ప్రశాంత్ కిశోర్: ''నరేంద్ర మోదీ లేకున్నా బీజేపీ దశాబ్దాలపాటు కేంద్ర బిందువుగా ఉంటుంది. రాహుల్ గాంధీకి ఇది అర్ధం కావడం లేదు'' అని ఈ వ్యూహకర్త ఎందుకన్నారు?

ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్‌లో చేరతారని ఊహాగానాలు సాగాయి.

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్‌లో చేరతారని ఊహాగానాలు సాగాయి.

బీజేపీ అస్థిత్వం, కాంగ్రెస్ పని తీరు మీద ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. గోవాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రశాంత్ కిశోర్, అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ఇంకా చాలాకాలం ఎదురు చూడాల్సి ఉందన్నారు.

''రాబోయే కొన్ని దశాబ్దాల పాటు భారత రాజకీయాల్లో బీజేపీనే కేంద్ర బిందువుగా ఉండబోతోంది. రాహుల్ గాంధీ దీనిని అర్థం చేసుకోలేకపోతున్నారు'' అని ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి.

''వాళ్లు గెలిచినా, ఓడినా భారత రాజకీయాలలో బీజేపీ కీలకంగా ఉండటం మాత్రం ఖాయం. జాతీయ స్థాయిలో 30 శాతం ఓట్లను సాధించిన పార్టీ అంత సులభంగా వెళ్లిపోదు'' అని వ్యాఖ్యానించారు.

''ప్రజలు మోదీపై కోపంగా ఉన్నారని, ఈసారి బీజేపీని ఓడిస్తారన్న భ్రమలు పెట్టుకోవద్దు. మోదీ వెళ్లిపోవచ్చు. కానీ, బీజేపీ ఎక్కడికీ వెళ్లదు. కాంగ్రెస్ పార్టీలాగానే ఓడినా కొన్ని దశాబ్దాలపాటు బీజేపీ అస్తిత్వం కొనసాగుతుంది'' అన్నారాయన.

''బీజేపీని ప్రజలు తరిమేసే సమయం వచ్చిందని రాహుల్ అనుకుంటున్నారు. ఇది భ్రమ. అది జరగదు'' అని ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేశారు.

మోదీని అర్థం చేసుకుంటే తప్ప ఆయన బలాన్ని అర్థం చేసుకోలేరని, ఆయన్ను ఓడించేందుకు వ్యూహం రచించలేరని ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించారు.

''నాకు తెలిసిందేంటంటే ఆయన బలాన్ని ఎవరూ అర్థం చేసుకోలేకపోతున్నారు. అది తెలియనంత వరకు ఆయన్ను ఓడించలేరు'' అన్నారాయన.

బీజేపీ దిల్లీ అధికార ప్రతినిధి అజయ్ శెరావత్ ఈ వీడియోను ట్వీట్ చేస్తూ '' కొన్ని దశాబ్దాల పాటు భారత రాజకీయాల్లో బీజేపీ కీలకంగా ఉంటుందని ప్రశాంత్ కిశోర్ అంగీకరించారు. అమిత్ షా ఈ విషయాన్ని ఇంతకు ముందే చెప్పారు'' అని రాశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

'కాంగ్రెస్ పుంజుకుంటుందన్న ఆశ ఉండేది కానీ...'

2018లో సీనియర్ జర్నలిస్ట్ బర్ఖాదత్‌తో మాట్టాడిన ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీపై వ్యాఖ్యలు చేశారు.

‘‘సంప్రదాయ పద్ధతుల్లో కాంగ్రెస్‌ను పునరుజ్జీవింపజేయాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ దానికి చాలా ప్రయత్నం చేయాల్సి ఉంది. 2013 తర్వాత బిహార్, పంజాబ్ మినహా కాంగ్రెస్ పెద్దగా విజయాలు సాధించ లేదు. ఈ రెండు చోట్ల కూడా కూటమిగానే గెలిచింది. ఈ గణాంకాలను పరిశీలిస్తే 1985 నుంచి పార్టీగా కాంగ్రెస్ పరిస్థితి దిగజారుతూనే ఉంది. 2014 నుంచి పరిస్థితి మరింత దిగజారుతోందని ప్రజలు భావిస్తున్నారు'' అన్నారాయన.

