ప్రియాంక చోప్రా వివాహం: నిక్ జోనస్‌తో క్రైస్తవ సంప్రదాయంలో ముగిసిన మ్యారేజ్.. నేడు హిందూ సంప్రదాయంలో పెళ్లి

ఫొటో సోర్స్, RAINDROP MEDIA
రాజస్థాన్ జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, అమెరికా సింగర్ నిక్ జోనస్ వివాహం క్రైస్తవ సంప్రదాయంలో ఘనంగా జరిగింది.
ఈ వివాహానికి వధూవరుల స్నేహితులు, బంధువులు హాజరయ్యారు. క్రైస్తవ సంప్రదాయంలో జరిగిన ఈ వివాహాన్ని జోనస్ తండ్రి పాల్ కెవిన్ నిర్వహించారు.
ఈ వివాహం అనంతరం జోధ్‌పూర్ ఉమైద్ ప్యాలెస్ పరిసరాలు బాణాసంచా వెలుగులతో మెరిసిపోయాయి.

ఫొటో సోర్స్, Reuters
ప్రియాంక, నిక్ హిందూ సంప్రదాయంలో ఇవాళ(ఆదివారం) మరోసారి వివాహం చేసుకోనున్నారు. దీనికి సంబధించి శనివారం సంగీత్ వేడుక, హల్దీ వేడుక నిర్వహించారు.
ఈ వేడుకలో స్నేహితులు,కుటుంబ సభ్యులతో కలిసి ప్రియానిక్ జంట సందడి చేసింది.

ఫొటో సోర్స్, RAINDROP MEDIA
ప్రియాంక, నిక్ హల్దీ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది
అంతకు ముందు ఈ జంట, తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం శుక్రవారం కాక్‌టెయిల్ పార్టీ ఏర్పాటు చేసింది.
ప్రియాంక భర్త నిక్ పూర్తి పేరు నికొలస్ జేరీ జోనస్. అమెరికా గాయకుడు, రచయిత, నటుడు అయిన నిక్ ఏడేళ్ల వయసు నుంచీ నటిస్తున్నారు.

ఫొటో సోర్స్, RAINDROP MEDIA
ప్రియాంక చోప్రా కజిన్ పరిణీతి చోప్రా కూడా పెళ్లి వేడుకకోసం ముందే జోధ్‌పూర్ చేరుకున్నారు. ఈ పెళ్లి కోసం హోటల్ ఉమైద్ భవన్ ప్యాలస్‌ను ఐదు రోజులపాటు బుక్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
36 ఏళ్ల ప్రియాంక, 26 ఏళ్ల నిక్ జోనస్ మధ్య 2017 మేలో ప్రేమ చిగురించింది. అప్పటి నుంచి ఈ జంట చాలాసార్లు కలిసి కనిపించింది. నాలుగు నెలల క్రితం వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది.

ఫొటో సోర్స్, RAINDROP MEDIA
ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ వివాహం తర్వాత రిసెప్షన్ ఇవ్వనున్నారు. ఒక రిసెప్షన్ దిల్లీలో, మరొకటి ముంబైలో నిర్వహిస్తారని సమాచారం.
2000లో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న ప్రియాంక చోప్రా ఆ తర్వాత 50కి పైగా సినిమాల్లో నటించారు. బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం అందుకునే హీరోయిన్లలో ఒకరుగా ఉన్నారు.

ఫొటో సోర్స్, RAINDROP MEDIA
టీవీ సిరీస్ క్వాంటికో, వెంటిలేటర్, బేవాచ్ లాంటి సినిమాలతో ప్రియాంక హాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు.
జోనస్ తన సోదరులు జో, కెవిన్ బ్యాండ్‌లో భాగంగా ఉండేవారు. కాంప్ రాక్ లాంటి సినిమాలతో డిస్నీ చానల్లో వారికి చాలా మంది అభిమానులున్నారు.
జోనస్ సింగిల్‌గా కూడా సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించారు. ఎక్స్ ఫ్యాక్టర్ షోలో ఒక మెంటర్‌గా ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
- ప్రియాంక చోప్రా చదవని మెయిల్స్ ఎన్ని?
- మిథాలీ రాజ్ వర్సెస్ రమేశ్ పొవార్: వివాదం ఇలా మొదలైంది
- అండమాన్ సెంటినల్: ఆ ఆదివాసీలను బయట ప్రపంచంలోకి తీసుకొచ్చినపుడు ఏమైంది?
- BBC Special: తాజ్‌మహల్: ‘జాగ్రత్తపడకపోతే... జ్ఞాపకమే మిగులుతుంది’
- శబరిమల: తొడలు కనిపించే ఫొటో' పెట్టారని రెహనా అరెస్ట్
- మీ పిల్లల స్కూలు బ్యాగ్ బరువు ఎంతుండాలో తెలుసా
- రాహుల్ గాంధీకి 'కౌల్' గోత్రం ఎలా వచ్చింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








