హనుమ విహారి ఫౌండేషన్, ఎన్టీఆర్ ట్రస్టు మధ్య గొడవేంటి? ఈ క్రికెటర్ ట్విటర్ నుంచి ఎందుకు తప్పుకున్నాడు?

ఫొటో సోర్స్, facebook/hanumavihari1
భారత క్రికెటర్, తెలుగు క్రీడాకారుడు హనుమ విహారి క్రికెటేతర అంశాల్లో ట్రోలింగ్‌కు గురయ్యారు.
హనుమ విహారి ఫౌండేషన్‌లో ఒక సమాచార లోపం వల్ల జరిగిన పొరపాటు కారణంగా ఆయన విమర్శల పాలయ్యారు.
ఆయన స్థాపించిన హనుమ విహారి ఫౌండేషన్ సామాజిక కార్యక్రమాలు, విపత్తు సమయాల్లో సహాయ కార్యక్రమాలను చేస్తోంది.
నవంబర్ 19న జరిగిన ఒక పొరపాటు కారణంగా ఇక నుంచి సామాజిక సేవకు దూరంగా ఉండాలని ఫౌండేషన్ నిర్ణయించుకుంది.
వ్యక్తిగతంగా, కుల ప్రాతిపదికగా తీవ్ర దూషణలు ఎదుర్కొన్న విహారి కూడా ట్విట్టర్ నుంచి తప్పుకున్నారు.

ఆయనతో పాటు హనుమ విహారి ఫౌండేషన్ కూడా ట్విట్టర్ నుంచి తమ ఖాతాను డిలీట్ చేసింది. ఇకనుంచి ఎటువంటి స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టబోమని ఈ సందర్భంగా హనుమ విహారి ఫౌండేషన్ ప్రకటించింది.

అసలేం జరిగింది?
భారీ వర్షాలు, వరదలకు అతలాకుతలమైన తిరుపతిలో హనుమ విహారి ఫౌండేషన్ సహాయ చర్యలు చేపట్టింది.
వరద నీటిలో చిక్కుకున్న ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి ఆహారపదార్థాలు, పాలు, బ్రెడ్ వంటి వాటిని పంపిణీ చేసింది.
అదే సమయంలో తెలుగు దేశం పార్టీ, సామాజిక మాధ్యమం ట్విట్టర్ వేదికగా కొన్ని ఫొటోలను పంచుకుంది.
''అసెంబ్లీలో తమ పార్టీని, అధినేత నారా చంద్రబాబు నాయుడును, ఆయన భార్య భువనేశ్వరిని అధికార పార్టీ అవమానిస్తుంటే.. అదే సమయానికి భువనేశ్వరి ఆధ్వర్యంలోని ఎన్టీఆర్ ట్రస్టు, తిరుపతి వరద బాధితులకు సేవలందిస్తోంది'' అని ట్వీట్‌లో పేర్కొంటూ సహాయ కార్యక్రమాలను చేస్తోన్న కొన్ని ఫొటోలను షేర్ చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ ట్వీట్‌కు హనుమ విహారి ఫౌండేషన్ స్పందించింది.
''నవంబర్ 19న తిరుపతిలో జరిగిన ఈ సహాయ కార్యక్రమాలకు, టీడీపీకి గానీ లేదా ఎన్టీఆర్ ట్రస్టుకు గానీ ఎలాంటి సంబంధం లేదు. మాతో పాటు వచ్చిన రవి, లోకేశ్ అనే ఇద్దరు వాలంటీర్లు 'ఎన్టీఆర్ ట్రస్టు టీ షర్ట్స్' వేసుకొని ఉన్నారు. అంతమాత్రానా ఇది మీరు చేసినట్లు కాదు కదా?'' అని టీడీపీ పార్టీని ప్రశ్నించింది.

ఫొటో సోర్స్, HANUMA VIHARI FOUNDATION
తిరుపతి ప్రజలకు సహాయ పడేందుకే ఈ సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు చెప్పింది. ''ఈ కార్యక్రమాలను వేరే ఫౌండేషన్‌తో జతకట్టడం గానీ, లేదా వేరే పార్టీ భాగస్వామ్యంతో గానీ చేయలేదు. ఇద్దరు వాలంటీర్లు పొరపాటున 'ఎన్టీఆర్ ట్రస్టు' టీ షర్టులు ధరించారు. అంతే తప్ప ఇందులో ఎలాంటి పొలిటికల్ ఎజెండా లేదు'' అని ఫౌండేషన్ ట్వీట్‌లో పేర్కొంది.

