ఆర్యన్ ఖాన్‌: డ్రగ్స్ కేసులో షారుఖ్ ఖాన్ కుమారుడికి బెయిల్ నిరాకరణ

ఆర్యన్ ఖాన్

ఫొటో సోర్స్, Instagram

షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు కోర్టు బెయిల్ నిరాకరించింది.

డ్రగ్స్ కేసులో అరెస్టైన ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం పెట్టుకున్న దరఖాస్తును బుధవరాం ముంబయి ప్రత్యేక కోర్టు విచారించింది.

ఆర్యన్‌తో పాటు అర్బాజ్ మర్చంట్, మున్‌మున్ ధమీచాకు కూడా బెయిల్ ఇచ్చేందుకు కోర్టు అంగీకరించలేదు.

బెయిల్ ఇస్తే దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కోర్టుకు చెప్పడంతో కోర్టు బెయిల్ నిరాకరించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

సముద్రంలో డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న షారుఖ్ ఖాన్ కుమారుడిని ఎలా పట్టుకున్నారంటే..

ముంబయిలోని ఒక క్రూయిజ్ షిప్‌లో శనివారం (అక్టోబర్ 2వ తేదీ) అర్థరాత్రి జరిగిన పార్టీపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు దాడి చేశారు.

ఆ షిప్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతోందన్న సమాచారం తమకు అందిందని ఎన్‌సీబీ అధికారులు తెలిపారు.

ఈ దాడిలో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు.

బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఆ ఎనిమిది మందిలో ఉన్నట్లు ఎన్‌సీబీ ముంబయి డైరెక్టర్ సమీర్ వాంఖడే తెలిపారు.

అర్యన్ ఖాన్‌తో పాటు అరెస్ట్ అయిన వారిలో అర్బాజ్ మర్చంట్, మూన్‌మూన్ ధమేచా, నూపూర్ సారిక, ఇస్మిత్ సింగ్, మోహక్ జైస్వాల్, విక్రాంత్ చోకర్, గోమిత్ చోప్రాలు ఉన్నారని ఎన్‌సీబీ ప్రకటించింది.

ఈ కేసులో దర్యాప్తు జరుగుతోందని, ఇందులో ఎవరెవరి హస్తం ఉందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ఎంతటి వారైనా సరే.. నిష్పాక్షికంగా దర్యాప్తు చేస్తాం - ఎన్‌సీబీ చీఫ్

ముంబయి క్రూయిజ్ షిప్ రేవ్ పార్టీలో అదుపులోకి తీసుకున్న వ్యక్తులను విచారిస్తున్నట్లు ఎన్‌సీబీ ప్రకటించింది.

ఈ డ్రగ్స్ కేసులో న్యాయబద్ధంగా, నిష్పాక్షికంగా దర్యాప్తు చేస్తామని ఎన్‌సీబీ చీఫ్ ఎస్ఎన్ ప్రధాన్ తెలిపారు.

"ఈ కేసులో మేం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నాం. దీని వెనుక బాలీవుడ్ ప్రముఖులు, ధనవంతుల కనెక్షన్లు ఉన్నా లెక్క చేయం. మేం చట్టప్రకారం నడుచుకుంటాం"అని ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ ప్రధాన్ స్పష్టం చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

ఆర్యన్ ఖాన్

ఫొటో సోర్స్, Instagram

ఏం జరిగింది?

ముంబయి నుంచి గోవా వెళుతున్న ఒక క్రూయిజ్ షిప్‌లో రేవ్ పార్టీ జరుగుతున్నట్లు ముంబయి డ్రగ్ కంట్రోల్ స్క్వాడ్‌కు సమాచారం అందింది.

ఈ క్రూయిజ్ షిప్పు సోమవారం ముంబయికి తిరిగి రావలసి ఉంది.

ఎన్‌సీబీ అధికారులు పర్యటకులుగా ఓడలోకి ప్రవేశించారు. ఓడ ప్రయాణం ప్రారంభించగానే నిందితులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే ఆదివారం ఉదయం ఈ వార్తను మీడియాకు తెలియజేశారు.

ఈ క్రూయిజ్ సర్వీస్ కొద్దిరోజుల క్రితమే ప్రారంభమైందని, ఇందులో జరిగే పార్టీ టికెట్ ధర 80,000 రూపాయలు ఉంటుందని కొన్ని మీడియా రిపోర్టులు తెలిపాయి.

అయితే, ఈ డ్రగ్స్ కేసు, అరెస్టులపై పలువురు స్పందిస్తున్నారు.

‘‘ఈ మధ్య గుజరాత్‌లో దొరికిన డ్రగ్స్ ఏమయ్యాయి?’’ అని మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ, అధికార ప్రతినిధి అతుల్ లోంధే ప్రశ్నించారు.

పెద్ద సంఘటన నుంచి దృష్టి మళ్లించడానికి ఇలాంటి చిన్నచిన్న అరెస్టులు, దర్యాప్తులు చేయట్లేదు కదా? అని ఆయన పేర్కొన్నారు.

ఆర్యన్ ఖాన్ వద్ద దొరికిన డ్రగ్స్

ఆర్యన్ ఖాన్ దగ్గర దొరికిన డ్రగ్స్ ఇవే..

ముంబయి క్రూయిజ్ రేవ్ పార్టీలో ఆర్యన్ ఖాన్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఎన్‌సీబీ ప్రకటించింది.

వీరి వద్ద 13 గ్రాముల కొకైన్, 5 గ్రాముల ఎండీ, 21 గ్రాముల చరస్, 22 ఎండీఎంఏ మాత్రలు లభించాయని పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)