హర్లీన్ దేవల్: ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ఇండియా మహిళా క్రికెటర్ క్యాచ్ మీరు చూశారా?

హర్లీన్ దేవల్

ఫొటో సోర్స్, Kelly Defina-ICC/GettyImages

    • రచయిత, అరుణ్ శాండిల్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

హర్లీన్ కౌర్ దేవల్.. ఇప్పుడీ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. సచిన్ తెండూల్కర్ సహా దేశవిదేశీ క్రికెటర్లంతా ఈ భారతీయ మహిళా క్రికెటర్‌ను పొగడ్తలలో ముంచెత్తుతున్నారు.

కారణం.. ఆమె పట్టిన మెరుపు క్యాచ్.

మహిళా క్రికెట్‌లో ఇలాంటి క్యాచ్ ముందెన్నడూ చూడలేదంటూ క్రికెట్ పండితులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ప్రస్తుతం భారత మహిళల క్రికెట్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది. ఇప్పటికే వన్డే సిరీస్ ముగిసి టీ20 సిరీస్ కొనసాగుతోంది.

ఈ టీ20 సిరీస్‌లో భాగంగా శుక్రవారం రాత్రి నార్తాంప్టన్ కౌంటీ మైదానంలో జరిగిన తొలి మ్యాచ్‌లో హర్లీన్ దేవల్ ఈ క్యాచ్ పట్టారు.

ప్రత్యర్థి ఇంగ్లండ్ జట్టు సహా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో క్రికెట్ జట్లు, క్రికెట్ సంఘాలు, గొప్ప క్రికెటర్లు, ఆనంద్ మహీంద్ర వంటి పారిశ్రామికవేత్తలు, ఇతర రంగాలకు చెందినవారు కూడా ఇప్పుడు ఆ క్యాచ్ వీడియోను ట్విటర్, ఇతర సామాజిక మాధ్యమాలలో పంచుకుంటూ హర్లీన్‌పై అభినందనలు కురిపిస్తున్నారు.

పురుష క్రికెటర్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఫిట్‌నెస్, క్రీడా నైపుణ్యం చాటారంటూ మెచ్చుకుంటున్నారు.

మ్యాచ్‌లో భారత్ ఓడిపోయినప్పటికీ ఈ ఒక్క క్యాచ్‌తో ప్రపంచమంతటి దృష్టినీ తన వైపు తిప్పుకోగలిగింది భారత్ మహిళా జట్టు.

హర్లీన్ క్యాచ్

ఫొటో సోర్స్, Twitter/english cricket

బౌండరీ లైన్ బయట పడిపోతూ..

నార్తాంప్టన్ కౌంటీలో జరుగుతున్న ఆ మ్యాచ్‌లో మొదట ఇంగ్లండ్ జట్టు అమ్మాయిలు బ్యాటింగ్ చేశారు. ఆ జట్టు బ్యాట్స్‌ఉమెన్ ధాటిగా ఆడుతున్నారు. ఆ సమయంలో భారత బౌలర్ శిఖా పాండే 19వ ఓవర్ వేయడానికి బంతి అందుకున్నారు.

ఆ ఓవర్ అయిదో బంతికి ఇంగ్లిష్ బ్యాట్స్ఉమన్ అమీ జోన్స్ బౌండరీ దిశగా గాలిలోకి భారీ షాట్ కొట్టారు.

అయితే, బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న హర్లీన్ దేవల్ మెరుపులా గాల్లోకి ఎగిరి ఆ బంతిని ఎడమ చేత్తే అందుకున్నారు. కానీ, తాను బౌండరీ లైన్ అవతల పడుతున్నానని గుర్తించి వెంటనే తన చేతిలోని బంతిని తిరిగి మైదానంలోకి గాల్లో విసిరారు.

అనుకున్నట్లుగానే బౌండరీ లైన్ అవతల పడిన ఆమె వెంటనే లేచి తిరిగి మైదానంలోకి డైవ్ చేసి తాను గాల్లోకి విసిరిన బంతిని గాల్లోనే ఒడిసి పట్టి క్యాచ్ అందుకున్నారు.

దాంతో ఒక్కసారిగా భారత్ జట్టు అమ్మాయిలంతా ఆమెను చుట్టుముట్టి అభినందనల్లో ముంచెత్తడం, ఇంగ్లిష్ బ్యాట్స్ఉమన్ అమీ జోన్స్ నిరాశగా పెవిలియన్ చేరడం ఒకేసారి జరిగిపోయాయి.