ఫొటో సోర్స్, HANUMA VIHARI FOUNDATION
దీంతో టీడీపీ వారిపై కొంతమంది ట్విట్టర్‌లో జోకులు పేల్చారు. వేరే వాళ్ల చేసిన పనిని మేమే చేశామని టీడీపీ వాళ్లు ఎలా చెప్పుకుంటున్నారో అంటూ విమర్శలు చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
‘‘హనుమ విహారి ఫౌండేషన్ రూ. 3500 బ్రెడ్ ఇస్తే.. మేం రూ. 3 లక్షల ఆహారాన్ని ఇచ్చాం’’
హనుమ విహారి ఫౌండేషన్ ట్వీట్ చేసిన కాసేపటికి ఎన్టీఆర్ ట్రస్టు కూడా ట్విట్టర్‌లో బదులిచ్చింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
''మీకు తెలియజేసేదేంటంటే... రవి కమార్, లోకేశ్ అనే వ్యక్తులు ఎన్టీఆర్ ట్రస్టు ఉద్యోగులు. అంతేగానీ వారు ఏదో సంస్థ వాలంటీర్లు కాదు. వారు పలువురు దాతలు దగ్గర్నుంచి సేకరించిన ఆహారపదార్థాలతో పాటు కొనుగోలు చేసిన ఉత్పత్తుల్ని కూడా గురువారం నుంచే బాధితులకు పంచిపెడుతున్నారు. హనుమ విహారి ఫౌండేషన్ కేవలం రూ. 3500 విలువ చేసే బ్రెడ్‌ను మాత్రమే ప్రజలకు అందించింది. కానీ ఎన్టీఆర్ ట్రస్టు రూ. 3 లక్షల విలువ చేసే ఆహారాన్ని బాధితులకు పంపిణీ చేసింది'' అని పేర్కొంటూ తమ ఉద్యోగుల ఐడీ కార్డులతో సహా తమ ఉద్యోగులు అందిస్తోన్న సహాయ కార్యక్రమాల ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
హనుమ విహారిపై ట్రోలింగ్
ఎన్టీఆర్ ట్రస్టు ట్వీట్ చేసిన తర్వాత పలువురు హనుమ విహారిపై ట్రోలింగ్ మొదలుపెట్టారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
ఫౌండేషన్ పేరుతో వ్యాపారం చేస్తున్నావా అని ఒకరు నిందించగా, విహారి కుల రాజకీయాలు చేస్తున్నాడని మరొకరు ఆరోపించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5

పోస్ట్ of X ముగిసింది, 6
విహారిపై పరువునష్టం దావా వేయాలని కొందరు డిమాండ్ చేశారు.
క్షమాపణ కోరిన విహారి ఫౌండేషన్
మరోవైపు జరిగిన పొరపాటు తెలుసుకున్న హనుమ విహారి ఫౌండేషన్ ట్విట్టర్ వేదికగానే ఎన్టీఆర్ ట్రస్టుకు బహిరంగంగా క్షమాపణలు చెప్పింది.
వరద ప్రాంతాల్లో ట్రస్టు చేస్తోన్న సేవలపై వ్యాఖ్యలు చేసినందుకు క్షమించాల్సిందిగా కోరింది. ''అవగాహన లేమి కారణంగా మా తరఫు నుంచే పొరపాటు జరిగింది. జరిగిన పొరపాటుకు చింతిస్తున్నాం. మీ సేవా దృక్పథానికి హృదయపూర్వక అభినందనలు'' అని ఫౌండేషన్ ట్వీట్ చేసింది. ఎన్‌టీఆర్ ట్రస్టును ట్యాగ్ చేసింది.

ఫొటో సోర్స్, HANUMA VIHARI FOUNDATION
క్షమాపణలు చెప్పినప్పటికీ ట్రోలింగ్ జరగడం ఆగలేదు. దీంతో విహారి ఫౌండేషన్ కఠిన నిర్ణయం తీసుకుంది. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు దూరంగా ఉంటామని పేర్కొంటూ ట్వీట్ చేసి తన ఖాతాను డిలీట్ చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 7
''మాకు ఏ రాజకీయ పార్టీలతో సంబంధాలు కానీ, రాజకీయ ఉద్దేశాలు కానీ లేవు. ఒక సమాచార లోపంతో ఇదంతా జరిగింది. గత 24 గంటల్లో అతి తీవ్రమైన వ్యక్తిగత దూషణలు, కులవివక్షను ఎదుర్కొన్నాం'' అని ట్వీట్‌లో పేర్కొంది.

