కోవిన్ కొత్త ఏపీఐ: వ్యాక్సీన్ వేసుకున్నామని అబద్ధం చెబితే దొరికిపోతారు.. కేవైసీ వీఎస్ ప్రవేశపెట్టిన కేంద్రం

ఫొటో సోర్స్, EPA
కోవిన్ కొత్త ఏపీఐ(అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ ఫేస్)ను ప్రవేశపెట్టింది.
దీనిని కేవైసీ-వీఎస్ (కస్టమర్స్/క్లైయింట్స్ వాక్సినేషన్ స్టేటస్) అని పిలుస్తున్నారు.
సంస్థలు తమ ఉద్యోగులు లేదా యూజర్లు టీకాలు వేసుకున్నారో లేదో కేవైసీ-వీఎస్ ద్వారా తెలుసుకోవచ్చు.
యూజర్ల సమ్మతి ఆధారంగానే కేవైసీ-వీఎస్ పని చేస్తుంది. దాంతో వారి గోప్యతకు ఎలాంటి ప్రమాదం ఉండదు.
దీనిని ఏ కంప్యూటర్లోనైనా సులువుగా ఉపయోగించవచ్చని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
వ్యాక్సీన్ వేసుకున్న వారికి, కోవిన్ ఇప్పటికే డిజిటల్ సర్టిఫికెట్‌ను జారీ చేస్తోంది.
ఈ సర్టిఫికెట్‌ను డిజిటల్ పరికరాల్లో (స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్, ల్యాప్‌టాప్ మొదలైనవి) సేవ్ చేసుకోవచ్చు. డీజీ లాకర్‌లో కూడా ఈ సర్టిఫికెట్‌ను సేవ్ చేసుకునే వెసులుబాటు ఉంది. టీకా వేసుకున్నట్టు ఆధారం చూపించాల్సినప్పుడల్లా, ఈ సర్టిఫికెట్‌ను సులువుగా షేర్ చేసుకోవచ్చు.
అదే విధంగా ఈ సర్టిఫికేట్ అవసరమైన ఎంట్రీ పాయింట్‌లలో (ఉదా: మాల్స్, ఆఫీస్ కాంప్లెక్స్, పబ్లిక్ ఈవెంట్‌లు మొదలైనవి) డిజిటల్ లేదా ఫిజికల్ రూపంలో ఎలా చూపించినా సరిపోతుంది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
కొన్ని సందర్భాల్లో మాత్రం సంస్థలు తమ సిబ్బంది లేదా కస్టమర్లు టీకాలు వేసుకున్నారో లేదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
అలాంటి కొన్ని సందర్భాలు :
- ఆఫీసులను తిరిగి ప్రారంభించే సమయంలో తమ ఉద్యోగులు టీకా వేసుకున్నారో లేదో తెలుసుకోవాలనుకోవచ్చు.
- రైళ్లలో సీట్లు రిజర్వ్ చేసుకునే ప్రయాణీకులు టీకాలు వేసుకున్నారా లేదా అనే విషయాన్ని రైల్వే సంస్థ కోరవచ్చు.
- విమానయాన సంస్థలు తమ విమాన టిక్కెట్లను బుక్ చేసుకునే ప్రయాణీకులు టీకా వేసుకున్నారో లేదో తెలుసుకోవాలనుకోవచ్చు లేదా టీకాలు వేసుకున్న ప్రయాణీకులను మాత్రమే ఎయిర్‌పోర్టులోకి అనుమతించాలని అనుకోవచ్చు.
- హోటల్‌లో గదులు బుక్ చేసుకునే సమయంలో లేదా ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసే సమయంలో హోటల్ యాజమాన్యం వారి టీకాల స్థితిని తెలుసుకోవాలనుకోవచ్చు.
సామాజిక ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా గాడినపడుతున్న సమయంలో ప్రతి ఒక్కరి భద్రతపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.
ఉద్యోగులు, ప్రయాణీకులు, నివాసితులు మొదలైన వారు ఏదో ఓ సందర్భంలో టీకా వేసుకున్నారో లేదో డిజిటల్‌గా తెలియజేయడానికి ఒక మార్గం అవసరం.
ఆధార్‌లో ఓటీపీ వంటి అథెంటికేషన్ సేవలతో యూజర్ డేటాకు రక్షణ ఎలా అయితే ఉంటుందో అదే విధంగా కోవిన్ ద్వారా టీకాల స్థితిని తెలుసుకోవడానికి అలాంటి ఓటీపీ అథెంటికేషన్ సేవల అవసరం ఏర్పడింది.

