియా ఖాతాల్లో దానికి సంబంధించిన ఫొటోను షేర్ చేశారు. అయితే కొన్ని గంటల్లోనే ఆ ఫొటో వైరల్‌గా మారింది.

షేన్ శివాయ్ అనే వ్యక్తి ట్వీట్‌తో ఈ చర్చ మొదలైంది. అతనిది వెరిఫైడ్ ట్విట్టర్ ఖాతా. అందులో చైనా వ్యవహారాల నిపుణుడిగా, చైనా ప్రభుత్వ మీడియాగా తనను తాను ఆయన పేర్కొన్నారు.

''భారత్‌లోని చాలా మంది ప్రముఖులు జేవర్ ఎయిర్‌పోర్ట్‌గా భావిస్తోన్న ఆ చిత్రం... వాస్తవానికి, రెండేళ్ల క్రితం బీజింగ్‌లో ప్రారంభమైన ఒక విమానాశ్రయం'' అని షెన్ శివాయ్ పేర్కొన్నారు.

''భారత ప్రభుత్వ మంత్రులు... కేవలం చైనాలోని బీజింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ డిజైన్‌ను మాత్రమే కాకుండా, దక్షిణ కొరియాలోని ఇంచియోన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను కూడా నోయిడా విమానాశ్రయమని పేర్కొంటూ తమ మౌలిక వసతుల విజయాల గురించి గొప్పలు చెప్పుకుంటున్నారు'' అని షెన్ శివాయ్ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

కేంద్ర సమాచార ప్రసార శాఖ, క్రీడలు యువజన వ్యవహారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, ఉత్తర్‌ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమ, జలశక్తి సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్, కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి, ఉత్తర్‌ప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు పంకజ్ సింగ్, ఢిల్లీ ప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు, డీడీసీఏ డైరెక్టర్ సునీల్ యాదవ్‌లు చేసిన ట్వీట్‌ల సమాహారాన్ని షెన్ శివాయ్ పోస్ట్ చేశారు.

''భారత ప్రభుత్వం చేస్తోన్ననకిలీ వార్తల ప్రచార వ్యవహారం బట్టబయలైంది'' అని ఆయన మరో ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

పరిశీలన

షెన్ వెల్లడించిన భారత నాయకుల ట్విట్టర్ ఖాతాలను మేం పరిశీలించినప్పుడు అందులో చాలా ట్వీట్లు మాకు లభించలేదు.

కానీ, దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేయగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆరోజు ఉదయం అదే వీడియోను ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసినట్లు తెలిసింది. ఆయనతో పాటు అర్జున్ రామ్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, అన్నపూర్ణ దేవి, పంకజ్ సింగ్ కూడా తమ ట్విట్టర్‌లో ఈ చిత్రాన్ని ఉపయోగించారు.

అనురాగ్ ఠాకూర్ ట్వీట్

ఫొటో సోర్స్, TWITTER @ANURAG_OFFICE

జేవర్ ఎయిర్‌పోర్ట్ అని పేర్కొన్న ఈ ఫొటో వల్లే సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది.

ట్వీట్

ఫొటో సోర్స్, TWITTER

ట్వీట్

ఫొటో సోర్స్, TWITTER

ట్వీట్

ఫొటో సోర్స్, TWITTER

ట్వీట్

ఫొటో సోర్స్, TWITTER

దీనిపై ఎవరెవరు ఏమేం అన్నారు?

ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్ కాగానే, చాలా మంది దీనిపై స్పందించారు.

''బీజేపీ అబద్ధపు పనులన్నింటి కోసం ఇలాగే ఫొటోలను వాడుతుంది. అబద్ధపు మాటలు చెప్పేవారు నిజాయతీగా ఎలా ఆలోచించగలరు'' అని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

జమ్ము, కశ్మీర్ కాంగ్రెస్ నేత సైఫుద్దీన్ కుమారుడు సల్మాన్ అనీస్ సోజ్ కూడా దీనిపై స్పందించారు.

''భారత భూభాగాన్ని చైనా ఆక్రమించినందుకు ప్రతిస్పందనగా, బీజింగ్ ఎయిర్‌పోర్ట్‌ను భారత్ తమదిగా భావిస్తోంది. ఇక్కడ నిజంగా ప్రధాని మోదీని ప్రశంసించాలి. మన మంత్రులు మనం గర్వపడేలా చేశారు'' అని ఆయన వ్యంగ్యంగా రాసుకొచ్చారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

''అద్భుతం మోదీజీ. అబద్ధాలకు, ప్రచారానికి కూడా ఒక హద్దు ఉంటుంది. లడఖ్, అరుణాచల్ భూభాగాన్ని చైనా ఆక్రమించకుండా మీ 56 అంగుళాల ఛాతీ ఆపలేకపోయింది. ఇప్పుడు మీ మంత్రులేమో బీజింగ్ విమానాశ్రయ డిజైన్‌ను కాపీ కొట్టి జేవర్ ఎయిర్‌పోర్ట్ అని చెబుతున్నారు'' అని ప్రశాంత్ భూషన్ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

ఆ చిత్రంలో నిజమెంత?

సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపిన ఈ చిత్రం ఎక్కడిదో తెలుసుకునేందుకు మేం ప్రయత్నించాం. అది బీజింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించిన చిత్రమే అని మాకు తెలిసింది.

చైనా ప్రభుత్వ మీడియా 'గ్లోబల్ టైమ్స్' ప్రకారం డాషింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఈ ఏడాది సెప్టెంబర్ 25 నాటికి రెండేళ్లు పూర్తి చేసుకుంది. 2019 నుంచి ఈ విమానాశ్రయం పని చేస్తోంది.

గెట్టీ ఇమేజెస్‌లో కూడా మేం ఈ చిత్రం గురించి తనిఖీ చేశాం. అందులో కూడా ఇది డాషింగ్ ఎయిర్‌పోర్ట్‌కు చెందిన చిత్రమే అని తేలింది. కావాలంటే మీరు ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా కూడా దీన్ని చూడొచ్చు.

కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షీ లేఖి ట్విట్టర్ ఖాతాలో ఈ చిత్రం ఇప్పటికీ అలాగే ఉంది.

ట్వీట్

ఫొటో సోర్స్, TWITTER @M_LEKHI

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)