జెఫ్‌బేజోస్: ప్రపంచ అత్యంత సంపన్నుడు ఎందుకు విడాకులు తీసుకుంటున్నాడు?

ఫొటో సోర్స్, Reuters
అమెజాన్ కంపెనీ సీఈఓ జెఫ్ బేజోస్, ఆయన భార్య మెకెంజీ బేజోస్ పరస్పరం విడాకులు తీసుకోబోతున్నారు. ఇద్దరి వివాహం జరిగి 25 ఏళ్లు పూర్తైంది.
ఇద్దరూ ట్విటర్‌లో తమ విడాకులకు సంబంధించి ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
ఈ ప్రకటనలో "చాలా కాలం నుంచీ ఇద్దరం ప్రేమగా కలిసున్నాం, తర్వాత కొంత కాలంగా మా మధ్య దూరం పెరిగినట్లు తెలిసింది. దాంతో మేం విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఇక మేం ఇద్దరం మంచి స్నేహితులుగా ఉండిపోతాం" అని తెలిపారు.
అమెజాన్ కంపెనీ ఇటీవలే ఒక అద్భుత ఘనతను సొంతం చేసుకుంది. మైక్రోసాఫ్ట్‌ను వెనక్కు నెట్టి ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ విలువ ఉన్న కంపెనీగా ఆవిర్భవించింది.
54 ఏళ్ల జెఫ్ 25 ఏళ్ల క్రితం అమెజాన్ కంపెనీ ప్రారంభించారు. బ్లూంబర్గ్‌లోని సంపన్నుల జాబితాలో జెఫ్ అత్యంత అగ్రస్థానంలో ఉన్నారు.
ఆయన మొత్తం సంపద విలువ 137 బిలియన్ డాలర్లని చెబుతుతున్నారు.
ఇది బిల్ గేట్స్ కంటే దాదాపు 45 బిలియన్ డాలర్లు ఎక్కువ.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఇద్దరి సంయుక్త విడాకుల ప్రకటన
48 ఏళ్ల మెకెంజీ ఒక రచయిత్రి. ఆమె రెండు పుస్తకాలు రాశారు. 2005లో ద టెస్టింగ్ ఆఫ్ లూథర్, 2013లో ట్రాప్స్ పుస్తకాలు విడుదలయ్యాయి.
ఈ జంట తమ ప్రకటనలో "మాకు ఒకరికొకరు తోడుగా లభించడం మా అదృష్టం. పెళ్లి తర్వాత ఇన్నేళ్లు కలిసి గడిపినందుకు మేం పరస్పరం మనస్ఫూర్తిగా రుణపడి ఉంటాం" అన్నారు.
"మేం కలిసి ఒక అద్భుతమైన జీవితాన్ని గడిపాం. వివాహిత జంటగా మా భవిష్యత్ కలలను పంచుకున్నాం. మంచి తల్లిదండ్రులుగా స్నేహితులుగా, భాగస్వాములుగా మా పాత్రలు పోషించాం. ఎన్నో ప్రాజెక్టులపై కలిసి పనిచేశాం. అందులో చాలా ఆనందాన్ని ఆస్వాదించాం".
"ఇప్పుడు మా బంధం పేరు మారిపోతుండచ్చు. కానీ మేం ఒకే కుటుంబంగా ఉంటాం. మేం చాలా మంచి స్నేహితులుగా కలిసే ఉంటాం" అన్నారు.
గత ఏడాది ఈ జంట ద డే వన్ అనే ఒక చారిటీ కార్యక్రమం ప్రారంభించింది. నిరాశ్రయులైన కుటుంబాలకు అండగా ఉండడం, పేద పిల్లల కోసం స్కూళ్లు నిర్మించడమే ఈ కార్యక్రమం లక్ష్యం.

ఫొటో సోర్స్, Getty Images
అతిపెద్ద ఈ-కామర్స్ కంపెనీ
జెఫ్, మెకెంజీలకు నలుగురు పిల్లలు, ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయిని దత్తత తీసుకున్నారు.
ఒక ఉద్యోగం ఇంటర్వ్యూ సమయంలో జెఫ్ తనను కలిశారని మెకెంజీ 2013లో వోగ్ పత్రికకు చెప్పారు. అప్పుడు జెఫ్ తనను ఇంటర్వ్యూ చేస్తున్నారని తెలిపారు.
మూడు నెలల ప్రేమ తర్వాత ఇద్దరూ 1993లో వివాహం చేసుకున్నారు.
ఆ తర్వాత ఒక సంవత్సరానికి జెఫ్ అమెజాన్ కంపెనీని ప్రారంభించారు. ఆ సమయంలో అమెజాన్ ద్వారా పుస్తకాలు మాత్రమే ఆన్‌లైన్లో అమ్మేవారు
మెల్లమెల్లగా కంపెనీని విస్తరింంచారు. ఇది ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద ఈ-కామర్స్ కంపెనీగా ఆవిర్భవించింది.
ఈ వారం సోమవారం అమెరికా స్టాక్ మార్కెట్ మూతపడ్డప్పుడు అమెజాన్ మొత్తం విలువ 797 బిలియన్ డాలర్లు. అదే సమయంలో మైక్రోసాఫ్ట్ విలువ 789 బిలియన్ డాలర్లు.
ఇవి కూడా చదవండి:
- ‘రెచ్చగొట్టే డ్రెస్ వేసుకుని వేశ్యాలోలత్వాన్ని ప్రేరేపించార’ని నటిపై కేసు
- పెట్రో మంటలు ఇప్పట్లో చల్లారవు
- సౌదీలో తొలిసారి: స్టేడియాల్లోకి మహిళలు
- నిజంగానే భారత్ మహిళలకు అత్యంత ప్రమాదకర దేశమా? రాయిటర్స్ నివేదికలో వాస్తవమెంత?
- కాఫీ పైన సెల్ఫీ... మీకూ కావాలా?
- మళ్లీ ఫైవ్ స్టార్ హోటల్‌గా మారనున్న జైలు
- మహాత్మా గాంధీకి నోబెల్ శాంతి పురస్కారం ఎందుకు రాలేదు?
- భారత్‌లో పెరుగుతున్న పోర్న్ వీక్షణ
- చైనా నుంచి టీ రహస్యాన్ని ఆంగ్లేయులు ఎలా దొంగిలించారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








