మెటా: ఫేస్‌బుక్ కొత్త పేరుపై ఇజ్రాయెల్‌లో ఎందుకు జోకులు పేలుతున్నాయి?

ఫొటో సోర్స్, Getty Images
ఫేస్‌బుక్ కొత్త పేరుపై ఇజ్రాయెల్‌లో జోకులు పేలుతున్నాయి. ఫేస్‌బుక్ తన మాతృసంస్థ పేరును ఇటీవల ‘‘మెటా’’గా మార్చిన సంగతి తెలిసిందే.
హీబ్రూలో మరణం అనే పదం ఉచ్చారణ ‘‘మెటా’’ను పలికినట్లే ఉంటుంది. మహిళలను ఉద్దేశించి ఈ పదాన్ని వాడతారు.
దీంతో చాలామంది ఇజ్రాయెల్ వాసులు ట్విటర్‌లో తమదైన రీతిలో జోకులు పేలుస్తున్నారు. కొందరైతే తమ ట్వీట్లకు ఫేస్‌బుక్‌డెడ్ అనే హ్యాష్‌ట్యాగ్ కూడా జతచేస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
‘‘హీబ్రూ మాట్లాడేవారికి నవ్వుకునేందుకు మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు’’అంటూ ఓ ట్విటర్ యూజర్ ట్వీట్‌చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
పేరు ఎందుకు మార్చారు?
కేవలం మాతృసంస్థ పేరు మాత్రమే మారుస్తున్నట్లు ఫేస్‌బుక్ ప్రకటించింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ లాంటి యాప్‌ల పేర్లలో ఎలాంటి మార్పూ ఉండదని సంస్థ స్పష్టంచేసింది.
అంటే మెటా అనేది మాతృసంస్థ. ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ దానిలో భాగంగా ఉంటాయి. వర్చువల్ రియాలిటీ రంగంలోనూ తమ పరిధిని విస్తరిస్తామని పేరు మార్పు సమయంలో ఫేస్‌బుక్ తెలిపింది.
ఫేస్‌బుక్‌కు చెందిన ఓ మాజీ ఉద్యోగి కొన్ని కీలక పత్రాలను లీక్‌చేయడంతో సంస్థపై చాలా నెగిటివ్ వార్తలు వచ్చాయి.
దేశాల భద్రతను ప్రమాదంలోకి నెట్టి సంస్థ లాభాలను మూటకట్టుకుంటోందని సంస్థ మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్ హోగన్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్ పేరు మార్పు ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది.
తమ కొత్త ‘‘మెటావర్స్ ప్లాన్’’లో భాగంగా మాతృసంస్థ పేరును మారుస్తున్నట్లు సంస్థ అధిపతి జుకర్‌బర్గ్ ప్రకటించారు. మెటావర్స్ అనేది వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్‌లతో గేమ్స్ ఆడటం, పని చేసుకోవడం, ఒకరితో మరొకరు కమ్యునికేట్ చేసుకునే ఆన్‌లైన్ ప్రపంచం.

ఫొటో సోర్స్, Getty Images
‘‘ప్రస్తుతం ఉన్న బ్రాండ్ మనం చేస్తున్న ప్రతి పనికి భవిష్యత్తులో ప్రాతినిధ్యం వహించలేదు. అందుకే పేరు మార్చాల్సిన అవసరం ఉంటుంది’’అని ఆయన అన్నారు.
"కాలక్రమేణా, మమ్మల్ని ఒక మెటావర్స్ కంపెనీగా చూస్తారని నేను ఆశిస్తున్నాను. మేం ఇప్పుడు మా వ్యాపారాన్ని రెండు వేర్వేరు విభాగాలుగా చూస్తున్నాం. ఒకటి ప్రస్తుత మా సొంత యాప్‌ల కోసం, మరొకటి భవిష్యత్ ప్లాట్‌ఫాంలలో చేయబోయే మా పని కోసం. దీనిలో భాగంగానే, మనం చేసే ప్రతి పనిని సూచించేలా కంపెనీ కొత్త బ్రాండ్ పేరు మార్చడానికి ఇది సరైన సమయం" అని జుకర్ బర్గ్ ఓ వర్చువల్ కాన్ఫరెన్స్‌లో చెప్పారు.
అయితే, ఇలా పేరు మార్చేటప్పుడు ఫేస్‌బుక్ కాస్త పరిశోధన చేసి ఉండాల్సిందని ఓ ఇజ్రాయెల్ ట్విటర్ యూజర్ వ్యాఖ్యానించారు.
2015లో గూగుల్ కూడా ఇలానే కొత్త పేరును తెరపైకి తీసుకొచ్చింది.
తమ మాతృసంస్థ పేరును ‘‘ఆల్ఫాబెట్’’గా మారుస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. అయితే, ఈ పేరు పెద్దగా ఎక్కడా కనిపించడం లేదు.

