రణ్‌వీర్-దీపిక పెళ్లి: ఇటలీలోని 'జల్‌మహల్' ప్రత్యేకత ఏంటి?

ఇటలీలో దీపిక-రణ్‌వీర్ పెళ్లి

ఫొటో సోర్స్, Getty Images

బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్, నటి దీపికా పదుకొణె వివాహం బుధవారం ఇటలీలో జరిగింది.

ఇద్దరి పెళ్లి ఇటలీలోని లేక్ కోమోలో కొంకిణీ సంప్రదాయం ప్రకారం జరిగింది. ఈ పెళ్లికి వారి దగ్గరి స్నేహితులను, బంధువులను మాత్రమే ఆహ్వానించారు.

దీపిక, రణ్‌వీర్ పెళ్లి ఫొటోలు ఎప్పుడెప్పుడు బయటికి వస్తాయా అని అభిమానులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పటివరకూ దీనికి సంబంధించి చాలా తక్కువ ఫొటోలు బయటికి వచ్చాయి. పెళ్లికి హాజరైన బంధువులు కూడా ఎలాంటి ఫొటోలూ పోస్ట్ చేయలేదు.

ఇటలీలో దీపిక-రణ్‌వీర్ పెళ్లి

ఫొటో సోర్స్, Getty Images

రణ్‌వీర్, దీపిక కలిసి 'గోలియోం కీ రాస్‌లీలా రామ్-లీలా', 'ఫైండింగ్ ఫానీ', 'బాజీరావ్ మస్తానీ', 'పద్మావత్‌' లలో నటించారు.

ఈ ఇద్దరి వివాహం జరిగిన ఇటలీలోని ఈ ప్రాంతం గురించి సోషల్ మీడియాలో చాలా చర్చ జరిగింది.

గత ఏడాది బాలీవుడ్ నటి అనుష్క శర్మ, భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఇటలీలోని టస్కనీలోని ఒక రిసార్ట్‌లో సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

అయితే పెళ్లి కార్డు పోస్ట్ చేసిన తర్వాత దీపిక, రణ్‌వీర్ నుంచి వీరి వివాహం గురించి ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. దీపిక తన పెళ్లి కార్డును అక్టోబర్ 19న సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఇటలీలో దీపిక-రణ్‌వీర్ పెళ్లి

ఫొటో సోర్స్, Getty Images

రణ్‌వీర్-దీపిక పెళ్లి ఎక్కడ జరిగింది?

కలల లోకంలా ఉండే ఈ విల్లా ఇటలీలోని లేక్ కోమోలోని లేక్ ఐలండ్‌లో ఉంది.

18వ శతాబ్దానికి చెందిన 'డెల్ బాల్బియానేలో' అనే ఈ విల్లా చాలా అందంగా ఉంటుంది. సాలా కొమాసినా నుంచి ఇక్కడికి పడవల్లో మాత్రమే వెళ్లగలం.

ఈ విల్లా అందమైన తోటలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పూలు, చెట్ల రంగులు కలిసిపోయి ఇటలీ జాతీయ పతాకం రంగుల్లో (ఆకుపచ్చ, తెలుపు, ఎరుపు) కనిపిస్తాయి.

ఈ విల్లాలో ఎక్కువగా రాజ పరివారాల పెళ్లిళ్లు, సినిమా షూటింగులు జరుగుతుంటాయి.

ఇటలీలో దీపిక-రణ్‌వీర్ పెళ్లి

ఫొటో సోర్స్, Getty Images

2006లో వచ్చిన జేమ్స్ ‌బాండ్ మూవీ 'కేసినో రాయల్‌'లో గాయపడిన జేమ్స్ బాండ్ డేనియల్ క్రెగ్ ఇక్కడే ఉంటాడు.

'ఇటాలియన్ లేక్స్' వెడ్డింగ్ బ్లాగ్ వివరాల ప్రకారం ఈ విల్లాను సోమవారం, బుధవారం మినహా రోజంతా ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటలవరకూ తెరచి ఉంచుతారు. దీనిని చూడ్డానికి ఎవరైనా వెళ్లచ్చు.

కానీ పెళ్లిళ్లు, పార్టీల కోసం విల్లాను రోజంతా తెరిచి ఉంచుతారు. శనివారం రోజున ఇక్కడ జేబులు కాస్త ఎక్కువ ఖాళీ అయిపోతాయి.

