సమంత, అక్కినేని నాగ చైతన్య విడాకులు: విడిపోతున్నామని ప్రకటించిన హీరో, హీరోయిన్

ఫొటో సోర్స్, facebook/chay.akkineni
తాము భార్యాభర్తలుగా విడిపోతున్నామని సమంత, అక్కినేని నాగ చైతన్య ప్రకటించారు.
ఈ మేరకు వారిద్దరూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.
2010లో విడుదలైన ‘ఏమాయ చేశావే’ సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించినప్పటి నుంచి వీరి మధ్య పరిచయం పెరిగింది.
2017 అక్టోబర్ 6వ తేదీన గోవాలో వీరు హిందు, క్రైస్తవ మత సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు.
మరో నాలుగు రోజుల్లో నాగచైతన్య-సమంతల నాలుగో వివాహ వార్షికోత్సవం రానుంది. దానికి ముందే వారు తమ విడాకుల ప్రకటన చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
''చాలా చర్చలు, ఆలోచనల తర్వాత సమంత, నేను భార్యాభర్తలుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మా ఇద్దరి మధ్య దశాబ్ద కాల స్నేహబంధం ఉంది. ఇకపై కూడా ఆ స్నేహ బంధం కొనసాగుతుందని మేం ఆశిస్తున్నాం''అని నాగ చైతన్య ట్వీట్‌చేశారు.
''ఈ సంక్షోభ సమయంలో అభిమానులు, శ్రేయోభిలాషులు, మీడియా మాకు అండగా నిలవాలని కోరుతున్నాం. మేం మా జీవితాల్లో ముందుకు వెళ్లేందుకు అవసరమైన ప్రైవసీని మాకు ఇవ్వండి''అని ఆయన అన్నారు.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది, 1
సమంత సైతం ఇదే తరహా పోస్టును ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టారు.
సమంత, చైతన్య విడిపోతున్నారని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. అయితే, వీటిని వీరిద్దరూ ఖండించకపోవడంతో, ఈ వార్తలు మరింత ఎక్కువయ్యాయి.
అక్కినేని నాగార్జున స్పందన..
సమంత, నాగ చైతన్యల విడాకుల ప్రకటనపై నాగచైతన్య తండ్రి, సినీ హీరో అక్కినేని నాగార్జున స్పందించారు.
‘‘బరువైన హృదయంతో చెబుతున్నా.. సమంత, చైతన్య మధ్య ఏం జరిగినప్పటికీ, అది దురదృష్టకరం. ఒక భార్య, భర్త మధ్య ఏం జరిగినా అది చాలా వ్యక్తిగతం. సమంత, చైతన్య ఇద్దరూ నాకు దగ్గరివాళ్లు. సమంతతో గడిపిన క్షణాలను నా కుటుంబం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుంది. ఆమె ఎప్పటికీ మాకు దగ్గరి మనిషే. వాళ్లిద్దరికీ దేవుడు శక్తిని ఇచ్చి ఆశీర్వదించాలి’’ అని నాగార్జున ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

ఫొటో సోర్స్, instagram/samantharuthprabhuoffl
సమంత ఇన్‌స్టా స్టోరీ..
విడాకుల ప్రకటనకు కొన్ని గంటల ముందు సమంత తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ స్టోరీలో ఒక పోస్ట్ చేశారు.
గర్భంతో ఉన్న ఒక మహిళ తన పొట్టపై ప్రేమ సంకేతంగా రెండు చేతులతో హృదయాకారాన్ని చూపించే ఫొటోను ఈ పోస్ట్ కోసం వాడారు. అలాగే ‘మా అమ్మ చెప్పింది’ అనే హ్యాష్ ట్యాగ్‌ను కూడా జత చేశారు.
