భరించలేని తలనొప్పి నుంచి బయటపడడానికి 4 మార్గాలు

తలనొప్పి, అనారోగ్యం, పెయిన్ కిల్లర్, కాఫీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, యాస్మిన్ రుఫో, మైకేల్ రాబర్ట్స్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

మనందరికీ అప్పుడప్పుడు తలనొప్పి వస్తుంటుంది. ఆ నొప్పి కొన్ని నిమిషాల నుంచి కొన్ని రోజుల వరకూ ఉండొచ్చు.

కానీ, కొన్నిసార్లు చాలా తీవ్రంగా ఉంటుంది. నీరసంగా అనిపిస్తుంది. దేనితోనే కొట్టినట్టు, పొడిచినట్టు అనిపిస్తుంది. కొన్నిసార్లు నొప్పి తల నుంచి, ముఖం, మెడ వరకు పాకుతుంది.

బీబీసీ వాట్సాప్ డాక్స్ వెల్నెస్ పాడ్‌కాస్ట్ హోస్ట్ అయిన డాక్టర్ జెడ్ వాన్ తుల్కెన్ చాలా కాలంగా దానితో బాధపడుతున్నారు. "నాకు ప్రతి నెలా లేదా నెలన్నరకు ఒకసారి తలనొప్పి వస్తుంది, అదెలా ఉంటుందంటే నా కంట్లో ఎవరో గుచ్చుతున్నట్టు అనిపిస్తుంది'" అని ఆయన చెప్పారు.

ఇంత తీవ్రమైన నొప్పికి ఏదో కారణం ఉందని అనుమానించడం సహజం. అయితే, ఇది తీవ్రమైన అనారోగ్యానికి చాలా అరుదుగా కనిపించే సంకేతమని నేషనల్ మైగ్రేన్ సెంటర్‌‌కి చెందిన నిపుణురాలు డాక్టర్ కేటీ మున్రో చెప్పారు.

మామూలు తలనొప్పి ఉంటే, అది పదేపదే వస్తుంటే, ఇంట్లోనే ప్రయత్నించగల కొన్ని సులభమైన నివారణ మార్గాలు ఉన్నాయి. అయితే, వైద్యుడిని కూడా సంప్రదించడం ఉత్తమం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
తలనొప్పి, అనారోగ్యం, పెయిన్ కిల్లర్, కాఫీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మంచి ఆహారం, తగినంత నిద్ర వంటివాటితో తలనొప్పిని దూరం చేసుకోవచ్చు.
ఆరోగ్యం, తలనొప్పి, వైద్యం, మెడిసిన్

"తలనొప్పి పదేపదే వస్తుంటే సహజంగానే ఏదో తీవ్రమైన సమస్య ఉందని మనం ఆందోళన చెందుతాం. కానీ అలాంటి సమస్య ఉండే అవకాశం చాలా తక్కువ" అని డాక్టర్ మున్రో అంటున్నారు.

ఎప్పుడూ లేనంత లేదా మొదటిసారి అత్యంత తీవ్రమైన నొప్పి వస్తుంటే, కచ్చితంగా వైద్యుని దగ్గరకు వెళ్లాలని మున్రో సలహా ఇస్తున్నారు.

తలనొప్పి ఎలాంటిదో అర్థం చేసుకోవడం వల్ల చాలా ఉపయోగముంటుందని డాక్టర్ జాండ్ చెప్పారు. ఎందుకంటే చాలాసార్లు ఆ నొప్పికి స్పష్టమైన కారణం ఉండదు.

అందుకే ఓ డైరీలో తలనొప్పి ఎప్పుడొచ్చింది? ఎంత నొప్పి ఉంటోంది? నొప్పి ఎంతకాలం ఉంటోంది? అసలు తలనొప్పి ఎందుకొస్తోంది? వంటివన్నీ రాసుకోవాలి.

కొంతమందికి, ఉరుములు లేదా మెరుపుల శబ్దం తలనొప్పి కలిగిస్తుంది. మరికొందరికి ప్రకాశవంతమైన కాంతి తలనొప్పికి కారణం కావొచ్చు.

"చెట్ల మధ్యలో నుంచి ఎండ పడుతున్న సమయంలో, డ్రైవింగ్ చేస్తే.. నాకు తలనొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది" అని మున్రో చెప్పారు.

తలనొప్పి, అనారోగ్యం, పెయిన్ కిల్లర్, కాఫీ

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, తలనొప్పి తగ్గించుకునేందుకు పెయిన్ కిల్లర్లు ఎక్కువగా వాడకూడదు.

ఈ విషయాలను గుర్తుంచుకోవాలి..

  • తలనొప్పి మొదలైనప్పుడు, మీరేం చేస్తున్నారు?
  • మీరేం తిన్నారు, ఏం తాగారు?
  • వాతావరణం ఎలా ఉంది?
  • హార్మోన్ల మార్పుల వల్ల తలనొప్పి తీవ్రమయ్యే అవకాశం ఉంది కాబట్టి, మహిళలు తమ రుతు చక్రం గురించి తెలుసుకోవాలి.

అయితే, ఇలాంటివన్నీ ఎక్కువగా చేయొద్దని మున్రో సూచిస్తున్నారు. "నేను చాలా వివరణాత్మక డైరీని తయారు చేసుకున్నాను, అది నాకు నిరాశపూరితంగా అనిపించింది'' అని చెప్పారు. "మామూలుగా రాసుకోండి. మీ తలనొప్పి మీ దినచర్యపై చూపే ప్రభావాన్ని ఒకటి నుంచి పది స్కేల్‌లో ఎంత ఉంటుందో నోట్ చేసుకోండి" అని మున్రో సలహా ఇచ్చారు.

