జంతర్ మంతర్ వద్ద రైతుల ఆందోళన: మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ - Newsreel

ఫొటో సోర్స్, ANI
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ గత కొన్ని నెలలుగా దిల్లీ సరిహద్దుల్లో ధర్నా చేస్తున్న రైతులు దిల్లీ నగరంలో ఆందోళనకు దిగారు.
రైతు సంఘాల నాయకుడు రాకేశ్ తికాయత్ నేతృత్వంలో జంతర్ మంతర్ వద్దకు చేరుకున్న రైతుల బృందం, కేంద్రం తెచ్చిన మూడు చట్టాలను రద్దు చేయాల్సిందేనని నినాదాలు చేసింది.
''మా రైతులు ఇక్కడ కిసాన్ పార్లమెంట్ నిర్వహిస్తారు. పార్టీలతో సంబంధం లేకుండా ఎంపీలందరూ మా పోరాటానికి మద్ధతివ్వాలి. లేకపోతే వారు తమ నియోజక వర్గాల్లో వ్యతిరేకతను ఎదుర్కొంటారు'' అని రాకేశ్ తికాయత్ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
మరోవైపు, రైతులతో చర్చించడానికి ప్రభుత్వం ఇప్పటికీ సిద్దంగానే ఉందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
''కొత్త వ్యవసాయ చట్టాల గురించి రైతులకు వివరించాము. వారికి ఏవైనా అభ్యంతరాలుంటే మాకు చెప్పాలి. రైతులతో చర్చలు జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది'' అని కేంద్ర వ్యవసాయ మంత్రి స్పష్టం చేశారు.
కొద్దిమందికే అనుమతి
జంతర్ మంతర్ వద్ద ఆందోళన నిర్వహించడానికి ప్రభుత్వం 200 మంది రైతులకు అనుమతి ఇచ్చింది. కోవిడ్ నిబంధనల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రిపబ్లిక్ డే నాటి ఘటనలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
హరియాణ-దిల్లీ సరిహద్దుల్లో నిరసనలో పాల్గొంటున్న రైతులు గుర్తింపు కార్డులు ధరించి, బస్సులో ధర్నా జరిగే ప్రాంతానికి చేరుకున్నారు. ఉదయ 11 గంటలకే జంతర్ మంతర్ చేరుకోవాల్సి ఉన్నా, ఆందోళనకారుల రాక ఆలస్యమైంది
మార్గ మధ్యంలో మూడు చోట్ల తమను ఆపి, ఆధార్ కార్డులు చూపించమని అడిగారని రైతు సంఘం నాయకుడు శివ కుమార్ కక్కా వెల్లడించారు.
మరోవైపు, కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ, తమ పార్టీ ఎంపీలతో కలిసి గాంధీ విగ్రహం దగ్గర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

అమరావతి భూముల కేసులో మరో మలుపు
అమరావతి భూముల విషయంలో సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.
ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలతో చేపట్టిన దర్యాప్తు నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
ఈ కేసులో మూడు రోజుల క్రితమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
దీంతో మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కేసులోనూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రభుత్వం తరపున న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. ఏపీ రాజధాని నిర్మాణం కోసం చేసిన భూసేకరణలో అవినీతి జరిగిందంటూ నమోదైన ఎఫ్ఐఆర్‌లో 12 మందిని నిందితులుగా పేర్కొన్నారు.
వీరిలో మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ సహా పలువురున్నారు.

ఫొటో సోర్స్, FACEBOOK/YSJAGAN
వైఎస్ జగన్ విపక్షంలో ఉన్నప్పుడు అమరావతి భూముల ల్యాండ్ ఫూలింగ్ సహా పలు విధానాలను ప్రశ్నించారు.
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ల్యాండ్ పూలింగ్‌పై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు.
రాజధాని ఏర్పాటుకి సంబంధించి ముందే సమాచారం తెలుసుకున్న కొందరు, అమరావతి ప్రాంతంలో చౌకగా భూములు కొనుగోలు చేశారన్నది ప్రధాన అభియోగం.
దీనిపై సిట్ దర్యాప్తులో భాగంగా నమోదైన ఎఫ్ఐఆర్ విషయం వివాదాస్పదమయ్యింది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ కేసు చెల్లదంటూ మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ సహా పలువురు ఏపీ హైకోర్టులో పిటీషన్ వేశారు.
వాటిని విచారించిన హైకోర్టు ఈ కేసులో విచారణ నిలుపుదల చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. అంతేగాకుండా ఈకేసుకి సంబంధించిన అంశాలను సోషల్ మీడియా సహా ఎక్కడా ప్రస్తావించకూడదని ఆదేశాలు కూడా ఇచ్చింది.
గత ఏడాది సెప్టెంబర్‌లో ఏపీ హైకోర్టు జారీ చేసిన గ్యాగ్ ఉత్తర్వులపై పెద్ద దుమారమే రేగింది.
అప్పట్లో ఏపీ సీఎం నేరుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పలు ఆరోపణలతో కూడిన లేఖలు రాశారు.ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో అప్పీల్ చేసిన ఏపీ ప్రభుత్వం, తన పిటిషన్‌ని ఉపసంహరించుకోవడం ఆసక్తిగా మారింది.
ఏపీ ప్రభుత్వం తరపున అడ్వకేట్ మఫూజ్ నజ్కీ వాదనలు వినిపించారు. ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని కోర్టుకి తెలిపారు.
ఈ కేసు విచారణను నాలుగు వారాల్లో పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సూచించింది.
ఇవి కూడా చదవండి:
- పెగాసస్ స్పైవేర్: ఇప్పటికీ సమాధానాలు దొరకని కీలక ప్రశ్నలు
- ఒకప్పటి భారతదేశానికి ఇప్పటి ఇండియాకు తేడా ఇదే
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- టోక్యో ఒలింపిక్స్: ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఉత్సవం ప్రత్యేకతలేంటి? భారత్ నుంచి ఎవరెవరు వెళ్తున్నారు?
- ప్రమాదం అని తెలిసినా చైనాలో ప్లాస్టిక్ సర్జరీల సంఖ్య ఎందుకు పెరుగుతోంది
- దానిష్ సిద్దిఖీ: పులిట్జర్ ప్రైజ్ అందుకున్న భారత ఫొటో జర్నలిస్ట్ తీసిన మరపురాని ఛాయా చిత్రాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








