ఆంధ్రప్రదేశ్: శాసనమండలి రద్దు తీర్మానం ఉపసంహరించుకున్న జగన్ ప్రభుత్వం - BBC Newsreel

శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

ఫొటో సోర్స్, I&PR AP

ఫొటో క్యాప్షన్, శాసనమండలి రద్దు నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.

ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు చేయాలంటూ 2020 జనవరిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఉపసంహరించుకుంటూ ఏపీ ప్రభుత్వం శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశ పెట్టింది.

ఈ మేరకు శాసన సభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టగా, సభ దానిని ఆమోదించింది. ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను, బిల్లులను అడ్డుకోవడంతోపాటు, అనవసర సందిగ్ధతకు తావిస్తుందోన్నకారణంతో మండలిని రద్దు చేయడానికి అప్పట్లో ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి బుగ్గన వెల్లడించారు.

అయితే, సమాజంలోని భిన్న వర్గాల నుంచి ప్రతినిధులను వస్తుండటం, ఎప్పటికప్పుడు కొత్త వ్యక్తులు ప్రాతినిధ్యం వహిస్తున్నందున, ఈ కౌన్సిల్ కొనసాగడం మంచిదన్న నిర్ణయానికి వచ్చామని మంత్రి తెలిపారు. కొత్తగా వస్తున్న సభ్యులు మున్ముందు శాసన సభ నిర్ణయాలకు మద్ధతుగా నిలుస్తారన్న నమ్మకంతో కౌన్సిల్ రద్దు తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటున్నామని మంత్రి బుగ్గన అన్నారు. తీర్మాన్నాన్ని ఆమోదించిన సభ రేపటికి వాయిదాపడింది.

గతంలో జగన్ ఏమన్నారు?

2020 జనవరి 23న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మండలి రద్దుకు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ బిల్లుపై జరిగిన ఓటింగ్‌ కు వైసీపీ ఎమ్మెల్యేలు 132 మంది, జనసేన ఎమ్మెల్యే ఒకరు అనుకూలంగా ఓటేశారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సభకు హాజరు కాలేదు. దీంతో ఈ బిల్లుకు వ్యతిరేకంగా కానీ, తటస్థంగా కానీ ఓట్లు పడలేదు.

రాజకీయ కోణంలో తాత్కాలికంగా బిల్లుల్ని అడ్డుకునేందుకే మండలి ఉందని, దీనివల్ల కాలయాపన, ప్రజాప్రయోజనాలకు విఘాతం, ఆలస్యం కలగడం తప్ప ఎటువంటి మంచీ జరిగే అవకాశం కనిపించడం లేదని అప్పట్లో బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

మండలి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.60 కోట్లు ఖర్చు చేస్తోందని, దీనికోసం ఒక్క రూపాయి ఖర్చు చేయడమైనా దండగేనని ముఖ్యమంత్రి సభలో వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ హయాంలో ఒక వ్యక్తి కోసం మండలిని రద్దు చేశారని ఆయన అన్నారు.

పురస్కారం అందుకుంటున్న సంతోష్ బాబు భార్య, తల్లి

ఫొటో సోర్స్, facebook/PresidentOfIndia

ఫొటో క్యాప్షన్, పురస్కారం అందుకుంటున్న సంతోష్ బాబు భార్య, తల్లి

కల్నల్ సంతోష్ బాబు: మహావీర్ చక్ర పురస్కారం అందుకున్న సంతోష్ బాబు కుటుంబీకులు

గల్వాన్ లోయలో గత ఏడాది చైనా సైన్యంతో ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన తెలంగాణవాసి కల్నల్ సంతోష్ బాబును భారత ప్రభుత్వం మహావీర్ చక్ర పురస్కారంతో గౌరవించింది.

మరణానంతరం ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రకటించారు.

మంగళవారం(23.11.2021) నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో సంతోష్ బాబు భార్య, తల్లి ఈ పురస్కారాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నుంచి స్వీకరించారు.

సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్

ఫొటో సోర్స్, @LOKSABHASPEAKER

సెంట్రల్ విస్టా: మార్పులపై పిటిషన్‌ కొట్టివేసిన సుప్రీంకోర్టు

కేంద్రం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ పరిధిలోకి వచ్చే ఒక ప్లాట్ లాండ్ యూజ్‌ మార్పులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టేసింది.

లాండ్ యూజ్‌లో మార్పులను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలైన అదే ప్లాట్‌లో, ప్రస్తుతం ఉపరాష్ట్రపతి కోసం నూతన అధికారిక నివాసాన్ని నిర్మిస్తున్నారు.

సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణంలో లాండ్ యూజ్ గురించి వ్యక్తమవుతున్న ఆందోళనపై ప్రభుత్వం తన వాదనను స్పష్టంగా వివరించిందని సుప్రీంకోర్టు జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం చెప్పింది. ఈ బెంచ్‌లో జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ సీటీ రవికుమార్ కూడా ఉన్నారు.

"ఈ కేసులో తదుపరి విచారణ చేయడానికి మాకు కారణం ఏదీ కనిపించడం లేదు. అందుకే ఈ పిటిషన్‌ను కొట్టివేసి, మొత్తం వివాదానికి ముగింపు పలుకుతున్నాం" అని బెంచ్ చెప్పింది.

సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌ను 2019 సెప్టెంబర్‌లో ప్రకటించారు. దీని కింద త్రికోణంలా ఉండే ఒక పార్లమెంట్ భవనం నిర్మించనున్నారు. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లయిన సందర్భంగా 2022 ఆగస్టు నాటికి దీనిని నిర్మించాల్సి ఉంది.

బస్సు ప్రమాదం

ఫొటో సోర్స్, Reuters

మంటల్లో చిక్కుకున్న బస్సు, 45 మంది మృతి

బల్గేరియాలో జరిగిన బస్సు ప్రమాదంలో 45 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

పశ్చిమ బల్గేరియాలోని బోస్నెక్ ప్రాంతంలో ఈ బస్సు మంటల్లో చిక్కుకోవడంతో ప్రమాదం జరిగినట్లు అక్కడి అధికారులు తెలిపారు.

మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారని.. ప్రమాదం నుంచి ఏడుగురిని కాపాడారని అక్కడి ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ప్రమాదానికి గురైన బస్సు టర్కీ నుంచి నార్త్ మాసిడోనియాకు వెళ్తున్నట్లు చెబుతున్నారు.

బస్సు నార్త్ మాసిడోనియాకు చెందిందిగా బల్గేరియా అధికారులు చెప్పారు.

ఈ ఘటనపై నార్త్ మాసిడోనియా ప్రధాని బల్గేరియా ప్రధానితో మాట్లాడారని బల్గేరియాకు చెందిన బీటీవీ తెలిపింది.

మ్యాప్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

మంటల్లో చిక్కుకున్న బస్సు, 46 మంది మృతి

బల్గేరియాలో జరిగిన బస్సు ప్రమాదంలో 46 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.