లఖీంపుర్ ఖేరీ: రైతుల నిరసన ప్రదర్శనపైకి దూసుకెళ్లిన కారు.. ఎనిమిది మంది మృతి - కేంద్ర మంత్రి కొడుకుపై హత్యానేరం కేసు పెట్టాలని బాధితుల డిమాండ్

ఫొటో సోర్స్, ANANT ZANANE/BBC
లఖీంపుర్ ఖీరీలో ఆదివారం జరిగిన హింస నేపథ్యంలో బాధితులను పరామర్శించేందుకు అక్కడికి చేరుకున్న సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీలను పోలీసులు అడ్డుకున్నారు. కిసాన్ సంఘ్ నాయకుడు రాకేశ్ టికైత్ అప్పటికే అక్కడికి చేరుకున్నారు.
''ఇతన్నికారుతో ఢీకొట్టించారు. తర్వాత కాల్చి చంపారు'' అని ఒక మృతదేహాన్ని బీబీసీ అసోసియేట్ జర్నలిస్ట్ అనంత్ ఝానానేకి చూపిస్తూ టికైత్ ఆరోపించారు.
''పోస్ట్‌మార్టం రిపోర్టు రావాలి. కేసు నమోదు చేయాలి. తప్పు చేసిన వారెవరైనా వారిని కఠినంగా శిక్షించాలి. మంత్రి మీదా, అతని కొడుకు మీద కేసు పెట్టాలి'' అని టికైత్ డిమాండ్ చేశారు.
కేసు పెట్టడానికి ప్రభుత్వం అంగీకరిస్తుందా అని ప్రశ్నిస్తే, ''వారు దోషులు. ప్రభుత్వం ఎందుకు అంగీకరించదు? మంత్రిపై 120బి సెక్షన్ ప్రకారం కేసు దాఖలు చేయాలి. అతని కుమారుడిపై హత్య కేసు పెట్టాలి. కాల్పులు జరిపిన వారిపై కూడా హత్య కేసు పెట్టాలి" టికైత్ స్పష్టం చేశారు.
''ఇప్పటికే 750మంది రైతులు మరణించారు. వారిలో వీరు కూడా చేరతారు. అయినా, మా ఉద్యమం కొనసాగుతుంది. శాంతియుతంగా కొనసాగిస్తాం'' అని టికైత్ అన్నారు.
అధికారులు పరిహారం గురించి చెప్పారని, బాధ్యులైన వారిపై కేసులు పెట్టడానికి ప్రభుత్వం అంగీకరించిందని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, ANANT ZANANE/BBC
నిందితులను శిక్షించాలి...
మరోవైపు బాధితుల బంధువులు ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. ఆదివారం నాటి ఘటనలో చనిపోయిన వారి అంత్యక్రియల సందర్భంగా వారి బంధువులు కన్నీరు మున్నీరయ్యారు.
''మా తమ్ముడు అందరికంటే చిన్నవాడు. ఇంకా స్కూలుకు వెళుతున్నాడు. వాడిని కూడా చంపేశారు'' అని గుర్వీందర్ సింగ్ అనే యువకుడి అక్క ఆరోపించారు. ''మా తమ్ముడిని చంపిన వారిని కఠినంగా శిక్షించాలి'' అని ఆమె డిమాండ్ చేశారు.

ఫొటో సోర్స్, ANANT ZANANE/BBC
లఖీంపుర్ ఘటనపై కోర్టులో ఏం జరిగింది?
రైతుల నిరసనల విషయంపై సుప్రీంకోర్టులో సోమవారం జరిగిన విచారణ సందర్భంగా లఖీంపుర్ ఖేరీ సంఘటనను అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ప్రస్తావించారు.
ఇలాంటి సంఘటనలు జరగడం విచారకరమని వేణుగోపాల్ అన్నారు. ఈ సంఘటనలకు ఎవరూ బాధ్యత తీసుకోవడం లేదని కోర్టు వ్యాఖ్యానించింది.