హర్లీన్ పట్టిన ఈ స్టన్నింగ్ క్యాచ్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ఈ ఏడాది ఇదే అత్యుత్తమ క్యాచ్: సచిన్

దిగ్గజ క్రికెటర్ సచిన్ తెండూల్కర్ ఈ క్యాచ్‌ను ట్విటర్‌లో షేర్ చేస్తూ ఈ ఏడాది ఇదే అత్యుత్తమత క్యాచ్ అని మెచ్చుకున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ఇంగ్లండ్ జట్టు కూడా..

హర్లీన్ పట్టిన ఈ క్యాచ్‌ను ఇంగ్లండ్ జట్టు కూడా తమ ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. అసాధారణ ఫీల్డింగ్ అంటూ కితాబిచ్చింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

బీసీసీఐ ఉమెన్ ఏమందంటే..

'బీసీసీఐ ఉమెన్' తన ట్విటర్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేస్తూ మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నప్పటికీ ఈ గేమ్‌ చాలా ప్రత్యేకమైనది అంటూ హర్లీన్ ప్రతిభను ప్రస్తావించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

జ్యోతిరాదిత్య సింథియా

మోదీ కేబినెట్‌లో మంత్రి పదవి దక్కించుకున్న బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింథియా ఈ వీడియోను తన ట్విటర్ అకౌంట్‌లో షేర్ చేశారు.

గొప్ప ఫీల్డింగ్‌లో ఇది కూడా ఒకటి. నమ్మశక్యం కానీ రీతిలో క్యాచ్ పట్టారంటూ ఆయన ప్రశంసించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

వీవీఎస్ లక్ష్మణ్, హర్భజన్ ఏమన్నారంటే..

క్రికెట్ మైదానంలో చూసిన క్యాచ్‌లలో ఇదొక గొప్ప క్యాచ్. ఉన్నత శ్రేణి ఫీల్డింగ్ అంటూ మెచ్చుకున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 6
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 6

'టేక్ ఏ బౌ' అంటూ హర్భజన్ సింగ్ తనదైన శైలిలో ప్రశంసించారు. అసాధారణమైన క్యాచ్ అన్నారాయన.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 7
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 7

జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ రేఖా శర్మ దీన్ని అద్భుతమైన క్యాచ్‌గా అభివర్ణించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 8
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 8

స్పెషల్ ఎఫెక్ట్స్ ట్రిక్కా? నిజమా?: ఆనంద్ మహీంద్రా

పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ఈ క్యాచ్ చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇది నిజమేనా లేదంటే స్పెషల్ ఎఫెక్ట్స్ ట్రిక్కా అంటూ ఆయన ట్వీట్ చేశారు. నిజమైన వండర్ ఉమన్ ఇక్కడున్నారు.. గాల్ గ్యాడట్(వండర్ ఉమన్ నటి)ను మర్చిపోండి అంటూ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 9
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 9

వీరే కాకుండా ఆస్ట్రేలియన్ క్రికెటర్ లీసా స్తాలేకర్, బెంగళూరు సెంట్రల్ ఎంపీ పీసీ మోహన్, తెలుగు నటుడు అడివి శేష్, పశ్చిమ బెంగాల్ సీఐడీ విభాగం డీఐజీ మీర్జా ఖలీద్ వంటి ఎందరో హర్లీన్ ఫీట్‌ను ప్రస్తుతించారు.

హర్లీన్ దేవల్

ఫొటో సోర్స్, Getty Images

బ్యాటింగ్, ఫీల్డింగ్.. రెండిట్లోనూ దూకుడే

చంఢీగఢ్‌కు చెందిన హర్లీన్ కౌర్ దేవల్ దేశవాళీ క్రికెట్‌లో హిమాచల్ ప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు.

కుడిచేతి వాటం అటాకింగ్ బ్యాట్స్ ఉమన్ అయిన హర్లీన్ కుడిచేతి వాటం లెగ్ స్పిన్నర్ కూడా.

మహిళల వన్డే క్రికెట్‌లో హర్లీన్ 2019లో తొలి మ్యాచ్ ఆడారు.

ఆస్ట్రేలియాలో జరిగిన ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో హర్లీన్ ఆడారు.

ధాటైన బ్యాట్స్‌ఉమన్‌గానే కాకుండా మంచి ఫీల్డర్‌గానూ ఇండియన్ టీమ్‌లో ఆమెకు పేరుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)