ఫొటో సోర్స్, REUTERS/CARLOS BARRIA
ఇదేమీ తొలిసారి కాదు..
బ్రాండ్ పదాలను అనువదించినప్పుడు ఇలా జోకుల పాలవడం ఒక్క ఫేస్‌బుక్‌కే పరిమితం కాదు.
ఇదివరకు కొన్ని బ్రాండ్లు ఇలానే తమ బ్రాండ్లకు కొత్త పేర్లు పెట్టి నవ్వులపాలయ్యాయి.
కేఎఫ్‌సీ 1980ల్లో చైనాలో అడుగుపెట్టింది. అప్పుడు వారి నినాదం ‘‘ఫింగర్ లికింగ్ గుడ్’’. అయితే, దీన్ని మాండరిన్‌లో ‘‘ఈట్ యువర్ ఫింగర్స్ ఆఫ్’’ అని ట్రాన్స్‌లేట్ చేశారు. దీంతో చైనాలో జోకులు పేలాయి.
అయితే, కేఎఫ్‌సీ బిజినెస్‌పై ఇవి ఎలాంటి ప్రభావాన్ని చూపలేదు. చైనాలో అతిపెద్ద ఫుడ్ చైన్లలో కేఎఫ్‌సీ కూడా ఒకటి.
రోల్స్-రాయిస్ సంస్థ తమ కొత్త కారు సిల్వర్ షాడోకు మొదట్లో సిల్వర్ మిస్ట్ అని పేరు పెట్టింది. అయితే, మిస్ట్ అంటే జర్మన్‌లో మలం లేదా విసర్జితం అనే అర్థాలు ఉన్నాయి. దీంతో ఈ పేరును మార్చాల్సి వచ్చింది.
2011లో నోకియా కొత్తగా లూమియా ఫోన్లను ఆవిష్కరించినప్పుడు కూడా ఇలాంటి పరిణామాలే చోటుచేసుకున్నాయి. స్పానిష్‌లో లూమియా అంటే వేశ్య అని అర్థం.
హోండా ఇలాంటి పరిస్థితుల నుంచి తృటిలో తప్పించుకుంది. తమ కొత్త కారుకు సంస్థ ఫిట్టా అనే పేరును దాదాపుగా ఖరారుచేసింది. అయితే, స్వీడన్‌లో స్త్రీ జననేంద్రియం పేరును ఇలానే ఉచ్చరిస్తారు. అయితే, ఈ విషయాన్ని ముందుగానే హోండా గ్రహించింది. దీంతో జాజ్‌గా పేరును మార్చింది.
ఇవి కూడా చదవండి:
- COP26: గ్లాస్గోలో జరిగే పర్యావరణ సదస్సులో ప్రధాని మోదీ ఏం చెప్పబోతున్నారు?
- బంగ్లాదేశ సరిహద్దుల్లో ఉన్న త్రిపుర రాష్ట్రంలో ముస్లింలపై దాడులు.. కారణమేంటి
- COP26: వాతావరణ లక్ష్యాలకు భారత్ ఎంత దూరంలో ఉంది
- సెక్స్ ట్రేడ్ కోసం యూరప్‌కు మహిళల అక్రమ రవాణా... తప్పించుకున్న ఓ బాధితురాలి కథ
- ‘ఎన్ని పంటలు వేసినా రాని డబ్బులు గంజాయి సాగుతో వస్తున్నాయి.. మరో దారి లేకే గంజాయి పండిస్తున్నాం..’
- 'మృతదేహాల అవశేషాలపై ఇళ్లు కట్టుకుని నివసించడం మాకు అలవాటైపోయింది'
- సెక్సువల్ అటానమీ: భార్య శరీరంపై భర్తకు సర్వ హక్కులు ఉంటాయా? సెక్స్ భంగిమల కోసం బలవంతం చేయవచ్చా?
- ఉత్తర కొరియాలో డ్రగ్స్, తీవ్రవాదం, ఆయుధ విక్రయాల గుట్టు విప్పిన ఒక సీక్రెట్ ఏజెంట్
- కోవిడ్-19: మా అమ్మను డాక్టర్లు గినియా పిగ్లా భావించి ప్రయోగాలు చేశారు
- నీళ్లపైనే నగరాలు.. భవిష్యత్తు ఇదేనా? యూరప్ దేశాల్లో ఈ ప్రయోగాలు ఎందుకు జరుగుతున్నాయి?
- కశ్మీర్లో భయాందోళనల్లో హిందువులు.. శాంతి, భద్రతలపై ప్రభుత్వానివి ఉత్తి మాటలేనా?
- లిపులేఖ్ రోడ్డు విషయంలో భారత్ తీరుపై నేపాల్‌లో ఆగ్రహం ఎందుకు
- కాలాపానీ: నేపాల్ సరిహద్దులోని 35 చ.కి.మీ భూమి సమస్యను వాజ్‌పేయి నుంచి మోదీ వరకు ఎవ్వరూ ఎందుకు పరిష్కరించలేదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








