'ఇప్పుడే నీ చేతుల్లో చచ్చిపోయా'.. ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ విడాకులపై రూమర్లకు ఈ కామెంట్ సమాధానమా?

ప్రియాంక చోప్రా, నిక్ జోనస్

ఫొటో సోర్స్, instagram/nickjonas

ప్రియాంక చోప్రా, తన రాబోయే సినిమా 'మ్యాట్రిక్స్'కు సంబంధించిన పోస్టర్‌ను మంగళవారం సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. కానీ తన రాబోయే చిత్రం కంటే కూడా ఆమె పేరే ఇప్పుడు తాజాగా చర్చల్లో నిలుస్తోంది.

ప్రియాంక చోప్రా ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో తన పేరు నుంచి భర్త నిక్ జోనస్ ఇంటిపేరును తొలిగించారు. అప్పటినుంచి ఇక వారి వివాహ బంధంపై అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి.

భర్త ఇంటి పేరును తొలిగించడం వెనుక ప్రియాంక చోప్రా ఆంతర్యమేంటి అనే అంశంపై సోషల్ మీడియాతో పాటు ప్రధాన మీడియాలో కూడా చర్చలు మొదలయ్యాయి.

సమంత సైతం విడాకులకు కొన్ని రోజుల ముందే తన సోషల్ మీడియా అకౌంట్ల నుంచి అక్కినేని ఇంటిపేరును తొలగించడం కూడా ఈ సందర్భంగా చర్చకు వస్తోంది. ప్రియాంక చోప్రా కూడా సమంతలాగే ఇంటిపేరు తొలగించారని కొందరు కామెంట్ చేస్తున్నారు.

ప్రియాంక చోప్రా

ఫొటో సోర్స్, TWITTER

ప్రియాంక, నిక్ జోనస్‌ల వివాహ బంధంపైనే ప్రధానంగా ఈ చర్చలు జరుగుతున్నాయి.

తన పేరు నుంచి భర్త ఇంటిపేరును తొలిగించడంపై ప్రియాంక చోప్రా ఇప్పటివరకు ఎలాంటి సమాచారంగానీ, స్పష్టతగానీ ఇవ్వలేదు. ఈ అంశానికి సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. ఆమె టీమ్ నుంచి కూడా ఎలాంటి ప్రకటన రాలేదు.

ప్రియాంక చోప్రా

ఫొటో సోర్స్, INSTAGRAM/PRIYANKA

కానీ ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా మాత్రం ఈ పుకార్లను కొట్టిపారేశారు. అవన్నీ పిచ్చి వార్తలని ఖండించారు.

''ఇవన్నీ అర్థం లేని వార్తలు. దయచేసి పుకార్లను వ్యాప్తి చేయొద్దు'' అని నెట్‌వర్క్ 18కి ఇచ్చిన ప్రకటనలో మధు చోప్రా పేర్కొన్నారు.

ప్రియాంక చోప్రా, నిక్ జోనస్

ఫొటో సోర్స్, Getty Images

తనపై వస్తోన్న ఈ ఊహాగానాలపై ప్రియాంక ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ 11 గంటల క్రితం, తన భర్త నిక్ జోనస్ పెట్టిన ఓ పోస్టుకు స్పందించిన ఆమె ఎన్నో అంశాలపై స్పష్టతనిచ్చారని కొందరు అంటున్నారు.

పోస్ట్‌ Instagram స్కిప్ చేయండి
Instagram ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of Instagram ముగిసింది

జిమ్‌లో వర్కవుట్స్ చేస్తూ నిక్ జోనస్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పంచుకున్నాడు. ఆ పోస్టుకు స్పందించిన ప్రియాంక చోప్రా... 'డామ్, ఇప్పుడే నీ చేతుల్లో చచ్చిపోయా' అని కామెంట్ చేశారు.

ప్రియాంక చోప్రా

ప్రియాంక చోప్రా కామెంట్‌పై పలువురు హర్షం వ్యక్తం చేశారు.

ప్రియాంక గురించి సోషల్ మీడియాలో ఏం రాశారు?

తన సామాజిక మాధ్యమాల ఖాతాల నుంచి జోనస్ ఇంటిపేరును తొలిగించి, కేవలం ప్రియాంక చోప్రా అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఆమె ట్వీట్ చేయడం పట్ల సియా అనే ట్విట్టర్ ఖాతాదారు స్పందించారు. ''రాబోయే రోజుల్లో మరింత డ్రామా చూడబోతున్నాం'' అని సియా రాసుకొచ్చారు.

సియా

ఫొటో సోర్స్, TWITTER

మరో యూజర్, దీన్ని పబ్లిసిటీ స్టంట్‌గా అభివర్ణించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

''ప్రియాంక, తన కొత్త సినిమా పోస్టర్‌ను ప్రమోట్ చేయాలనుకుంటున్నారు. అందుకే తన ఇన్‌స్టా బయో నుంచి జోనస్ పేరును తొలిగించారు. ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్'' అని సర్ఫరాజ్ అనే యూజర్ వ్యాఖ్యానించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

''కుటుంబంలో కలహాలు జరిగితే, సాధారణ వ్యక్తులు తమ ఇంటిపేరును తొలిగిస్తుంటారు. మీరు ప్రశాంతంగా ఉండండి'' అని మరో యూజర్ రాసుకొచ్చారు.