మరోవైపు జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపేందుకు కిసాన్ మహాపంచాయత్ సుప్రీంకోర్టులో అనుమతి కోరింది.అయితే, కోర్టులో కేసు విచారణలో ఉండగా నిరసన ప్రదర్శనలు ఎలా చేస్తారని కిసాన్ మహాపంచాయత్ న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది.
రైతు చట్టాల విషయంలో అనేక పిటిషన్లు దాఖలయ్యాయని, దీనిపై ప్రదర్శనలు చేయరాదని అడ్వొకేట్ జనరల్ అన్నారు.
నిరసన స్థలం చుట్టూ నిర్మించిన రోడ్ బ్లాక్‌లలో రైతుల పాత్ర లేదని కిసాన్ మహా పంచాయత్ తరఫున హాజరైన అడ్వకేట్ అజయ్ చౌదరి సుప్రీంకోర్టుకు తెలియజేశారు,
‘‘మేము మూడు వ్యవసాయ చట్టాలపై స్టే ఆర్డర్ ఇచ్చాం. అయినా రైతులు ఎందుకు నిరసన తెలుపుతున్నారు’’ అని సుప్రీం కోర్టు అడిగింది.
''మీరు న్యాయస్థానంలో చట్టాన్ని సవాలు చేసినప్పుడు మళ్లీ నిరసనలు ఎలా నిర్వహిస్తారు’’ అని న్యాయస్థానం ప్రశ్నించింది.
''జంతర్ మంతర్ వద్ద నిరసనల పరమార్ధం ఏంటి. మీరు ఒక చట్టాన్ని సవాలు చేసి అటు కోర్టుకు, ఇటు పార్లమెంటుకు వెళతామంటే ఎలా '' అని కోర్టు అన్నది.

ఫొటో సోర్స్, ANANT ZANANE/BBC
బాధితులకు పరిహారం
అంతకు ముందు , లఖీంపుర్ ఖేరీ హింస తర్వాత రైతులు, అధికారుల మధ్య జరిగిన చర్చల్లో చాలా అంశాల్లో అంగీకారం కుదిరింది.
ఈ ఘటనలో చనిపోయిన ఒక్కో రైతు కుటుంబానికి 45 లక్షలు, గాయపడిన ఒక్కొక్కరికి 10 లక్షల ఆర్థిక సాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధమైంది.
ఈ ఘటనలో చనిపోయిన బీజేపీ కార్యకర్తల కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి 50 లక్షల పరిహారం అందించాలని అంతకుముందు లఖీంపుర్ ఖేరీ హింసపై మాట్లాడిన కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రా డిమాండ్ చేశారు.
తన కొడుకు ఆ సమయంలో అక్కడ లేడని, తమ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి జరిగిందని, ఇది హత్యకు కుట్ర కావచ్చని ఆయన మరోసారి చెప్పారు.
"కార్యక్రమం జరిగే ప్రాంతం అక్కడికి 3-4 కిలోమీటర్ల దూరం ఉంది. నా కొడుకు లేదా నేను అక్కడ ఉండుంటే మేం ప్రాణాలతో మిగిలేవాళ్లమా" అని ఆయన ప్రశ్నించారు.
మరోవైపు, ఈ ఘటనకు కారణమైన వారిని వీలైనంత త్వరగా అరెస్ట్ చేయడానికి, జ్యుడిషియల్ విచారణ జరిపించడానికి ప్రభుత్వం అంగీకరించింది.
యూపీ ఏడీజీ (లా అండ్ ఆర్డర్), భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికైత్ సంయుక్త మీడియా సమావేశంలో ఈ విషయం చెప్పారు.
మృతుల కుటుంబ సభ్యులకు ఉద్యోగం, 8 రోజుల్లో నిందితుల అరెస్ట్, మృతుల బంధువులకు రూ.45 లక్షల నష్ట పరిహారం, ఘటనపై జ్యుడిషియల్ విచారణ కూడా జరుగుతుందని ప్రకటించారు.

