కరోనావైరస్ లాక్‌డౌన్: టాప్‌లో ట్రెండవుతున్న ఆసియా వెదురు చిగురు వంటలు

వెదురు చిగురు వంటలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జస్టిన్ హార్పర్
    • హోదా, బీబీసీ న్యూస్

వెదురు చిగురు.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా టాప్ ట్రెండ్‌లో ఉన్న వంటకం ఇది. ఆసియావాసులు కరోనావైరస్ లాక్‌డౌన్ సమయంలో వంటగదుల్లో చేయితిప్పుతుండటంతో ఈ వంటకం ట్రెండ్‌గా మారింది.

మొత్తంగా చూస్తే అత్యధికంగా సెర్చ్ చేసిన వంటకం బనానా బ్రెడ్ – అంటే అరటి రొట్టె. అయితే గత నెలలో బాంబూ షూట్స్ – వెదురు చిగురు వంటకాల కోసం సెర్చ్ విపరీతంగా పెరిగిపోయింది.

ఏకంగా 4,850 శాతం పెరగటం చూస్తే ఈ సంప్రదాయ ఇంటి వంట ఆసియాలో ఎంత పాపులర్ అయిందో అర్థమవుతుంది.

వంటకాలు, వంట సంబంధిత సెర్చ్‌లలో ఆసియా ప్రాంత దేశాలే అగ్ర స్థానంలో ఉన్నాయని గూగుల్ చెప్తోంది.

వెదురు చిగుళ్లను ఆరంగుళాల పొడవున్నపుడు తెంపుతారు. వాటికి ఓ మృదువైన వాసన ఉంటుంది. కాస్త కరకరలాడుతుంటాయి కూడా. సూప్‌లు, వేపుళ్లకు వీటిని జతచేస్తారు.

జనం బాగా ఇష్టపడే వంటకాల్లో పుట్టగొడుగులు - వెదురు చిగుళ్ల వేపుడు; పోర్క్ (పంది మాంసం) – వెదురు చిగుళ్లు; రామెన్ (జపనీస్ నూడుల్స్ వంటకం) ఉన్నాయి.

వెదురు చిగురు వంటలు

ఫొటో సోర్స్, COOKING WITH SROS

‘‘వెదురు చిగుళ్లంటే నాకు చాలా ఇష్టం. రామెన్‌తో కలిపి వాటిని చాలా ఎక్కువగా తింటాను’’ అని సింగపూర్‌కు చెందిన ఫుడ్ బ్లాగర్ లెస్లీ కోమ్ చెప్పారు.

‘‘ఇప్పుడు నైట్ మార్కెట్లలో ఫుడ్ స్టాల్స్ ఏమీ లేవు. కాబట్టి కంఫర్ట్ డిషెస్ – అంటే ఉపశమనాన్నిచ్చే వంటకాలను తయారు చేయటం చెబుతూ ఆన్‌లైన్‌లో చాలా సమయం గడుపుతుంటాను’’ అని ఆమె తెలిపారు.

వెదురు చిగుళ్లను వండటం కూడా చాలా సులభం. కాబట్టి పెద్దగా వంట తెలియని వాళ్లకు వీటితో వంటలు చేయటం తేలికవుతుంది.

పోస్ట్‌ Facebook స్కిప్ చేయండి

కంటెంట్ అందుబాటులో లేదు

మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Facebook ముగిసింది

సామాజిక దూరం నిబంధనలు విస్తృతంగా అమలులో ఉండటంతో కోట్లాది మంది ఇళ్లకే పరిమితమయ్యారు. సినిమాలు చూడటానికి, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవటానికి, సమావేశాలు జరుపుకోవటానికి, కొత్త వంటకాల ప్రయోగాలు చేయటానికి ఆన్‌లైన్‌లోకి వెళ్తున్నారు.

యూట్యూబ్‌లో వంట ట్యుటోరియల్స్‌ను వీక్షించటంలో ఆసియా ప్రథమ స్థానంలో ఉంది.

వంటకాల వీడియోల కోసం యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తున్న ఐదు టాప్ దేశాల్లో నాలుగు దేశాలు – శ్రీలంక, ఇండొనేసియా, సింగపూర్, బంగ్లాదేశ్‌లు – ఆసియా దేశాలే.

బనానా బ్రెడ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బనానా బ్రెడ్

ఈ గణాంకాలు గత 30 రోజుల సెర్చ్ హిస్టరీకి సంబంధించిన గూగుల్ ట్రెండ్స్‌లో అందుబాటులో ఉన్నాయి.

టాప్ ట్రెండింగ్ వంటకాలు:

  • వెదురు చిగుళ్ల వంటకాలు
  • బ్రెడ్ తయారీ వంటకాలు
  • ఈస్టర్ కేక్ వంటకాలు
  • మాపో టోఫు వంటకాలు
పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

‘ఇంటి వంట’ వంటకాల ట్రెండింగ్‌లోనూ ఆసియా వంటలదే పైచేయిగా ఉంది. ‘హోం మేడ్ మోమోస్’, ‘హోం మేడ్ ఎగ్ రోల్స్’, ‘హోం మేడ్ పానీ పూరీ’ కోసం సెర్చ్ గత నెల రోజుల్లో 5,000 శాతం పెరిగింది.

ఈ ట్రెండ్ చూస్తే సులభంగా ఇంట్లో వండుకుని, కాస్త ఆకలి నుంచి ఉపశమనం కలిగించే వంటకాల కోసం సెర్చ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

‘‘ఇతర ప్రాంతాల వారికన్నా ఆసియా-పసిఫిక్ ప్రాంత ప్రజలు రుచికరమైన వంటకాలను వెతికి పట్టుకోవడం కోసం మరింత ఎక్కువగా ఆన్‌లైన్‌లో వెదుకుతున్నారు. గత నెలలో ఈ సెర్చ్‌లో అగ్రస్థానంలో ఉన్న నాలుగు ప్రాంతాలు ఆసియాలోనివే. అదే సమయంలో ఆసియా వంటకాల మీద అంతర్జాతీయంగా కూడా ఆసక్తి పెరుగుతోంది’’ అని గూగుల్ ఆసియా – పసిఫిక్ సెర్చ్ కమ్యూనికేషన్స్ మేనేజర్ డ్యూసన్ ఫారింగ్టన్ పేర్కొన్నారు.

క్యారట్ కేక్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, క్యారట్ కేక్

అత్యధికంగా సెర్చ్ చేసిన వంటకాలు:

  • బనానా బ్రెడ్
  • పాన్‌కేక్
  • పిజ్జా డో
  • బ్రౌనీ
  • క్యారట్ కేక్

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)