పెళ్లయ్యాక సంతోషం ఎన్నాళ్లు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మార్థ హెన్రిక్స్
- హోదా, బీబీసీ ఫ్యూచర్
జీవితాన్ని ఇంకొకరితో పంచుకోవాలని అనిపించే మలుపులో మీరు నిలిచి ఉన్నట్లయితే, కింద ఇచ్చిన ప్రశ్నలతో మీకు సంబంధం ఉండే ఉంటుంది.
ఆన్‌లైన్ డేటింగ్ యాప్ మిమ్మల్ని మరింత ఆకర్షిస్తోందా?
మీ భాగస్వామికి అనుగుణంగా ఉంటే మీకు బాగానే అనిపిస్తుందా?
పెళ్లైన వాళ్లే ఎక్కువ సంతోషంగా ఉంటారా?
జీవితాంతం ఒకే భాగస్వామికి తోడుగా నిలుస్తానని మాట ఇవ్వడం మీకు బాగానే ఉంటుందా?
ఈ ప్రశ్నల సమాధానాలు మీకు షాక్ ఇవ్వవచ్చు.
ఒక రీసెర్చ్ ఆధారంగా బీబీసీ ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నం చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
'నా టైప్' అబ్బాయి లేదా అమ్మాయి
డిజిటల్ ప్రపంచంలో ఆన్‌లైన్ డేటింగ్ చాలా వేగంగా వ్యాపిస్తోంది.
ఇప్పుడు జనం ఇంటర్నెట్‌లో పార్టనర్ కోసం వెతుక్కోవడం మామూలైపోయింది.
కానీ, లక్షల మందిలో స్వయంగా మీ వ్యక్తిత్వమే మిమ్మల్ని భయపెట్టేలా ఉండచ్చు. కానీ, అంతమాత్రాన దిగులుపడాల్సిన పనిలేదు.
మీరెప్పుడైనా ఏదైనా ఒక కొత్త ఫొటో చూస్తే, అది అంతకు ముందు చూసిన దానికంటే బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది.
అంటే, అందం గురించి మన ఆలోచనలు పుట్టుకతో రాలేదు, ఆ సమయానికి తగ్గట్టు ఉంటాయి.
డేటింగ్ యాప్‌లో ప్రతి క్షణం మారే ఫొటోలను బట్టి మన అందం ప్రమాణాలు మారిపోతూ ఉంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
అంటే, మీకు చాలా అందంగా ఉండే ఒక ప్రొఫైల్ చూసి మనం అంత అందంగా ఎందుకు లేమో, అనిపిస్తుంటే, దాన్ని మనసులోంచి తీసేయండి. ఆ భావన తాత్కాలికమే, శాశ్వతం కాదు.
చాలామందికి చిటికెలో ఏదో ఒక ఫొటో నచ్చచ్చు. అంటే ఆ అవకాశం హఠాత్తుగా మీకోసం రావచ్చు.
మనం ఏ ముఖాలను వీలైనంత తక్కువగా చూస్తుంటామో, వాళ్లే మనకు చాలా ఆకర్షణీయంగా ఉన్నట్టు కనిపిస్తారు.
"మనం ఒక ముఖాన్ని యథాలాపంగా చూసి ముందుకు నడిచేస్తుంటాం, కానీ అదే ముఖాన్ని మళ్లీ మళ్లీ చూడాలని కొన్నిసార్లు మనసు లాగుతుంది" అని మానసిక నిపుణులు చెబుతున్నారు.
దాని వెనక ఒక సైకాలజీ ఉంది. ఎక్కడో ఒక దగ్గర మనకు భాగస్వామి కావల్సినవారిని మిస్ అవుతున్నామని మనం అనుకోవాలి.

ఫొటో సోర్స్, Getty Images
వ్యక్తికి విపరీత పోకడలు ఉంటే?
కొందరికి కొన్ని ప్రత్యేక అలవాట్లు ఉంటాయి. అవి భాగస్వాములిద్దరికీ ఉంటే మంచిదే. కానీ మీ ఆలోచన మీ భాగస్వామికి చాలా అసహజంగా అనిపిస్తే అది సరికాదు. అది తప్పు అవుతుంది.
అయినా, ఊరికే చిర్రుబుర్రులాడే స్వభావం ఎవరికీ నచ్చదు. ఎవరైనా ఒక హామీ ఇవ్వడానికి అరక్షణం కూడా ఆలస్యం చేయకపోతే, అలాంటి వారిపై మీరు నమ్మకం పెట్టుకోవచ్చు.
ఎక్కువ ఆందోళన పడేవారు, తమను ఎక్కడ పక్కన పెట్టేస్తారో అనే భయంతో ఉంటారు. అలాంటి వాళ్లకు తమలాంటి వ్యక్తిత్వం ఉన్న భాగస్వామి దొరికితే, వారికి ఒక ప్రశాంతత దొరుకుతుంది.
రాత్రి ఆలస్యంగా పడుకోవడం, ఉదయం త్వరగా లేవడం లాంటి అలవాట్లు భాగస్వాములిద్దరికీ ఉంటే అది కూడా సంతోషించాల్సిన విషయమే. దానివల్ల ఎక్కువ సేపు ఇద్దరూ కలిసి గడపడానికి సమయం దొరుకుతుంది.
దానివల్ల సమస్యలు కూడా రావచ్చు. ఎవరైనా పని కోసం కాస్త ఎక్కువ సమయం గడిపే వారైతే, భాగస్వామి కూడా అలాంటి వారే అయితే.. ఇద్దరి బంధం బెడిసికొట్టచ్చు.
ఇక ఇద్దరిలో ఒక భాగస్వామి నిర్లక్ష్యంగా ఉంటే అది వారి బంధంలో మరింత చిచ్చు పెడుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
పెళ్లితో సంతోషం పెరుగుతుంది, కానీ...