ఫొటో సోర్స్, HANUMA VIHARI FOUNDATION/TWITTER
'అడిగితే, సహాయం చేశాం' - బీబీసీతో ఎన్టీఆర్ ట్రస్టు ఉద్యోగి రవి కుమార్
ఎన్టీఆర్ ట్రస్టు, హనుమ విహారి ఫౌండేషన్ వేర్వేరుగా వరద సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నాయి.
కానీ హనుమ విహారి ఫౌండేషన్ వద్ద మ్యాన్ పవర్ కొరత ఉంది. దీంతో తమకు సహాయం చేయాలని విహారి ఫౌండేషన్ కోరడంతో వారికి కొంత సహాయపడ్డామని ఎన్టీఆర్ ట్రస్టు ఉద్యోగి రవి కుమార్ బీబీసీతో చెప్పారు.
ఎవరికి వారే వేర్వేరుగా సహాయ కార్యక్రమాలు చేశామని ఆయన వెల్లడించారు. కానీ మొదట వారు సేవ చేస్తోన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఇదంతా జరిగిందని చెప్పుకొచ్చారు.
మద్దతు
తాజా పరిణామంతో హనుమ విహారి ట్విట్టర్ నుంచి వైదొలగడం, ఫౌండేషన్ కూడా సేవా కార్యక్రమాలకు దూరం కానుండటం పట్ల ఆయన అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 8
కొందరు విహారికి మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 9
కోవిడ్ రెండో దశ సమయంలో విహారి ఫౌండేషన్ మెరుగ్గా సేవలందించిందని కొందరు ప్రశంసిస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 10
ఈ వ్యవహారంపై స్పందన కోసం బీబీసీ హనుమ విహారి, ఎన్టీఆర్ ట్రస్టులను సంప్రదించే ప్రయత్నం చేసింది. కానీ, వారి వైపు నుంచి స్పందన లభించలేదు.
ఇవి కూడా చదవండి:
- 'సంక్రాంతి ముగ్గుల పోటీలో గెలిస్తే రూ. 6 లక్షల బహుమతి' - ప్రెస్ రివ్యూ
- ఘాతక్ డ్రోన్ : పాకిస్తాన్, చైనాల నుంచి ఎదురయ్యే ముప్పును ఇది తప్పిస్తుందా
- ఒత్తిడి తట్టుకోవడానికి గంజాయిని ఆశ్రయిస్తున్న అమ్మలు, ఇది ఆరోగ్యానికి ప్రమాదం కాదా
- మంటల్లో చిక్కుకున్న బస్సు, 45 మంది మృతి
- వైఎస్ జగన్: ‘అమరావతి ప్రాంతం అంటే నాకు వ్యతిరేకత లేదు.. నా ఇల్లూ ఇక్కడే ఉంది’
- 44 ఏళ్ల వయసులో ఐఐఎంలో రెండు బంగారు పతకాలు సాధించిన విశాఖ గృహిణి
- చంద్రుడి నుంచి కొంత భాగం విరిగిపోయిందా? భూమికి సమీపంలో తిరుగుతున్న ఈ శకలం ఏమిటి
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ: లాజిస్టిక్స్ సూచీలో తెలుగు రాష్ట్రాల ర్యాంకులు ఎందుకు దిగజారాయి?
- సీఏఏ, ఎన్ఆర్సీ విషయంలో కూడా మోదీ ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా
- పేటీఎం షేర్ ధర మొదటిరోజునే ఎందుకు కుప్పకూలింది... ఈ ఐపీఓ నేర్పే పాఠాలేంటి?
- కడప జిల్లాలో వరదలు: ‘మా కళ్లెదుటే కొందరు కొట్టుకుపోయారు.. మా బంధువుల ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు’
- ‘ఆన్లైన్ చదువులకు లక్షల్లో ఫీజులు కట్టాం... ఏమీ అర్థం కాలేదని చెబితే ఏమంటారో’
- చైనాతో 1962లో జరిగిన యుద్ధంలో భారత్‌కు అమెరికా అండ లేకుంటే ఏమయ్యేది?
- వికాస్ దుబే ఎవరు? ఒక రైతు కొడుకు 'గ్యాంగ్‌స్టర్' ఎలా అయ్యాడు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)