చక్కా జామ్: దేశవ్యాప్తంగా రైతుల రాస్తా రోకో... మూడు గంటల నిరసనలో 50 అరెస్టులు

ఫొటో సోర్స్, MOHAR SINGH MEENA/BBC
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా 40కి పైగా రైతు సంఘాలు మూడు గంటలపాటు నిర్వహించిన 'చక్కా జామ్' ఆందోళన ముగిసింది.
దిల్లీలోని షాహిద్ పార్క్ సమీపంలో నిరసన కార్యక్రమాల సందర్భంగా పోలీసులు 50మందిని అదుపులోకి తీసుకున్నారని పీటీఐ వెల్లడించింది. మరోవైపు ఆందోళన సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా దిల్లీలోని 10 మెట్రో స్టేషన్లను మూసేశారు.
రైతుల ఆందోళనల ప్రభావం హరియాణా, పంజాబ్ లలో ఎక్కువగా కనిపించింది. పలు రాష్ట్ర, జాతీయ రహదారులను రైతులు దిగ్బంధించారు. దిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లలో ఈ ఆందోళన జరగలేదు
'చక్కా జామ్' నిరసన ప్రదర్శనల సందర్భంగా దేశంలోని పలు ప్రాంతాలలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణలు జరిగినట్లు వార్తలు వచ్చాయి.
జనవరి 26న జరిగిన ట్రాక్టర్ పరేడ్ తర్వాత రైతులు నిర్వహించిన అతి పెద్ద నిరసన కార్యక్రమం ఇదే. రైతులు, ప్రభుత్వం మధ్య ఇప్పటి వరకు 11 దఫాల చర్చలు జరగ్గా అవేవీ ఫలవంతం కాలేదు. మూడు చట్టాల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు.

ఫొటో సోర్స్, BISWA RANJAN MISHRA
ఏపీలో రైతుల నిరసనలు.. అదుపులోకి తీసుకున్న పోలీసులు
రైతు సంఘాల ఐక్యకార్యాచరణ ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల నిరసనలు జరిగాయి. ఈ నిరసనల్లో వామపక్ష పార్టీలు, రైతు సంఘాలు పాల్గొన్నాయి.
తిరుపతి, కర్నూలు, గుంటూరు, ఒంగోలు, వైజాగ్, శ్రీకాకుళం సహా పలు ప్రాంతాల్లో ఆందోళనలు నిర్వహించారు. ఈ ఆందోళన కారణంగా కొన్నిచోట్ల ట్రాఫిక్‌కి అంతరాయం ఏర్పడింది. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మోదీ ప్రభుత్వ తీరుపై నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేసే వరకూ ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు.

రాజస్తాన్ - హరియాణా సరిహద్దులో
రాజస్తాన్ - హరియాణా సరిహద్దులోని షాజహాన్‌పూర్ వద్ద నిరసనకారులు జాతీయ రహదారిపై రాస్తా రోకో చేపట్టారు. దిల్లీలోని రోడ్ నంబర్ 56, నేషనల్ హైవే 24, వికాస్ మార్గ్, జీటీ రోడ్, జీరాబాద్ రోడ్ వంటి వ్యూహాత్మక ప్రదేశాల్లో పోలీసు సిబ్బందిని మోహరించామని దిల్లీ పోలీస్ జాయింట్ కమిషనర్ అలోక్ కుమార్ చెప్పినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
దిల్లీలోకి ఎవరూ చొరబడకుండా నిరోధించే విధంగా బారికేడ్లను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
''దిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతంలో సుమారు 50,000 మంది పోలీసు, పారామిలటరీ, రిజర్వు ఫోర్స్ బలగాలను మోహరించాం.
ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా ఉండటం కోసం రాజధానిలో 12 మెట్రో స్టేషన్లను అప్రమత్తం చేశాం.
వాటిలో ప్రవేశం, నిష్క్రమణ ద్వారాలను మూసివేయాలని చెప్పాం'' అని దిల్లీ పోలీసు విభాగం తెలిపింది.