2018నాటి ఈ వీడియోలో కొంత భాగం ఇటీవల యూట్యూబ్‌లో మళ్లీ పోస్ట్ అయ్యింది.

‘‘కాంగ్రెస్ పునరుజ్జీవం అంటే మోదీని ఓడించడమేని వారు భావిస్తున్నారు. మీరు ఆయన్ను ఓడించగలరా లేదా అనే దానితో సంబంధం లేకుండా, అట్టడుగు స్థాయిలో పని చేస్తే తప్ప పూర్వవైభవం సాధ్యం కాదని నేను అనుకుంటున్నాను’’ అన్నారు ప్రశాంత్ కిశోర్

అధికారం కోసం రాహుల్ గాంధీ, ఆయన పార్టీ మరికొంత కాలం వేచి చూడాలని ప్రశాంత్ కిశోర్ అన్నారు.

ఫొటో సోర్స్, THE INDIA TODAY GROUP

ఫొటో క్యాప్షన్, అధికారం కోసం రాహుల్ గాంధీ, ఆయన పార్టీ మరికొంత కాలం వేచి చూడాలని ప్రశాంత్ కిశోర్ అన్నారు

కాంగ్రెస్‌ లోకి వెళుతున్నారా లేదా?

ప్రశాంత్ కిశోర్‌ కాంగ్రెస్‌లో కీలక పాత్ర పోషిస్తారని ఇటీవల ఊహాగానాలు వచ్చాయి. కొన్నివారాల కిందట రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో ఆయన చర్చలు జరిపారు.

అయితే లఖీంపూర్-ఖేరీ ఘటన తర్వాత ప్రశాంత్ కిశోర్ చేసిన ప్రకటన కాంగ్రెస్‌తో ఆయన సంబంధాలపై అనుమానాలు రేకెత్తించింది.

కాంగ్రెస్‌ పార్టీకి పునర్వైభవం గురించి అక్టోబర్‌లో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న సమయంలో ప్రశాంత్ కిశోర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు.

''లఖీంపూర్-ఖేరీ ఘటన తర్వాత గ్రాండ్ ఓల్డ్ పార్టీ (కాంగ్రెస్) తిరిగి పుంజుకుంటుందని భావించే వారికి నిరాశ తప్పదు. ఆ పార్టీలో లోతుగా పాతుకు పోయిన సమస్యలకు అంత సులభంగా పరిష్కారం దొరకదు'' అని ఆయన వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా దీనిపై స్పందిస్తూ ''లఖింపూర్-ఖేరీ ఘటనను రాజకీయ గెలుపోటముల్లో భాగం చేయడం పాపం'' అన్నారు.

ఈ సంఘటనల తర్వాత కాంగ్రెస్‌తో ప్రశాంత్ కిశోర్ సంబంధాలలో తేడాలు కనిపించాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

గోవా పై తృణమూల్ కన్ను

తృణమూల్ కాంగ్రెస్ గోవాలో అడుగు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం ప్రశాంత్ కిశోర్ ఏర్పాట్లు చేస్తున్నారు. మమతా బెనర్జీ మూడు రోజుల పర్యటన కోసం గోవా రానున్నారు.

ఇటీవల ముగిసిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కోసం ప్రశాంత్ వ్యూహాలు రచించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

ఈ సంవత్సరం మే 2న ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రశాంత్ కిశోర్, తాను రాజకీయ సలహాదారు పాత్ర నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయన త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నారని ఊహాగానాలు సాగాయి.

అయితే, 2026 అసెంబ్లీ ఎన్నికల వరకు ప్రశాంత్ కిశోర్ కన్సల్టెన్సీ సేవలకు తృణమూల్ కాంగ్రెస్ ఒప్పందం చేసుకుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)