నరేంద్ర మోదీ: మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నాం

ఫొటో సోర్స్, Twitter/narendramodi
కొద్ది నెలలుగా కేంద్రం ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య వివాదంగా మారిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.
శుక్రవారం ఉదయం 9 గంటలకు జాతినుద్దేశించి మాట్లాడిన ప్రధాని మోదీ ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు.
రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. వ్యవసాయ బడ్జెట్ 5 రెట్లు పెంచింది తమ ప్రభుత్వమేనని ఆయన అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
క్షమాపణ చెప్పిన ప్రధాని
2014లో తన ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని.. వారి అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చిందని చెప్పారు.
రైతుల కష్టాలు తనకు తెలుసు కాబట్టి వ్యవసాయ రంగంలో సంస్కరణలకు ప్రాధాన్యమిచ్చానని చెప్పారు.
వ్యవసాయ బడ్జెట్‌ను అయిదు రెట్లు పెంచామని.. ఏటా రూ. 1.25 లక్షల కోట్లకు పైగా వ్యవసాయానికి వెచ్చిస్తున్నాం, రైతులకు తక్కువ ధరకే విత్తనాలు అందించేలా చర్యలు తీసుకున్నామని మోదీ చెప్పారు.
వచ్చే శీతాకాల సమావేశాల్లో ఈ చట్టాల రద్దుపై ప్రకటన చేస్తామని మోదీ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన దేశంలోని రైతులందరికీ క్షమాపణ చెప్పారు.
‘ప్రభుత్వం ఈరోజే వ్యవసాయానికి సంబధించిన మరో కీలక నిర్ణయం తీసుకుంది. అదే జీరో బడ్జెట్ వ్యవసాయం, అంటే సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి, క్రాప్ పాటర్న్‌ను శాస్త్రీయ పద్ధతుల్లో మార్చడానికి, ఎంఎస్‌పీని మరింత ప్రభావంగా, పారదర్శకంగా మార్చడానికి, ఇలాంటి అన్ని విషయాలపై భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిదులు, రైతులు ఉంటారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ ఆర్థికవేత్తలు ఉంటారు’ అని చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
మోదీ తాజా నిర్ణయంపై పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ హర్షం వ్యక్తంచేశారు.
గురు నానక్ జయంతి రోజున మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఇక ముందు కూడా రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుందన్న విశ్వాసం తనకు ఉందని అమరీందర్ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
కాంగ్రెస్ ఏమందంటే..
మోదీ తాజా నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ తన సత్వర స్పందనను ట్విటర్ ద్వారా వెల్లడించింది.
‘‘అహంకారం ముక్కలైపోయింది.. నా దేశ రైతు గెలిచాడు’’ అంటూ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
''దేశంలోని రైతుల సత్యాగ్రహానికి అహంకారం తలవంచాల్సి వచ్చింది. అన్యాయంపై రైతులు సాధించిన విజయానికి అభినందనలు'' అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
మోదీ నిర్ణయంపై రైతు నాయకుడు రాకేశ్ టికాయత్ స్పందిస్తూ... తమ ఆందోళనలు విరమించబోమని.. పార్లమెంటులో దీని రద్దు ప్రక్రియ పూర్తయ్యేవరకు ఆందోళన తప్పదన్నారు.
‘‘మేం ఇప్పుడే ఆందోళన విరమించం, పార్లమెంట్‌లో వ్యవసాయ చట్టాలను రద్దు చేసే రోజు కోసం వేచి చూస్తాం. ఎంఎస్‌పీతో పాటు రైతుల ఇతర సమస్యలపైనా ప్రభుత్వం చర్చించాలి’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
తమ ఘనతగా చెప్పుకొంటున్న టీఆర్ఎస్
వ్యవసాయ చట్టాలను కేంద్రం ఉపసంహరించుకోవడాన్ని తెలంగాణలోని పాలక పార్టీ టీఆర్ఎస్ తమ ఘనతగా చెప్పుకొంటోంది.
వరి కొనుగోలు వివాదంలో కేంద్రానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ ధర్నా తరువాతే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ నేతలు కొందరు చెబుతున్నారు.
అధికారంలో ఉన్నవారి శక్తి కంటే ప్రజల శక్తిదే పైచేయి అని మరోసారి నిరూపితమైందని టీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ అన్నారు.
ఇది రైతుల విజయమని ఆయన అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 7
‘‘నిన్న కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన రైతు దీక్షతో కేంద్రం మూడు నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది’’ అంటూ టీఆర్ఎస్ నేత, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- అమెరికాను అధిగమించి అత్యంత సంపన్న దేశంగా అవతరించిన చైనా -మెకెన్సీ రిపోర్ట్
- దుస్తులు తొలగించకుండా తాకినా లైంగికంగా వేధించినట్లే: సుప్రీంకోర్టు
- ఎవరు మీలో కోటీశ్వరులు: రూ. కోటి గెల్చుకున్న రాజా రవీంద్ర బీబీసీ అడిగిన 5 ప్రశ్నలకు ఏమని బదులిచ్చారు?
- తైవాన్ ‘పాల సముద్రం’: సుందర ద్వీపం కింద విషం చిమ్మే సాగర రహస్యం
- ‘పోలీస్ కావాలనుకున్న నా కొడుకును దొంగను చేశారు’
- కేసీఆర్ ధర్నా చౌక్ బాట ఎందుకు పట్టాల్సి వచ్చింది?
- జర్నలిస్ట్ హత్య: ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్‌ల అక్రమాలను బయటపెట్టినందుకు చంపేశారా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.