‘‘నేను నిరాశలో ఉన్నప్పుడు ఒకటి గుర్తు చేసుకుంటాను. అదేంటంటే.. చరిత్రలో నిజం, ప్రేమ ఎల్లప్పుడూ విజయం సాధించాయి. కొంత కాలం పాటు నిరంకుశులు, హంతకులే అజేయులుగా ఉన్నారు. కానీ, చివర్లో మాత్రం వాళ్లు ఎల్లప్పుడూ ఓడిపోయారు. దీని గురించి ఆలోచించు.. ఎప్పుడూ’’ అని ఆ పోస్టులో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, facebook/IamNagarjuna
సమంత ''అక్కినేని'' తొలగించినప్పటి నుంచీ రూమర్స్..
ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల నుంచి తన పేరులో ''అక్కినేని'' ఇంటిపేరును సమంత తొలగించడంతో వీరిద్దరూ విడిపోతున్నారని వార్తలు మొదలయ్యాయి.
అక్టోబరు 6, 2017న గోవాలో వీరు పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో భారీ రిసెప్షన్ కూడా ఏర్పాటుచేశారు.
''ఏ మాయ చేశావే'', ఆటోనగర్ సూర్య, మనం, మజిలీ సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. వీరిద్దరి తొలి సినిమా ఏ మాయ చేశావేతోనే సమంత టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు.
ఇటీవల విడుదలైన నాగ చైతన్య సినిమా ''లవ్ స్టోరీ'' సక్సెస్ మీట్‌లోనూ సమంత కనిపించలేదు. అప్పుడు కూడా ఈ రూమర్స్ బలంగా వినిపించాయి.
వీరిద్దరి మధ్య విభేదాలకు సమంత నటించిన ఒక సిరీస్ కారణమని వార్తలు బలంగా వచ్చాయి. అయితే, ఈ విషయంపై ఇటు సమంత కానీ, ఇటు నాగ చైతన్య కానీ స్పందించలేదు.
విడాకుల రూమర్స్‌పై ప్రశ్నించిన విలేకరిపై మండిపడ్డ సమంత
చైతూ-సమంతలపై వినిపిస్తోన్న రూమర్స్ గురించి ఈ మధ్య తిరుమల గుడి వద్ద ఒక విలేకరి ప్రశ్నించగా.. దానికి ఆమె 'గుడికి వచ్చి.. బుద్ధుందా?'.. అంటూ సమాధానమిచ్చారు.

ఫొటో సోర్స్, facebook/IamNagarjuna
చేసామ్‌గా మొదలై..
నాగ చైతన్య, సమంతలను అభిమానులు ''చేసామ్''అని పిలుస్తుంటారు. వీరి పెళ్లి సమయంలో #ChaySam పేరుతో నెటిజన్లు శుభాకాంక్షలు తెలిపారు.
సరిగ్గా ఏడాది క్రితం తమ పెళ్లిరోజునాడు సమంత ఒక ట్వీట్ చేశారు. ''నువ్వు నా వాడివి. నేను నీ దాన్ని. ఏ మార్గం ఎదురైనా ఇద్దరమూ కలిసే వెళ్దాం. నా భర్తకు పెళ్లి రోజు శుభాకాంక్షలు''అని సమంత పోస్ట్ చేశారు.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది, 2
ఈ ఏడాది జనవరి 11న లవ్‌స్టోరీ టీజర్‌ను కూడా సమంత ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. కానీ, ఈసినిమా ట్రైలర్‌ను పోస్ట్ చేసినప్పుడు హీరోయిన్‌గా నటించిన సాయి పల్లవిని అభినందించిన సమంత.. నాగ చైతన్యను అభినందించకపోవడం కూడా రూమర్లు బలపడటానికి కారణమైంది.
ఫిబ్రవరి 14న కూడా ''నువ్వు దొరకడం నా అదృష్టం''అని ఆమె పోస్ట్ పెట్టారు.