శాంతియుతంగా చక్కా జామ్.. భద్రత బాధ్యత ప్రభుత్వానిదే: కిసాన్ ఆందోళన్ కమిటీ
చక్కా జామ్‌ను శాంతియుతంగా నిర్వహిస్తామని కిసాన్ ఆందోళన్ కమిటీ (కేఏసీ) నాయకుడు జగ్తార్ సింగ్ బాజ్వా చెప్పినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.
అయితే.. అసాంఘిక శక్తులు హింసకు పాల్పడకుండా చూడాల్సిన ప్రభుత్వానిదేనని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలిపింది.
''ఇప్పటివరకూ మా నిరసన మొత్తం శాంతియుతంగానే సాగింది. రైతు సోదరులందరూ శాంతియుతంగా చక్కా జామ్ నిర్వహించాలని కోరుకుంటున్నారు.
హింసకు పాల్పడేందుకు కుట్ర పన్నుతున్న రౌడీ శక్తులను ప్రభుత్వం తన సంస్థలు, భద్రతా బలగాల సాయంతో నిరోధించాల్సి ఉంటుంది'' అని ఆయన పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత నవంబర్ 26 నుంచి దిల్లీ సరిహద్దుల్లో రైతు సంఘాలు నిరసన చేపట్టాయి.
ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచటం కోసం ఫిబ్రవరి 6న దేశవ్యాప్తంగా చక్కా జామ్ నిర్వహిస్తామని గత సోమవారం ప్రకటించారు.
దిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లను మినహాయించి.. దేశమంతటా జాతీయ, రాష్ట్ర రహదారులను దిగ్బంధిస్తామని చెప్పారు.
ఈ చక్కా జామ్ శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకూ కొనసాగుతుంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఈ నేపథ్యంలో దిల్లీ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. రహదారులపై భద్రత సిబ్బంది అనేక వరుసల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు.
దేశ రాజధాని నగరంలో పరిణామాలను పర్యవేక్షించటానికి డ్రోన్ కెమెరాలను పెద్ద ఎత్తున సిద్ధం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఎర్ర కోట వద్ద కూడా భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించటం కనిపించింది. మింటో బ్రిడ్జి వద్ద భారీ ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేసి.. పోలీసు బలగాలను మోహరించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
ముందస్తు చర్యగా ఈ ప్రాంతాన్ని మొత్తం దిగ్బంధించారు. దిల్లీలోని ఐటీఓ సమీపంలో పోలీస్ బారికేడ్ల మీద బార్బ్‌డ్ వైర్లు (ముళ్ల కంచెలు) వేశారు.

ఇవి కూడా చదవండి:
- సైన్యంలో చేరాలని రెండు సార్లు ఫెయిలైన వ్యక్తి ఇప్పుడు దేశాన్నే గుప్పిట్లో పెట్టుకున్నాడు
- బుమ్రా, షమీ, ఉమేశ్, ఇషాంత్... ఇంగ్లండ్‌ను భయపెడుతున్న భారత పేసర్లు
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు.. చరిత్రలో అక్కడ జరిగిన రాజకీయ కుట్రలెన్ని.. తెగిపడిన తలలెన్ని
- దీప్ సిద్ధూ ఎవరు? ఎర్రకోట ఘటన తరువాత చర్చల్లోకి ఎందుకొచ్చారు?
- ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు...
- బడ్జెట్ 2021-22: సామాన్యులకు ఈ బడ్జెట్‌తో చేకూరే ప్రయోజనాలు ఇవే..
- పాకిస్తాన్ గురించి నేపాల్ ప్రజలు ఏమనుకుంటారు?
- తీరా కామత్: రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఈ పాపాయిని కాపాడుతుందా?
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- సెక్స్‌కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