ఫొటో సోర్స్, ANANT ZANANE/BBC
కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడిపై కేసు నమోదు -పీటీఐ
లఖీంపుర్ ఖేరీ హింస కేసులో ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా, మరికొందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పీటీఐ పేర్కొంది. రైతులపై కూడా మరో ఎఫ్ఐఆర్ నమోదైందని తెలిపింది.
లఖీంపుర్ ఖేరీలో అధికారులతో చర్చలు జరుపుతున్న రైతుల డిమాండ్లలో ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేయాలనే డిమాండ్ కూడా ఉంది.
ఆదివారం నిరసనలు చేస్తున్న రైతులపై ఆశిష్ మిశ్రానే వాహనం ఎక్కించాడని రైతులు ఆరోపిస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
కానీ, ఆయన తండ్రి అజయ్ మిశ్రా మాత్రం తన కొడుకు ఆ సమయంలో ఘటనాస్థలంలో లేడని, కార్యక్రమం జరుగుతున్న ప్రాంతంలో ఉన్నాడని అంటున్నారు.
"ఈ ఘటనలో చనిపోయిన మిగతా నలుగురిలో ఒక బీజేపీ కార్యకర్త, ఒక కార్ డ్రైవర్ కూడా ఉన్నారు. రైతుల మధ్య ఉన్న కొందరు పదునైన ఆయుధాలు కర్రలతో వారిపై దాడి చేశారు" అని ఆయన చెప్పారు.
లఖింపూర్ ఖేరీలో కేశవ్ ప్రసాద్ మౌర్య రావడానికి నిర్మించిన ఒక హెలిపాడ్ దగ్గర ఈ ఘటన జరిగింది.
రైతులు టేనీ చేసిన ఒక పాత ప్రకటనపై ఆగ్రహంతో ఉన్నారు. మౌర్య కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ ఘటనలో 8 మంది చనిపోయారు. వీరిలో నలుగురు రైతులు, మరో నలుగురు వేరే వారు ఉన్నారు.
మరోవైపు రైతులపై కూడా ఒక కేసు నమోదైంది.ప్రస్తుతం లఖీంపుర్ ఖేరీలో రైతులు, అధికారుల మధ్య నాలుగో దశ చర్చలు జరుగుతున్నాయి.మీడియా రిపోర్టుల ప్రకారం ప్రస్తుతం చాలా డిమాండ్లపై అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది.
రైతులు ప్రధానంగా నాలుగు డిమాండ్లు అధికారుల ముందు పెట్టారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
అఖిలేష్ యాదవ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
లఖింపూర్ ఖేరీలో హింస తర్వాత ఉత్తర్‌ప్రదేశ్‌లో రాజకీయం వేడెక్కుతోంది.
విపక్ష నేతలు లఖీంపుర్ ఖేరీ చేరుకోడానికి ప్రయత్నిస్తున్నారు.
లఖీంపుర్ ఖేరీ వెళ్తానని యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ప్రకటించారు.
దీంతో ఆయన ఇంటి ముందు పోలీసులను మోహరించారు. రోడ్లు బ్లాక్ చేశారు.
నిరసనగా అఖిలేశ్ తన ఇంటి ముందు ధర్నాకు దిగారు. దాంతో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆంగ్లేయులు కూడా రైతులపై ఇంత దౌర్జన్యానికి పాల్పడలేదని అఖిలేశ్ అన్నారు.
"బీజేపీ ఆంగ్లేయుల కంటే ఎక్కువగా రైతులపై క్రూరత్వం చూపుతోంది. ఆంగ్లేయుల కాలంలో కూడా ఇంత దౌర్జన్యాలు జరగలేదు. ప్రభుత్వం ప్రాణాలు కూడా తీస్తుందేమోనని అందరూ అంటున్నారు" అని అఖిలేశ్ అన్నారు.
కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రా, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఫొటో సోర్స్, AnantZanane
మరోవైపు పోలీసులు అదుపులోకి తీసుకున్న కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీని సీతాపూర్ పీఏసీ గెస్ట్ హౌస్‌లో ఉంచారు.
ఇక లఖింపూర్ వెళ్లకుండా బీఎస్పీ ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర మిశ్రాను కూడా పోలీసులు అడ్డుకున్నారు.
తమ పార్టీ నేత సతీశ్ చంద్ర మిశ్రాను గృహనిర్బంధం చేశారని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి కూడా ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
"ఈ ఘటనలో ఇద్దరు బీజేపీ మంత్రుల ప్రమేయం ఉండడంతో దీనిపై ప్రభుత్వం తగిన దర్యాప్తు జరిపిస్తుందని, బాధితులకు న్యాయం జరుగుతుందని, దోషులకు కఠిన శిక్ష పడుతుందని అనిపించడం లేదు. అందుకే దీనిపై జ్యుడిషియల్ విచారణ జరపించాలి" అని మాయావతి మరో ట్వీట్‌లో కోరారు.
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌ను కూడా అర్ధరాత్రి మహారాజ్‌గంజ్‌లో అడ్డుకున్నారు. ఆయన కూడా లఖీంపుర్ ఖేరీ వెళ్లడానికి ప్రయత్నించారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రియాంకా గాంధీని అదుపులోకి తీసుకున్న పోలీసులు
లఖీంపుర్ ఖేరీ నిరసనల్లో చనిపోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్తున్న కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీని సీతాపూర్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రియాంకా గాంధీ, పోలీసుల మధ్య తోపులాట జరిగింది.
ప్రియాంకా గాంధీని అదుపులోకి తీసుకుంటున్న సమయంలో ఒక మగ పోలీసు అధికారి ఆమెపై చెయ్యెత్తారని కాంగ్రెస్ నేత దీపేంద్ర సింగ్ హుడా ఆరోపించారు.
పోలీసు అధికారి ప్రియాంకా గాంధీపై ఎలా చెయ్యెత్తారో దీపేంద్ర హుడా చెప్పడం వీడియోలో వినిపిస్తోంది.
యూపీ పోలీసు అధికారి ప్రియాంకా గాంధీని అదుపులోకి తీసుకుంటున్నప్పుడు వారి తీవ్ర వాగ్వాదం జరిగింది.
ప్రియాంకా గాంధీ తన అరెస్ట్ వారెంట్ చూపించాలంటూ ఆయన్ను అడిగారు. ఇద్దరు మాత్రమే లఖీంపూర్ వెళ్తున్నామని, తమతో భారీగా గుంపు ఎవరూ లేరని చెప్పారు.
తనను బలవంతంగా అదుపులోకి తీసుకుంటే కిడ్నాపింగ్ కేసు పెడతానని ప్రియాంకా గాంధీ హెచ్చరించారు.
మరోవైపు, లఖింపూర్ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు తాను ఘటన ప్రదేశానికి కాసేపట్లో బయలుదేరబోతున్నట్లు పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4

ఫొటో సోర్స్, AnantZanane
నాలుగు డిమాండ్లు పెట్టిన రైతులు
మరోవైపు లఖీంపూర్‌లో రైతు నేతలు, స్థానిక అధికారులకు మధ్య సమావేశం జరుగుతోంది.
సుదీర్ఘ చర్చల తర్వాత రైతులు అధికారుల ముందు నాలుగు డిమాండ్లు పెట్టారు.
హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను తొలగించడం, ఆయన కొడుకును అరెస్ట్ చేయడం, ఒక్కో బాధితుడి కుటుంబ సభ్యులకు కోటి రూపాయల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ నాలుగు ముఖ్యమైన డిమాండ్లతోపాటూ రైతులు అధికారుల ముందు మరికొన్ని డిమాండ్లు కూడా పెట్టారు.