ఫొటో సోర్స్, Getty Images
కోవిన్ కొత్త ఏపీఐ ఎలా పని చేస్తుంది?
ఇలాంటి సందర్భాలను అధిగమించడానికి కోవిన్ కొత్త ఏపీఐని అభివృద్ధి చేసింది. అదే కేవైసీ-వీఎస్(కస్టమర్స్/క్లైయింట్స్ వాక్సినేషన్ స్టేటస్).
ఈ ఏపీఐని వినియోగించడానికి ఒక వ్యక్తి తన మొబైల్ నెంబర్,పేరుని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారి మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే, టీకా వేసుకున్నామా లేదా అనే విషయం సంబంధిత సంస్థకు వెళ్లిపోతుంది.
సంస్థలకు ఈ కింది విధంగా మెసేజ్ వెళుతుంది.
0 - టీకా తీసుకోలేదు.
1 - పాక్షికంగా టీకా తీసుకున్నారు.
2 - రెండు డోసులు తీసుకున్నారు.
ప్రతిస్పందన అనేది డిజిటల్ రూపంలో వెంటనే సంబంధిత సంస్థకు వెళుతుంది.
ఉదాహరణకు.. రైల్వే టికెట్ బుక్ చేసే సమయంలో ఓ వ్యక్తి టికెట్ కొనడానికి అవసరమైన అన్ని వివరాలను ఎంటర్ చేశాడనుకుందాం. అదే సమయంలో అతను టీకా వేసుకున్నారో లేదో కేవైసీ-వీఎస్ సాయంతో రైల్వే సంస్థ తెలుసుకోవచ్చు. అది కూడా యూజర్ సమ్మతితోనే ఇది జరుగుతుంది.
ఈ ప్రక్రియని వేగవంతంగా, సులభతరం చేయడానికి కోవిన్ బృందం ఒక వెబ్‌పేజీని ఏపీఐతో సిద్ధం చేసింది. దీనిని ఏ కంప్యూటర్లో అయినా సులువుగా అనుసంధానం చేసి ఉపయోగించవచ్చు.
వ్యక్తి టీకా వేసుకున్నారో లేదో తెలుసుకోవడానికి ప్రైవేట్ లేదా పబ్లిక్ సర్వీస్ ప్రొవైడర్లు ఈ సేవలను ఉపయోగించవచ్చు.
ఇవి కూడా చదవండి:
- యలవర్తి నాయుడమ్మ: వరి పొట్టు నుంచి సిమెంటు తయారు చేయవచ్చన్న ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త
- క్లిటోరిస్ అంటే ఏంటి? సెక్స్‌లో మహిళల లైంగిక ఆనందానికీ, దీనికీ లింకేంటి?
- ‘కాందహార్’ విమానం హైజాక్: 21 ఏళ్ల క్రితం అదంతా ఎలా జరిగింది?
- ఒక ఉల్కను అమ్మేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుదామనుకున్నాడు. కానీ...
- హైదరాబాద్ మెట్రోను అమ్మేస్తారా, నష్టాలకు కారణాలేంటి?
- 11 సెప్టెంబర్ 2001: 20 ఏళ్ల క్రితం అమెరికాలో ట్విన్ టవర్స్ కూలడానికి 2 శాస్త్రీయ కారణాలు
- ఆంధ్రప్రదేశ్: 'సినిమా వ్యాపారం మాది, ప్రభుత్వం టికెట్లు అమ్ముకుంటే ఎలా?' - కొత్త జీవోపై కలకలం
- హర్లీన్ దేవల్: ఆమె పట్టిన మెరుపు క్యాచ్‌కు ప్రపంచం మురిసిపోతోంది
- అఫ్గానిస్తాన్ మహిళల క్రికెట్ జట్లు సభ్యులు ఎక్కడ, తాలిబాన్ల భయంతో పారిపోయారా?
- టెండూల్కర్‌తో మాట్లాడమని కోహ్లీకి గావస్కర్ ఎందుకు సలహా ఇచ్చారు?
- 'సచిన్ అందరికీ క్రికెట్ దేవుడు... కానీ, నాకు మాత్రం కొడుకులాంటి వాడు'
- వన్డే.. టీ20.. ఇప్పుడు 100-బాల్ క్రికెట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








