హిమాలయాలలో పర్వతారోహణకు వెళ్లిన అయిదుగురు నేవీ సిబ్బంది గల్లంతు, దొరకని ఆచూకీ - Newsreel

త్రిశూల పర్వత శిఖరం

ఫొటో సోర్స్, Getty Images

హిమాలయాల్లోని త్రిశూల పర్వతాల అధిరోహణకు వెళ్లి భారీ హిమపాతంలో చిక్కుకుపోయిన ఇండియన్ నేవీకి చెందిన అయిదుగురి కోసం గాలింపు, సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.

ఇండియన్ నేవీకి చెందిన 20 మంది బృందం త్రిశూల పర్వతాల అధిరోహణకు ముంబయి నుంచి సెప్టెంబర్ 3న బయలుదేరింది.

ఒక పర్వత శిఖరాగ్రానికి చేరేందుకు వీరిలో 10 మంది బృందం శుక్రవారం(అక్టోబర్ 1) ముందుకు కదిలింది.

శిఖరాగ్రానికి అత్యంత సమీపంలో వారు భారీ హిమపాతంలో చిక్కుకుపోయారు.

ఆ పదిమందిలో అయిదుగురిని కాపాడగలిగారు. మిగతా అయిదుగురి కోసం గాలింపు, సహాయక చర్యలు చేపట్టారు.

భారత సైన్యం, భారత వాయు సేన, ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాల సహాయంతో ఇండియన్ నేవీ ఈ గాలింపు, సహాయ చర్యలు చేపట్టింది.

ఎయిర్ ఇండియా విమానం

ఫొటో సోర్స్, NurPhoto

ఎయిర్ ఇండియా పెట్టుబడుల ఉపసంహరణపై వార్తలు నిజం కాదు: కేంద్రం

ఎయిర్ ఇండియా పెట్టుబడుల ఉపసంహరణపై మీడియాలో ప్రచురితమైన వార్తల్లో నిజం లేదని ప్రభుత్వం చెప్పింది.

దేశంలోని ఒక పెద్ద పారిశ్రామిక గ్రూప్‌కు ఎయిర్ ఇండియా నియంత్రణను అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందంటూ కొన్ని వర్గాల ద్వారా తమకు సమాచారం అందిందని చాలా మీడియా వెబ్‌సైట్లు రాశాయి.

"అధికారుల ఒక ప్యానల్ ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసే కంపెనీని ఎంపిక చేసింది. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే మంత్రి మండలి దీనికి ఆమోద ముద్ర వేయడమే మిగిలింది" అని కొన్ని మీడియా వెబ్ సైట్లలో వార్తలు వచ్చాయి.

కానీ, ప్రభుత్వం ఈ వార్తపై వివరణ ఇచ్చింది. ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ సెక్రటరీ దీనిపై ఒక ట్వీట్ చేశారు.

"ఎయిర్ ఇండియా ఫైనాన్షియల్ బిడ్‌కు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అవి తప్పు. ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకున్నప్పుడు మీడియాకు సమాచారం అందిస్తాం" అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)