ఇటలీలో దీపిక-రణ్‌వీర్ పెళ్లి

ఫొటో సోర్స్, Getty Images

100 మంది అతిథులకే అనుమతి

విల్లాను ప్రజలు సందర్శించడానికి తెరిచి ఉంచినప్పుడు, పెళ్లి లేదా ఏదైనా ఈవెంట్ నిర్వహించుకోవాలంటే, వధూవరులు సహా 50 కంటే ఎక్కువ మంది అతిథులను లోపలికి అనుమతించరు.

50 మంది కంటే ఎక్కువ అతిథులు రావాలంటే పెళ్లి లేదా ఈవెంట్‌ను ప్రజలను అనుమతించని సోమ, బుధవారాల్లో ప్లాన్ చేసుకోవాలి. కానీ ఆ రోజుల్లో విల్లా అద్దె కాస్త ఎక్కువ ఉంటుంది. అతిథుల్లో పిల్లలను కూడా కలిపి లెక్కిస్తారు.

అతిథుల సంఖ్య, విల్లాలో ఉపయోగించే చోటును బట్టి దీని అద్దె ఉంటుంది. ఇక్కడ గరిష్టంగా వంద మంది అతిథులను అనుమతిస్తారు.

ఇటలీలో దీపిక-రణ్‌వీర్ పెళ్లి

ఫొటో సోర్స్, ITALIAN LAKES WEDDING BLOG

విల్లాలో విందు ఏర్పాట్లు కూడా సామాన్యులకు ప్రవేశం ముగిసిన తర్వాతే ప్రారంభించాలి.

పెళ్లి తర్వాత రణ్‌వీర్-దీపిక రెండు రిసెప్షన్లు ఏర్పాటుచేయబోతున్నారు. మొదటి రిసెప్షన్ నవంబర్ 21న దీపిక హోమ్ టౌన్ బెంగళూరులోని లీలా ప్యాలెస్ హోటల్లో జరుగుతుంది. ఈ రిసెప్షన్ దీపిక తల్లిదండ్రుల తరఫున ఏర్పాటుచేస్తున్నారు. రెండో రిసెప్షన్ ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్లో రణ్‌వీర్ తల్లిదండ్రులు ఏర్పాటుచేస్తున్నారు.

ఇటలీలో దీపిక-రణ్‌వీర్ పెళ్లి

ఫొటో సోర్స్, Getty Images

సోషల్ మీడియాలో 'దీప్‌వీర్' జోష్

రణ్‌వీర్-దీపిక పెళ్లైపోయిందనే వార్త రాగానే సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ట్విటర్‌లో 'దీప్‌వీర్ కీ షాదీ', 'దీప్‌వీర్ వెడింగ్' ట్రెండ్ అయ్యాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

'అమూల్' బాలీవుడ్ జంటకు తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

'నాకు ఇది దొరికింది' అంటూ ట్విటర్‌లో అక్ష్ గార్గ్ ఒక పెయింటింగ్ షేర్ చేశాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

కమెడియన్ కపిల్ శర్మ.. రణ్‌వీర్, దీపిక వివాహానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపాడు. వారిని ప్రపంచంలోని అత్యంత అందమైన జంటగా వర్ణించాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

నటుడు రోనిత్ రాయ్ దీపిక పదుకొణె, రణ్‌వీర్ సింగ్‌కు శుభాకాంక్షలు తెలిపాడు. ఇద్దరి జీవితంలో చాలా ప్రేమ, సంతోషంతోపాటు చాలా మంది పిల్లలు కూడా నిండిపోవాలని కోరుకుంటున్నట్టు పోస్ట్ చేశాడు.

శుభాకాంక్షలతోపాటు పెళ్లి ఫొటోలను ఇంకా సస్పెన్స్‌గా ఉంచడంపై చాలా మంది పంచ్‌లు కూడా వేశారు.

పోస్ట్‌ Instagram స్కిప్ చేయండి
Instagram ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of Instagram ముగిసింది

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఒక అస్థిపంజరం ఫొటో పోస్ట్ చేశారు. "దీప్‌వీర్ పెళ్లి ఫొటోల కోసం చాలాసేపటి నుంచి వేచిచూస్తే" అని పెట్టారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 6
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 6

"రేపు రామ్ లీలా సొంతం అవుతాడు, లీలా రామ్ సొంతం అవుతుంది. మనం మాత్రం వాళ్ల ఫొటోల కోసం ఆతృతగా ఎదురుచూస్తూనే ఉంటాం" అని తమన్నా వాహీ ట్విటర్‌లో కామెంట్ చేశారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)