ఈ ఘటనపై హైకోర్టు రిటైర్డ్ జడ్జ్‌తో జ్యుడిషియల్ విచారణ జరిపించాలని కోరారు. దానితోపాటూ ఎస్డీఎంను తొలగించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు అజయ్ మిశ్రా కుమారుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కూడా కోరుతున్నారు.
ఈ ఘటనలో తన కొడుకు ప్రమేయం లేదని, అతని కారు మాత్రమే ఘటనా స్థలంలో ఉందని, ఆ ఘటనలో అతడి మద్దతుదారులు కూడా చనిపోయారని కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా చెబుతున్నారు.
దీనిపై అర్థరాత్రి ట్వీట్ చేసిన అజయ్ మిశ్రా.. ఈ కేసులో విచారణ జరిపించాలని యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ను కోరారు.

ఫొటో సోర్స్, Ani
లఖింపూర్‌లో ఏం జరిగింది?
ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖీంపూర్‌లో రైతుల ఆందోళనలో నలుగురు రైతులు, ముగ్గురు బీజేపీ కార్యకర్తలు సహా మొత్తం ఎనిమిది మంది మరణించారు.
కారు కింద పడి ఇద్దరు వ్యక్తులు నలిగిపోయారని, వాహనం బోల్తా పడడంతో మరో ముగ్గురు మరణించారని లఖింపూర్ జిల్లా మేజిస్ట్రేట్ డాక్టర్ అరవింద్ చౌరాసియా తొలుత చెప్పారు.
ఈ సంఘటనలో మొత్తం ఎనిమిది మంది చనిపోయారని లఖింపూర్ జిల్లా అదనపు ఎస్పీ అరుణ్ కుమార్ సింగ్ ప్రకటించారు.
మృతుల్లో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు ఉన్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా తెలిపారు.
లఖింపూర్ సంఘటన దురదృష్టకరమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దాస్ అన్నారు.
ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తామని, లోతుగా విచారణ జరిపి ఇందులోని అన్ని కోణాలనూ వెలికితీస్తామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

ఫొటో సోర్స్, Prashant/BBC
టికునియాలో ఏం జరిగింది?
లఖింపూర్ ఖేరిలో డిప్యూటీ సిఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు, ఆ తర్వాత ఆయన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా స్వగ్రామంలో మరొక కార్యక్రమానికి హాజరయ్యారు.
డిప్యూటీ సీఎం పర్యటన సమాచారం అందుకున్న రైతు నాయకులు డిప్యూటీ సీఎంకు తమ నిరసన తెలియజేయడానికి తరలివచ్చారు.
ఈ సమయంలో, టికునియా పట్టణంలో ఒక రోడ్డుపై నిరసన తెలుపుతున్న రైతులపైకి కేంద్ర మంత్రి కాన్వాయ్‌లోని ఒక వాహనం దూసుకెళ్లింది. ఒక రైతు అక్కడికక్కడే చనిపోయారు.
ఈ సంఘటనతో ఆగ్రహించిన రైతులు ఒక కారుకు నిప్పు పెట్టారు.
మొత్తంగా ఎనిమిది మంది చనిపోయారు. వారిలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు ఉన్నారని కేంద్ర మంత్రి చెప్పారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. డిప్యూటీ సీఎం కార్యక్రమం మధ్యలోనే ఆగిపోయింది.
ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో.. జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్ అక్కడికి చేరుకున్నారు. భారీగా పోలీసులను మొహరించారు.
మరోవైపు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడి వాహనంతో ముగ్గురు రైతులను తొక్కించినట్లు భారతీయ కిసాన్ యూనియన్ నాయకులు ఆరోపించారు.
రైతు నాయకుడు డాక్టర్ దర్శన్‌పాల్ మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం హెలికాప్టర్‌లో వెళ్లకుండా ఉండేందుకు టికునియాలోని హెలిప్యాడ్‌ని దిగ్బంధించినట్లు చెప్పారు. కార్యక్రమం ముగుస్తోందని, ప్రజలు అక్కడి నుండి తిరిగి వెళ్తున్నారని ఆయన అన్నారు.
