కరోనా వ్యాక్సీన్ సైడ్ ఎఫెక్ట్స్: వైరస్‌తో ముప్పు కంటే, టీకా వల్ల వచ్చే సమస్యలు తక్కువే

ఫొటో సోర్స్, Getty Images
ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్లు తీసుకోవడం వల్ల రక్తంలో గడ్డలు కట్టడం లేదా రక్తస్రావం జరిగే ముప్పును పెంచుతుందని వ్యాక్సీన్ల గురించి చేసిన ఒక సమీక్ష చెబుతోంది.
కానీ కోవిడ్ ఇన్ఫెక్షన్ బారిన పడితే ఇలాంటి సమస్యలు మరింత ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందని కూడా ఈ అధ్యయనం సూచిస్తోంది.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నేతృత్వంలోని ఒక బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది.
ఫైజర్ వ్యాక్సీన్ తీసుకోవడం వల్ల గుండె పోటు వచ్చే ప్రమాదం ఉందని ఈ అధ్యయనం చెబుతోంది.
కానీ ఇన్ఫెక్షన్ వల్ల కలిగే ప్రమాదం కంటే కూడా వ్యాక్సీన్ తీసుకోవడం వల్ల వచ్చే ముప్పు చాలా తక్కువ స్థాయిలో ఉంటుందని చెబుతోంది.
వ్యాక్సినేషన్ వల్ల గణనీయమైన మేలు జరుగుతుందని ఈ అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి.
బీబీసీ రేడియో న్యూ కాసిల్ ప్రెజెంటర్ లీసా షా.. ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత తలెత్తిన అనారోగ్య సమస్యలతో మరణించారని వార్తలు వచ్చిన తర్వాత ఈ అధ్యయన ఫలితాలను ప్రకటించారు.
ఆస్ట్రాజెనెకా డోసు తీసుకున్న వారం రోజులకు తలనొప్పి వచ్చి 44 సంవత్సరాల లీసా షా మే నెలలో మరణించారు.
ఆమెకు మెదడులో రక్తం గడ్డకట్టింది.

ఫొటో సోర్స్, Getty Images
డిసెంబరు నుంచి ఏప్రిల్ నెలల మధ్యలో కోవిడ్ వ్యాక్సీన్ తొలి డోసు తీసుకున్న 2.9 కోట్ల మంది రికార్డులతో పాటు, వైరస్ సోకిన 18 లక్షల మంది రికార్డులను కూడా ఈ అధ్యయన బృందం పరిశీలించింది.
ఈ అధ్యయనం బ్రిటిష్ మెడికల్ జర్నల్లో ప్రచురితమయింది.
ఈ అధ్యయనంలో వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత, వైరస్ సోకిన 28 రోజుల లోపు తలెత్తిన అనారోగ్య సమస్యలను పరిశీలించారు.
ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్ తీసుకున్న ప్రతి కోటి మందిలో:
అదనంగా 107 మంది ఆసుపత్రి పాలవ్వడం గానీ లేదా శరీరం లోపల రక్తస్రావం లేదా హెమరేజికి (థ్రోమ్బోసైటోపీనియా) గురై మరణించడం గానీ జరిగింది.
కానీ అది ఇన్ఫెక్షన్ సోకడం వల్ల కలిగే ముప్పు కంటే కూడా 9 రెట్లు తక్కువ.
అదనంగా 66 మంది ఆసుపత్రి పాలవ్వడం గానీ లేదా నరాల్లో రక్తం గడ్డ కట్టడం వల్ల గానీ మరణించారు.
ఇది కూడా ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత వచ్చే ముప్పు కంటే కూడా 200 రెట్లు తక్కువ.
ఫైజర్ వ్యాక్సీన్ తీసుకున్న ప్రతి కోటి మందిలో..
అదనంగా 143 మంది గుండె దడకు గురవ్వడం కనిపించింది. కానీ ఇది కూడా ఇన్ఫెక్షన్ తర్వాత వచ్చే గుండె పోటు కంటే కూడా 12 రెట్లు తక్కువ.
వ్యాక్సీన్ల వల్ల వచ్చే ముప్పు గురించి ప్రజలు తెలుసుకుని ఉండటం ముఖ్యం అని ఈ అధ్యయన ముఖ్య రచయిత ప్రొఫెసర్ జూలియా హిప్పీస్లీ కాక్స్ చెప్పారు.
కానీ కరోనా వైరస్ సోకడం వచ్చే ముప్పు కంటే వ్యాక్సీన్ తీసుకోవడం వల్ల కలిగే ముప్పు తక్కువగా ఉంటుందని తెలియచేయాలని అన్నారు.
"వ్యాక్సీన్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలే జరుగుతుంది" అని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- వాతావరణ మార్పులు: మానవాళికి ముప్పు పొంచి ఉందన్న ఐపీసీసీ నివేదిక
- దళిత గిరిజన దండోరా: 'దళిత బంధు' రాష్ట్రవ్యాప్తంగా ఎందుకు అమలు చేయరు-రేవంత్‌రెడ్డి
- ఆంధ్రప్రదేశ్: కొత్త విద్యా విధానంతో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి?
- మహమ్మద్ ఇస్మాయిల్ ఖాన్: తాలిబన్లతో పోరాడుతున్న 'అఫ్గాన్ సింహం'
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- ప్రమాదం అని తెలిసినా చైనాలో ప్లాస్టిక్ సర్జరీల సంఖ్య ఎందుకు పెరుగుతోంది
- దానిష్ సిద్దిఖీ: పులిట్జర్ ప్రైజ్ అందుకున్న భారత ఫొటో జర్నలిస్ట్ తీసిన మరపురాని ఛాయా చిత్రాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








