ప్రియాంక చోప్రా, నిక్ జోనస్‌‌: నిశ్చితార్థం అయ్యింది.. త్వరలో పెళ్లి

ప్రియాంక చోప్రా, నిక్ జోనస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 25 ఏళ్ల నిక్ జోనస్ ప్రియాంక చోప్రా కంటే పదకొండేళ్లు చిన్నవారు

బాలీవుడ్ సూపర్‌స్టార్ ప్రియాంక చోప్రా, అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన గాయకుడు నిక్ జోనస్‌ల నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని వారు ఖరారు చేశారు. గత కొన్ని నెలలుగా వీరిరువురూ కలసి తిరుగుతున్న సంగతి తెలిసిందే.

అమెరికాకు చెందిన పాప్ రాక్ బ్యాండ్.. జోనస్ బ్రదర్స్‌లో నిక్ ఒకప్పుడు భాగస్వామి.

నిశ్చితార్థ కార్యక్రమాన్ని ఖరారు చేస్తూ ప్రియాంక చోప్రా, నిక్ జోనస్‌లు తమతమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో ఒకే తరహా ఫొటోలు పోస్ట్ చేశారు. ‘‘కాబోయే భార్య’’ అంటూ ప్రియాంక చోప్రాను ఉద్దేశించి నిక్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

శనివారం ముంబయిలో జరిగిన ఈ ప్రైవేటు ఎంగేజ్‌మెంట్ కార్యక్రమంలో ఇరువురూ సంప్రదాయ భారతీయ వస్త్రాలు ధరించి పాల్గొన్నారు.

గత కొన్ని వారాలుగా వీరి నిశ్చితార్థం గురించిన ఊహాగానాలు వెలువడినప్పటికీ వారు మాత్రం ఇప్పటి వరకూ అధికారికంగా స్పందించలేదు.

కాగా, పెళ్లి ఎప్పుడు జరుగుతుందనేది వారు ఇంకా ప్రకటించలేదు.

పోస్ట్‌ Instagram స్కిప్ చేయండి, 1
Instagram ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of Instagram ముగిసింది, 1

2000వ సంవత్సరంలో మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకున్న ప్రియాంక చోప్రా భారత్‌లో 50కి పైగా సినిమాల్లో నటించారు. చాలా అవార్డులతో పాటు గుర్తింపునూ సంపాదించుకున్న ప్రియాంక ప్రస్తుతం బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఒకరు.

ప్రపంచంలో అత్యంత ప్రభావశీలురైన 100 మందిలో ప్రియాంక చోప్రా కూడా ఒకరని రెండేళ్ల కిందట టైమ్ మ్యాగజీన్ పేర్కొంది. ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన మహిళల్లో ప్రియాంక ఒకరని గతేడాది ఫోర్బ్స్ మ్యాగజీన్ పేర్కొంది.

క్వాంటికో టీవీ సిరీస్‌తో అమెరికాలో నటనకు శ్రీకారం చుట్టిన ప్రియాంక చోప్రా తదనంతర కాలంలో వెంటిలేటర్, బేవాచ్, ఎ కిడ్ లైక్ జాక్ వంటి సినిమాల్లోనూ నటించారు.

బ్రిటన్ రాజకుమారుడు హ్యారీతో నటి మేఘన్ మార్కెల్ వివాహ వేడుకకు హాజరైన అతిథుల్లో ఆమె కూడా ఒకరు.

పోస్ట్‌ Instagram స్కిప్ చేయండి, 2
Instagram ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of Instagram ముగిసింది, 2

తన సోదరులు జో, కెవిన్‌లతో పాటు జోనస్ బ్రదర్స్‌లో పనిచేసిన నిక్ జోనస్ క్యాంప్ రాక్ వంటి చిత్రాలతో డిస్నీ ఛానెల్‌ ద్వారా ప్రేక్షకాదరణ పొందారు. తరువాత ఆయన సొంతంగా పాటలు పాడటం మొదలుపెట్టి.. లెవల్స్, జెలస్, చైన్స్, ఎక్స్ ఫ్యాక్టర్ వంటి హిట్స్‌తో అభిమానుల్ని సంపాదించుకున్నారు.

25 ఏళ్ల నిక్ జోనస్ ప్రియాంక చోప్రా కంటే పదకొండేళ్లు చిన్నవారు. జూన్‌ నెలలో లండన్‌లో ఆయన ప్రియాంక చోప్రాకు ప్రపోజ్ చేశారని, ప్రియాంక కోసం అత్యంత ఖరీదైన ఎంగేజ్‌మెంట్ రింగ్ కొన్నారని అప్పట్లో వార్తలొచ్చాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)