"అదే సమయంలో అజయ్ మిశ్రా, అతని కుమారుడు, సోదరుడు ప్రయాణిస్తున్న మూడు వాహనాలు అతివేగంతో వచ్చాయి, ఆ వాహనాలు పైకెక్కడంతో ఒక రైతు అక్కడికక్కడే మరణించాడు, మరొకరు ఆసుపత్రిలో మరణించారు" అని దర్శన్ పాల్ వెల్లడించారు.
రైతు నాయకుడు తాజేందర్ విర్క్ కూడా తీవ్రంగా గాయపడ్డారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
రైతు నాయకుడు రాకేశ్ తికాయత్ ఏమన్నారు?
లఖింపూర్ ఖేరీ జిల్లాలో జరిగిన నిరసనల్లో రైతుల మృతిపై రైతు సంఘం నాయకుడు రాకేశ్ తికాయత్ సంతాపం ప్రకటించారు.
శాంతిని కాపాడాలని రైతులకు రాకేశ్ తికాయత్ విజ్ఞప్తి చేశారు.
‘‘లఖింపూర్ ఖేరీలో జరిగిన సంఘటన చాలా బాధాకరం. ఈ సంఘటన క్రూరమైన, అప్రజాస్వామికమైన ప్రభుత్వ వైఖరిని మరోసారి బయటపెట్టింది. రైతుల ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రభుత్వం ఎంతకైనా దిగజారుతుంది. రైతుల సహనాన్ని ప్రభుత్వం పరీక్షించాలని చూడకూడదు. రైతుల మృతిని హత్యగా పరిగణిస్తూ.. హంతకులపై కేసు నమోదు చేయాలి. నిందితులను అరెస్ట్ చేయాలి’’ అని తికాయత్ డిమాండ్ చేశారు.
రైతులంతా శాంతిని కాపాడాలని, ఈ ఉద్యమంలో విజయం రైతులతే అవుతుందని ఆయన ట్వీట్ చేశారు.
ప్రభుత్వం కళ్లు తెరవాలని, లేకపోతే ఒక్క బీజేపీ నాయకుడు కూడా ఇంటి నుంచి బయటకు రాకుండా చేయగలమని అన్నారు.

ఫొటో సోర్స్, ANI
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా వివరణ
తన కుమారుడు ప్రయాణిస్తున్న కారు కింద పడి రైతులు మృతి చెందారన్న కథనాలపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా స్పందించారు.
ఈ సంఘటన జరిగినప్పుడు తన కుటుంబ సభ్యులు ఎవ్వరూ అక్కడ లేరని వివరించారు.
ప్రతి ఏటా తమ స్వగ్రామంలో కుస్తీ పోటీలను నిర్వహిస్తామని, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకే ఉప ముఖ్యమంత్రి రావాల్సి ఉందన్నారు.
లఖింపూర్‌లో ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత, తాను, ఉప ముఖ్యమంత్రి ఇద్దరం తమ స్వగ్రామానికి వెళుతున్నామని చెప్పారు.

ఫొటో సోర్స్, AnantZanane
వేదికకు కొంచెం దూరంలో ఉండగా.. కొందరు రైతులు నిరసన తెలిపేందుకు అక్కడికి వస్తున్నారని తెలిసి, తమ వాహనాలను దారిమళ్లించారని చెప్పారు. ఈ నేపథ్యంలో రైతులు దాడికి దిగారని, రాళ్లు రువ్వారని వెల్లడించారు.
ఈ క్రమంలో ఒక వాహనం అదుపుతప్పి రైతులపైకి దూసుకెళ్లిందని వెల్లడించారు.
రైతుల్లో కలిసిపోయిన కొందరు నిందితులు తమపై కర్రలు, కత్తులతో దాడికి దిగారని, దీనికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయని అజయ్ మిశ్రా చెప్పారు.