జులై 9న బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్‌తో నాగ చైతన్య కలిసివున్న ఫోటోను సమంత షేర్ చేశారు. ఆ తర్వాత సమంత అకౌంట్‌లో నాగ చైతన్య ఫోటోలతో కొత్త పోస్టులేమీ రాలేదు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
''పెళ్లి తర్వాత పిల్లల గురించి అడిగే వారికి నా సమాధానం ఏంటంటే..'' - సమంత
2019లో ''ఓ బేబీ'' సినిమా విడుదల సందర్భంగా బీబీసీ తెలుగుతో సమంత మాట్లాడారు. పెళ్లి అయిన తర్వాత సినిమాలు ఎందుకు మానేస్తున్నారు? పిల్లల్ని ఎప్పుడు కంటారు? లాంటి ప్రశ్నలు ఎదురయ్యేటప్పుడు సమంత ఎలా స్పందిస్తారు? అని బీబీసీ ప్రశ్నించింది.
''నేను కష్టపడి పనిచేయాలని అనుకుంటున్నాను. మన సక్సెస్ వారికి సమాధానం చెబుతుంది. అప్పుడు పెళ్లి అయినా, కాకపోయినా ఎవరూ పట్టించుకోరు. మనం మంచి రోల్స్ చేయాలి. బాగా కష్టపడాలి. అప్పుడే అందరూ గుర్తుపెట్టుకుంటారు. లేకపోతే, ఫేడ్ అవుట్ అయిపోందని అంటారు''అని సమంత అన్నారు.
''అవకాశాల కోసం మనం ఎదురుచూడకూడదు. మన మార్గాన్ని మనమే ఎంచుకోవాలి. ఇంట్లో కూర్చుని నాకు ఏమీ రావడం లేదు. నాకు సినిమా అవకాశాలు ఇవ్వడం లేదు. అనుకోకూడదు. మనం కష్టపడాలి. మన కథను మనమే సిద్ధంచేసుకోవాలి''అని సమంత అన్నారు.
తనపై వచ్చే ట్రోలింగ్‌పై స్పందిస్తూ... ''ఇప్పుడు అలవాటైపోయింది. టైమ్ అన్నీ నేర్పిస్తుంది''అని ఆమె వివరించారు.
ఇవి కూడా చదవండి:
- సమంత పెళ్లి: సోషల్ టాపిక్
- పవన్ కళ్యాణ్: ‘పవర్ వచ్చాకే పవర్ స్టార్ అని పిలవండి.. అప్పటి వరకూ అలా పిలవొద్దు’
- కోట్ల సంపదను వదులుకుని సామాన్యుడిని పెళ్లి చేసుకుంటున్న జపాన్ రాకుమారి, అక్టోబరు 26న వివాహం
- అడాల్ఫ్ హిట్లర్: ఆర్యుల మూలాలు కనుక్కోవాలని పరిశోధకులను హిమాలయాలకు పంపినప్పుడు ఏమైంది?
- భారత్ ప్రతిచర్య: బ్రిటిష్ ప్రయాణికులకు 10 రోజుల క్వారంటీన్
- మహాత్మా గాంధీకి పొందూరు ఖాదీ వస్త్రాలకు ఉన్న అనుబంధం ఎలాంటిది?
- గర్భస్రావం చేయించుకునే హక్కు విషయంలో అమెరికా కంటే భారత్ మెరుగ్గా ఉందా?
- ఈ ముస్లిం యువతి బాలకృష్ణుడి పెయింటింగ్స్ వేసి హిందూ ఆలయాలకు కానుకగా ఇస్తున్నారు
- శ్రీలంక: రాగి శాసనాలలో కనిపించిన తెలుగు భాష-అక్కడ ఒకప్పుడు మాతృభాషగా విలసిల్లిందా?
- ఎయిర్ ఫోర్స్ మహిళా అధికారికి 'టూ ఫింగర్ టెస్ట్’
- హిమాలయాలలో పర్వతారోహణకు వెళ్లిన అయిదుగురు నేవీ సిబ్బంది గల్లంతు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














