ఎసెక్సువాలిటీ: శృంగారంపై ఆసక్తి లేకపోవడం సమస్యేనా
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
కొందరికి శృంగారం అంటే ఏమాత్రం ఆసక్తి ఉండదు. అదేం వ్యాధి కాదు. అది కూడా ఒక విధమైన లైంగికతే.
దాన్ని 'ఎసెక్సువాలిటీ'(అలైంగికత) అంటారు. శృంగారం అంటే ఆసక్తి లేని వాళ్లను ఎసెక్సువల్ అంటారు.
హార్మోన్లలో అసమతుల్యత, థైరాయిడ్, మధుమేహం లాంటి జీవనశైలి సమస్యల కారణంగా శృంగారం అంటే ఆసక్తి తగ్గిపోవచ్చు.
అలైంగికత అనేది పూర్తిగా సహజమైన విషయమని వైద్యులు చెబుతారు.
ఇది అనారోగ్యమో, సమస్యో కాదని అందరూ గుర్తించాలి. లైంగికత లేని వ్యక్తులను కించపరచడం సరికాదు.
వాళ్లను తక్కువగా, వింతగా చూడాల్సిన పని లేదు. పెళ్లి చేసుకోమనో లేక లైంగిక సంబంధాలను ఏర్పాటు చేసుకోమనో వారిపై ఒత్తిడి చేయకూడదు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




