నరేంద్ర మోదీ: ‘ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా ఆశావాదమే కనిపిస్తోంది.. వంద కోట్ల డోసుల మైలురాయిని చేరుకోవడం భారత సామర్థ్యానికి నిదర్శనం’

modi

ఫొటో సోర్స్, NARENDRAMODI/TWITTER

కరోనా మహమ్మారికి పేద, గొప్ప తారతమ్యాలు లేవని, అదే తరహాలో ప్రజల పట్ల ఎలాంటి భేదాలు చూపకుండా దేశంలో కోవిడ్ టీకా కార్యక్రమాన్ని నిర్వహించామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.

శుక్రవారం ఉదయం జాతినుద్దేశించి ప్రసంగించిన ఆయన భారత్‌లో కోవిడ్ టీకా డోసులు 100 కోట్లకు చేరడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

''అక్టోబర్ 21న, భారత్ 100 కోట్ల డోసుల టీకా మైలురాయిని చేరుకుంది. ఈ విజయం వెనుక 130 కోట్ల మంది దేశ ప్రజల సంకల్ప బలం ఉంది. ఈరోజు భారత్ సాధించిన దాని పట్ల ప్రపంచదేశాలు అభినందిస్తున్నాయి. అభివృద్ధి సాధించిన పెద్ద పెద్ద దేశాలు చేయలేని పనిని భారత్ విజయవంతంగా సాధించింది. ఈ ఫలితంతో అనుకున్న లక్ష్యాన్ని చేరేవరకు 'నయా భారత్' విశ్రమించదనే సందేశాన్ని ప్రపంచ దేశాలకు చాటిచెప్పాం'' అని వ్యాఖ్యానించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ (అందరి తోడ్పాటుతో ప్రజలందరి అభివృద్ధి)' స్ఫూర్తి మంత్రమే తమ దృష్టిలో ప్రజాస్వామ్యమని పునరుద్ఘాటించారు.

కరోనా మహమ్మారి తొలి నాళ్లలో, వైరస్‌ నియంత్రణపై భారత సామర్థ్యాన్ని అందరూ శంకించారని అన్నారు.

'అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ప్రతి ఒక్కరికీ టీకా లభించడం సాధ్యమేనా అనే సందేహాలు వ్యక్తం చేశారు. కానీ వీఐపీ సంస్కృతిని పాటించకుండా దేశంలో టీకా కార్యక్రమం కొనసాగింది. ఎంత ధనవంతుడైనా, ఎంత శక్తిమంతమైన వారైనప్పటికీ, సాధారణ పౌరుల్లాగే వ్యాక్సీన్ అందించాలని మేం నిర్ణయించాం''

''అంతేకాకుండా భారత ప్రజలు టీకా తీసుకునేందుకు ముందుకు రావట్లేదని పుకార్లు వచ్చాయి. కానీ ఈరోజు 100 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ మైలురాయిని చేరుకొని వాటికి గట్టి సమాధానమిచ్చాం.

''కరోనా మహమ్మారి తర్వాత, ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ గాడిన పడింది. ఉద్యోగ, ఉపాధి రంగాల్లో దీనికి సంబంధించిన ఫలితాలు కనబడుతున్నాయి. దేశంలోని ప్రతీ రంగం ఆశావాహ దృక్పథంతో ముందుకు సాగుతోంది'' అని చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

భారత ఆర్థిక వ్యవస్థ పట్ల దేశీయ, విదేశీ నిపుణులు చాలా సానుకూలంగా ఉన్నారని ప్రధాని మోదీ చెప్పారు.

భారత్‌కు భారీగా పెట్టుబడులు రావడమే కాదు.. యువతకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడుతున్నాయని ఆయన అన్నారు.

'ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా ఆశావాదమే కనిపిస్తోంది. ఇదివరకు ఇది ఆ దేశంలో తయారైంది.. ఈ దేశంలో తయారైందని చెప్పుకునే వాళ్లు. ఇప్పుడు అందరూ మేడిన్ ఇండియా గురించే మాట్లాడుతున్నారు' అని మోదీ అన్నారు.

అయితే, కరోనా మహమ్మారి పూర్తిగా అంతం కాలేదన్న ఆయన పండగల సీజన్‌లలో ప్రజలంతా మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

బయటకు వెళ్లేటప్పుడు మనం చెప్పులు వేసుకునేందుకు ఎంతగా అలవాటుపడ్డామో, అదే తరహాలో మాస్క్‌లు ధరించడాన్ని కూడా అలవాటుగా మార్చుకోవాలని సూచించారు.

చివరిగా దేశ ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని తన ప్రసంగాన్ని ముగించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

అంతకుముందు, జాతినుద్దేశించి మోదీ ప్రసంగిస్తారని ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేయగానే పలువురు ట్విటర్ యూజర్లు దీనిపై స్పందించారు. తమ డిమాండ్లను ట్విటర్‌లో మోదీకి విన్నవించారు.

ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు, ఫలితాల విడుదలలో జాప్యంపై మోదీ దృష్టి సారించాలని కొందరు కోరారు. వివాదాస్పద వ్యవసాయ చట్టాల గురించి మాట్లాడాలని కొందరు ప్రతిపాదించారు.

ప్రధాని మోదీ, జాతినుద్దేశించి ప్రసంగించడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కొందరు దీనికి బదులుగా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మోదీ మాట్లాడాలని కోరారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)