నిక్ జోనస్ ఎవరు?

నికోలస్ జెర్రీ జోనస్ అమెరికా నటుడు, గాయకుడు, ప్రొడ్యూసర్ కూడా. ఏడేళ్ల వయస్సు నుంచే నిక్ నటించడం ప్రారంభించారు.

అమెరికాలోని డల్లాస్‌లో పాల్ కెవిన్ జోనస్ సీనియర్, డినైస్ మిల్లర్ దంపతులకు నిక్ జన్మించారు. తన సోదరులు జో జోనస్, కెవిన్ జోనస్‌లతో కలిసి నిక్ 'ద జోనస్ బ్రదర్స్' అనే బ్యాండ్‌ను ఏర్పాటు చేశారు.

2006లో 13 ఏళ్ల వయస్సులో నిక్, తొలి ఆల్బమ్ 'ఇట్స్ ఎబౌట్ టైమ్' విడుదలైంది. దీంతో డిస్నీ చానెల్‌లో వారి బ్యాండ్‌కు మంచి గుర్తింపు లభించింది.

2014లో వారి బ్యాండ్ విచ్ఛిన్నమైంది. దీని తర్వాత నిక్, సోలోగా ఆల్బమ్‌ను రిలీజ్ చేశారు. 2017లో అతని 'రిమెంబర్ ఐ టోల్డ్ యూ' ఆల్బమ్ విడుదలైంది. అందులో బ్రిటీష్ ఆర్టిస్ట్ ఆనె మేరీ నటించారు.

ఆ తర్వాత అతను కొన్ని సినిమాల్లో కూడా నటించారు. 2015లో 'కేర్‌ఫుల్ వాట్ యూ విష్ ఫర్' అనే సినిమాలో ఓ పాత్రలో నటించారు.

ప్రియాంక చోప్రా, నిక్ జోనస్

ఫొటో సోర్స్, RAINDROP MEDIA

ప్రియాంక చోప్రాతో వివాహం

ప్రియాంకతో పెళ్లి కంటే ముందు కూడా నిక్ చాలాసార్లు భారత్‌లో పర్యటించారు. అదే సమయంలో ప్రియాంక కుటుంబాన్ని కూడా కలిశారు.

ప్రియాంక, నిక్ జోనస్‌ల బంధంపై 2018 మే నెల నుంచి చర్చ ప్రారంభమైంది. అప్పటికే వారు ఒకటి కంటే ఎక్కువసార్లు కలిసి తిరుగుతూ కనిపించారు.

ఈ చర్చలకు ముగింపు పలుకుతూ, 2018 డిసెంబర్ నెలలో పూర్తిగా హిందూ సంప్రదాయం, క్రిస్టియన్ ఆచారాల ప్రకారం వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

నిక్ జోనస్

ఫొటో సోర్స్, RAINDROP MEDIA

రాజస్థాన్ రాష్ట్రం జోధ్‌పూర్‌లోని ఉమేద్ భవన్ ప్యాలస్‌లో వారి వివాహం జరిగింది. వారి వివాహ వేడుక పూర్తిగా సన్నిహితుల సమక్షంలో ప్రైవేటుగా జరగగా... ఢిల్లీ, ముంబైలలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు.

నిక్‌కు ఉన్న వ్యాధి ఏంటి?

'ద జోనస్ బ్రదర్స్' బ్యాండ్‌తో పాటు సినిమా-టీవీ కెరీర్ పరంగా 2018 నాటికి నిక్ జోనస్ నికర ఆస్తుల విలువ 18 మిలియన్ డాలర్లు (రూ. 134 కోట్లు) అని పేర్కొంటారు.

13 ఏళ్ల వయస్సులో నిక్ జోనస్‌కు టైప్-1 డయాబెటిస్ ఉన్నట్లు తెలిసింది. దీని తర్వాత అతను ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించడానికి 'చేంజ్ ఫర్ ద చిల్డ్రన్' అనే ఫౌండేషన్‌ను స్థాపించారు.

ప్రియాంక కంటే ముందు కూడా నిక్ జీవితంలో చాలా మంది ప్రముఖులకు చోటు దక్కింది. 2006-07 సమయంలో అమెరికా గాయని మిలే సైరస్, నిక్ జోనస్ ప్రేమలో పడ్డారు. ఈ వ్యవహారం మిలే సైరస్ రాసిన పుస్తకం వల్ల బయటకొచ్చింది. 2009లో వీరిద్దరూ మరోసారి దగ్గరయ్యారు. కానీ తర్వాత వారు విడిపోయారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)