మీకు, మీ భాగస్వామికి ఒకే స్వభావం ఉంటుంది. మీరు పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ దానికి, మీ సంతోషానికి సంబంధం ఏముంది?
పెళ్లి చేసుకోవడం వల్ల మన పాత్రల్లో శాశ్వత మార్పులు వస్తాయి. అది పరిశోధనలో నిరూపితమైంది. జర్మనీలో జరిగిన రీసెర్చ్‌లో పెళ్లైన తర్వాత వ్యక్తులు ఓపెన్‌గా ఉండడం, బయట ఎక్కువగా తిరగడం లాంటివి తగ్గిపోయాయని తేలింది. పెళ్లైనవారి మధ్య ఇలాంటివి తరచూ కనిపిస్తాయి.
అవును, పెళ్లి తర్వాత చాలామంది మనసులో ఏదీ దాచుకోరు. తమను తాము నియంత్రించుకోవడం కూడా నేర్చుకుంటారు. ఒక బలమైన బంధాన్ని సుదీర్ఘ కాలం పాటు ఏర్పరచుకోడానికి ఇలాంటివి చాలా అవసరమే.
పెళ్లి తర్వాత కొన్నేళ్ల వరకూ దంపతులు సుఖంగా, సంతోషంగా కనిపిస్తారు. కానీ ఆ భావన శాశ్వతం కాదు.
పెళ్లైన కొన్నేళ్ల తర్వాత వాళ్లు మళ్లీ పెళ్లికి ముందున్న పరిస్థితికి చేరుకుంటారు.
అంటే పెళ్లి వల్ల శాశ్వత సంతోషం దొరకదు.

ఫొటో సోర్స్, Getty Images
భాగస్వామి నుంచి విడిపోయి ఒంటరి అయితే
పెళ్లితో సంతృప్తి చెందేవాళ్లు, తర్వాత ఒంటరితనానికి గురైనప్పుడు వారిలో చాలా మార్పులు కనిపిస్తాయి. విడాకుల తర్వాత మహిళల స్వభావం ఓపెన్‌గా మారుతుంది.
అదే, పురుషుల్లో ఒంటరితనాన్ని తట్టుకోవడం చాలా కష్టంగా మారుతుంది. అందుకే వాళ్లు ఎక్కువగా కుంగిపోతారు.
విడాకుల తర్వాత మహిళల్లో అయినా, పురుషుల్లో అయినా అవతలివారిపై నమ్మకం సన్నగిల్లుతుంది.
భాగస్వామితో విడిపోయిన తర్వాత మీకు మీరు ఎలా ఉంటారు అనేది మీ వ్యక్తిత్వంపై ఆధారపడి ఉంటుంది. ఎవరైతే బహిర్ముఖంగా ఉంటారో వాళ్లు వెంటనే రెండో పెళ్లి కూడా చేసుకుంటారు.
కానీ ఒంటరితనంతో కుంగిపోయిన వారు విడాకుల తర్వాత చాలా మందితో ఒక నియమిత కాలం పాటు బంధం ఏర్పరుచుకుంటారు. అంటే శాశ్వత సంబంధం ఏర్పరుచుకోవడం అనేది వారికి ఇబ్బందిగా ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
రొమాన్స్ నిండిన భవిష్యత్తు
సమాజంలో ఒకే భాగస్వామితో జీవితం గడపడాన్ని ఆదర్శంగా భావిస్తారు. కానీ, ఈరోజుల్లో ఒకేసారి ఎక్కువ మందితో సంబంధాలు నెరపడం ట్రెండ్ అయిపోయింది.
అది ద్రోహమేం కాదు. ఏదైనా ఒక బంధంలో ఉన్న వారు పరస్పర సమ్మతితో ఒకరికంటే ఎక్కువ మంది భాగస్వాములతో సంబంధాలు ఏర్పరుచుకోవడంలో నేరం లేదని.. కొందరు నిపుణులు చెబుతున్నారు.
ప్రేమకు అతీతంగా ఇలాంటి బంధంలో ఉండే వారి మధ్య స్నేహం బలంగా ఉంటుంది. అంటే అలాంటి వారి మధ్య చాలా సురక్షితమైన సెక్స్ ఉంటుంది అని ఈ పరిశోధనలో తేలింది.
కానీ, మీకు ఒకేసారి ఎక్కువమందితో బంధం లేదంటే, నిరాశపడాల్సిన అవసరం లేదు. అంటే మీరు ఏదో మిస్ అవుతున్నట్టేం కాదు. ఒకేసారి చాలా రొమాంటిక్ సంబంధాలు పెట్టుకునేవారి వ్యక్తిత్వం ఎక్కువగా ఓపెన్‌గా ఉంటుంది.
ఒకే భాగస్వామికి తమ జీవితాన్ని సమర్పించిన వారికి కూడా ఎలాంటి నష్టం జరగదు. ఒకే భాగస్వామికి అంకితం కావడం కూడా మీకు అంతే సంతోషం అందిస్తుంది.
ఇవి కూడా చదవండి:
- మైనస్ 60 డిగ్రీల చలిలో ప్రజలు ఎలా జీవిస్తారో తెలుసా!!
- భారత నోట్లను నేపాల్ ఎందుకు నిషేధించింది?
- భారత్‌లో పెరుగుతున్న పోర్న్ వీక్షణ
- సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్: 13 ఏళ్లు గడిచినా ఇంకా కేసు చిక్కు ముడి వీడలేదు
- కేసీఆర్ ప్రధాని అవుతారా?
- టీఆర్ఎస్ ప్రస్థానం: పోరు నుంచి పాలన వరకు కారు జోరు
- తుపాను వచ్చినపుడు ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