ఒక వాహనాన్ని రోడ్డుపై నుంచి పక్కకు తోసేశారని, దానికి నిప్పు పెట్టారని, ఇతర వాహనాలను కూడా ధ్వంసం చేశారని తెలిపారు.
ఈ దుర్ఘటనలో తమ డ్రైవర్, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ముగ్గురు చనిపోయారని, మరో 10-12 మంది గాయపడ్డారని చెప్పారు.
అనేక సంస్థలు భారతదేశంలో అస్థిరత సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని, రైతుల ఉద్యమాన్ని నడుపుతున్న వారు కూడా దీన్ని అర్థం చేసుకోవాలని అజయ్ మిశ్రా చెప్పారు.

ఫొటో సోర్స్, Prashant/BBC
బీజేపీపై ప్రతిపక్ష నాయకుల ఆరోపణలు
రైతుల మృతిపై ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ స్పందించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
‘‘వ్యవసాయ చట్టాలపై శాంతిపూర్వకంగా నిరసనలు తెలుపుతున్న రైతులను బీజేపీ ప్రభుత్వం.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కుమారుడు ద్వారా వాహనంతో గుద్దించడం ఘోరమైన అవమానం, క్రూరమైన చర్య. ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ వాళ్ల జులుం ఇక సహించరానిది. అయితే బీజేపీలో ఉండాలి, లేదంటే వాహనంతో గుద్దించాలి అన్నదే యూపీలో నడుస్తోంది. లేదంటే మనుగడే లేదిక్కడ’’ అని అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 7
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ స్పందిస్తూ.. ‘‘దేశంలోని రైతులను బీజేపీ ఎంతగా ద్వేషిస్తుంది? వాళ్లకు జీవించే హక్కు లేదా? వాళ్లు గొంతెత్తితే కాల్చేస్తారా? కారుతో తొక్కించేస్తారా? ఇక చాలు. ఇది రైతుల దేశం. బీజేపీ క్రూరమైన భావజాలానికి జాగీరు కాదు’’ అని ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 8
కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ‘‘ఈ అమానవీయమైన నరసంహారాన్ని చూసి కూడా మౌనంగా ఉన్నవాళ్లు ముందే చచ్చిపోయారు. కానీ, మేము మాత్రం ఈ బలిదానాన్ని వృధా కానివ్వం. రైతుల సత్యాగ్రహం జిందాబాద్’’ అని ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- ‘ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో పోలీసుల కుమ్మక్కు.. ఇదో కొత్త ట్రెండ్, దీన్ని ఆపాలి’ అని సీజేఐ జస్టిస్ రమణ ఎందుకు అన్నారు?
- ఆర్యన్ ఖాన్: సముద్రంలో డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న షారుఖ్ ఖాన్ కుమారుడిని ఎలా పట్టుకున్నారంటే..
- హవాలా అంటే ఏంటి? ఈ నెట్వర్క్ ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది? ఈ బిజినెస్ ఎంత పెద్దది?
- రెండవ ప్రపంచ యుద్ధం: ఈ చిన్న పడవలో నాజీల నుంచి ఆ సోదరులు ఎలా తప్పించుకున్నారు?
- పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ విమానాన్ని ఒక బెంగాలీ పైలట్ హైజాక్ చేసినప్పుడు...
- లవ్ కోచింగ్ తీసుకుంటే భర్తలు సులభంగా దొరుకుతారా... ఒంటరి మహిళలు ఎందుకు దీని వెంట పడుతున్నారు?
- అమెరికాలో అబార్షన్ హక్కుల కోసం భారీ నిరసన ప్రదర్శనలు
- తొలి సిపాయిల తిరుగుబాటు విశాఖ కేంద్రంగా జరిగిందా?
- సమంత, అక్కినేని నాగ చైతన్య విడాకులు: విడిపోతున్నామని ప్రకటించిన హీరో, హీరోయిన్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













