‘మీరు మా దేశంలో చాలా పాపులర్.. మా పార్టీలో చేరండి’ - నరేంద్ర మోదీతో ఇజ్రాయెల్ ప్రధాని నెఫ్టాలీ బెనెట్ - BBC Newsreel

ఇజ్రాయెల్ ప్రధాని నెఫ్టాలీ బెనెట్, ప్రధాని నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, gov.il

ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్ ప్రధాని నెఫ్టాలీ బెనెట్, ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం బ్రిటన్‌లోని గ్లాస్కోలో కొనసాగుతున్న COP26 సదస్సులో ఇజ్రాయెల్ ప్రధాని నెఫ్టాలీ బెనెట్‌తో సమావేశం అయ్యారు.

ఈ సమావేశం సందర్భంగా ఇద్దరు నేతలు చాలా ఆప్యాయంగా ముచ్చటించుకున్నారు.

బెనెట్ కార్యాలయం ఆయన తరఫున ఈ సమావేశానికి సంబంధించి ఒక ట్వీట్ చేసింది.

"COP26 సదస్సు సమయంలో నరేంద్ర మోదీతో సమావేశం అద్భుతంగా జరిగింది. నరేంద్ర, మన దేశాల మధ్య బంధాలకు ఒక రూపం ఇవ్వడంలో మీరు చారిత్రక పాత్ర పోషించినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అన్నారు.

మన ఇద్దరం కలిసి భారత్, ఇజ్రాయెల్ బంధాలను మరింత కొత్త ఎత్తులకు తీసుకెళ్లవచ్చు. మీ దేశానికి ఉజ్వల భవిష్యత్తు కనిపిస్తోందని అని కూడా బెనెట్ అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

అదే వీడియోలో ఇద్దరు నేతలు సరదాగా మాట్లాడుకోవడం కూడా కనిపిస్తుంది.

మొదట ప్రధాని మోడీని కలవగానే బెనెట్ "ఈరోజు మీకు ధంతేరస్ కదా?" అని అడుగుతారు. దానికి మోదీ "ఓ అయితే. అది మీకు తెలుసా" అంటారు.

ఆ తర్వాత "అవును. మీరు మా దేశంలో కూడా చాలా పాపులర్.. మా పార్టీలో ఎందుకు చేరరు?" అంటారు బెనెట్.. దాంతో మోడీ పెద్దగా నవ్వేస్తారు.

ఆ తర్వాత ఇద్దరూ భారత, ఇజ్రాయెల్ సంబంధాలపై చర్చించారు.

యాహూ సేవల నిలిపివేత

ఫొటో సోర్స్, Getty Images

చైనాలో తమ వ్యాపారానికి తెర దించుతున్నట్లు ప్రకటించిన యాహూ

ఇంటర్నెట్ ప్రపంచంలోని ఎప్పటి నుంచో ఉన్న ప్రముఖ కంపెనీల్లో ఒకటైన యాహూ చైనాలో తమ వ్యాపారానికి తెరదించుతున్నట్లు ప్రకటించింది.

చైనాలో నవంబర్ 1 నుంచి యాహూ సేవలు వినియోగించుకోలేరని ఆ కంపెనీ ప్రకటించింది.

యాహూ తమ వినియోగదారులు, ఉచిత, ఓపెన్ ఇంటర్నెట్‌కు అంకితమైంది. వినియోగదారులు మాకు సహకరించినందుకు మేం వారికి ధన్యవాదాలు చెబుతున్నాం.

గత కొన్ని వారాలుగా యాహూ లాంటి మిగతా అమెరికా టెక్ కంపెనీలు కూడా చైనాలో తమ కార్యకలాపాలు తగ్గించాయి.

తాము చైనాలో తమ సైట్ నిర్వహణ ఆపేసి దానికి ఒక జాబ్ బోర్డ్ రూపం ఇస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ సైట్ లింక్డిన్ ఇంతకు ముందు ప్రకటించింది.

యాహూ ఇంతకు ముందు కూడా చైనాలో తమ కార్యకలాపాలు తగ్గించింది. 2015లో యాహూ తమ బీజింగ్ కార్యాలయం మూసేసింది.

యాహూ వెబ్ పోర్టల్ లాంటి కొన్ని సేవలను చైనాలో నిషేధించడంతో యాహూ ప్రస్తుతం చైనా బయటకు వెళ్లక తప్పని పరిస్థితుల్లో పడింది.

వంట నూనెలు

ఫొటో సోర్స్, Getty Images

వంట నూనెల టోకు ధరల్లో లీటరుకు రూ.4 నుంచి 7 తగ్గింపు

పండగ సీజన్లో వినియోగదారులకు ఉపశమనం అందించడానికి వంట నూనెల టోకు ధరల్లో లీటరుకు రూ.4 నుంచి రూ.7 రూపాయలు తగ్గిస్తున్నట్లు అదానీ విల్మర్, రుచి సోయా ఇండస్ట్రీస్ లాంటి ప్రముఖ వంట నూనెల కంపెనీలు ప్రకటించాయి.

సాల్వెంట్ ఎక్‌స్ట్రాక్టర్ అసోసియేషన్(ఎస్ఈఏ) ఆఫ్ ఇండియా మంగళవారం దీనిని ప్రకటించింది. మిగతా కంపెనీలు కూడా ఇలాంటి చర్యలు తీసుకోవచ్చని అసోసియేషన్ చెప్పింది.

జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫాట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్(హైదరాబాద్), మోదీనాచురల్స్(దిల్లీ), గోకుల్ రిఫయిల్స్ అండ్ సాల్వెంట్ లిమిటెండ్(సిద్ధాపూర్), విజయ్ సాల్వెక్స్ లిమిటెడ్(అల్వర్), గోకుల్ అగ్రో రిసోర్సెస్ లిమిటెడ్ అండ్ ఎన్కే ప్రొటీన్స్ ప్రైవేట్ లిమిటెడ్(అహ్మదాబాద్) కూడా రిటైల్ ధరలు తగ్గించాయని అసోసియేషన్ ప్రకటించింది.

ఎస్ఈఏ అపీల్ చేయడంతో ఈ కంపెనీలు రిటైల్ ధరలు తగ్గించాయి.

"పరిశ్రమ నుంచి వస్తున్న ఈ స్పందన చాలా ప్రోత్సాహకరంగా ఉంది" అని ఎస్ఈఏ అధ్యక్షులు అతుల్ చతుర్వేది అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)