"తలనొప్పి ఉన్న రోజులను మాత్రమే కాకుండా, సాధారణ రోజుల గురించి కూడా రాయండి. వైద్యులు పరిశీలించడానికి ఇది సాయపడుతుంది" అని తెలిపారు.

తలనొప్పి, అనారోగ్యం, పెయిన్ కిల్లర్, కాఫీ

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, కెఫీన్ మోతాదుకు మించి తీసుకోకూడదు.
ఆరోగ్యం, తలనొప్పి, వైద్యం, మెడిసిన్

తలనొప్పిగా ఉంటే, మీరు కెఫీన్‌కు దూరంగా ఉండాలి. కానీ డాక్టర్ మున్రో కొంచెం భిన్నంగా చెప్పారు.

తక్కువ, నియంత్రిత మోతాదులలో కెఫీన్ తీసుకోవడం వల్ల పెయిన్ కిల్లర్ల ప్రభావం పెరుగుతుంది. అయితే, రోజూ పెద్ద మొత్తంలో కెఫీన్ తీసుకుంటే ఈ ప్రభావం కనపడదు.

మధ్యాహ్నం లేదా సాయంత్రం కెఫీన్ తీసుకోకూడదని, ఎందుకంటే ఇది నిద్రకు భంగం కలిగిస్తుందని మున్రో తెలిపారు.

ఎంత మొత్తంలో కెఫీన్ తీసుకుంటున్నారో కూడా గమనించుకోవాలి. ఎందుకంటే రోజూ ఎక్కువ కెఫీన్ తీసుకోవడం తలనొప్పికి కారణమవుతుంది. అకస్మాత్తుగా దానిని ఆపడం వల్లా తలనొప్పి వస్తుంది.

తలనొప్పి, అనారోగ్యం, పెయిన్ కిల్లర్, కాఫీ

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, పోషకాహారం, మంచినీళ్లు వంటివాటి విషయంలో జాగ్రత్తలు పాటించాలి.
ఆరోగ్యం, తలనొప్పి, వైద్యం, మెడిసిన్

మీరేంతింటారు? ఎప్పుడు తింటారు? అనేదానిపై కూడా తలనొప్పి ఆధారపడి ఉంటుంది.

ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినాలని డాక్టర్ మున్రో సూచిస్తున్నారు. దీనివల్ల శక్తి కూడా లభిస్తుంది.

త్వరగా శక్తినిచ్చే చక్కెర కలిగిన చిరుతిళ్లకు దూరంగా ఉండాలి. భోజనాన్ని దాటవేయకూడదు. దీనివల్ల సమస్యలు ఎక్కువగా వస్తాయి.

పాల ఉత్పత్తులు, గ్లూటెన్‌కు దూరంగా ఉండడం వల్ల తనకు ప్రయోజనం కలిగిందని, అయితే అందరికీ ఇది ఉపయోగపడకపోవచ్చని మున్రో తెలిపారు.

"మధ్యాహ్నం, సాయంత్రం క్రమం తప్పకుండా భోజనం చేయడం ప్రయోజనకరంగా ఉందని నాకనిపించింది" అని డాక్టర్ మున్రో చెప్పారు.

ఆహారంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని, తగినంత నిద్రపోవాలని, ఒత్తిడిని తగ్గించుకోవాలని, సరిపడా నీళ్లు తాగాలని డాక్టర్ మున్రో సలహా ఇస్తున్నారు.

రోజంతా సరిపడా నీళ్లు తాగితే దాహం వేయకుండా ఉంటుంది. మూత్రం లేత రంగులో వస్తుంది.

తలనొప్పి, అనారోగ్యం, పెయిన్ కిల్లర్, కాఫీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పెయిన్ కిల్లర్లు ఎక్కువ వాడడం వల్ల కొన్నిసార్లు తలనొప్పి పెరిగే ప్రమాదముంటుంది.
ఆరోగ్యం, తలనొప్పి, వైద్యం, మెడిసిన్

"పెయిన్ కిల్లర్లు లేదా వికారాన్ని నివారించే మందులు లాంటివి ప్రిస్క్రిప్షన్ లేకుండానే లభిస్తాయి. తలనొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి" అని డాక్టర్ మున్రో చెప్పారు.

"కోడీన్ ఉన్న మందులను దూరంగా ఉంచడం మంచిది. ఎందుకంటే, ఇవి తలనొప్పికి కారణమవుతాయి. వికారం లక్షణాలను పెంచుతాయి" అని హెచ్చరిస్తున్నారు.

"తలనొప్పి ఎంత తీవ్రంగా ఉందనే దాన్నిబట్టి పెయిన్ కిల్లర్ల ప్రభావం ఉంటుంది'' అని చెప్పారు.

తరచుగా తలనొప్పి వస్తున్నా, నొప్పి తీవ్రంగా ఉన్నా డాక్టర్ దగ్గరకు వెళ్లి సరైన మందులు తీసుకోవాలని సూచించారు.

వారంలో రెండు రోజుల కంటే ఎక్కువగా పెయిన్ కిల్లర్లు వాడకూడదని, దీనివల్ల తలనొప్పి మళ్లీ వచ్చే అవకాశముంటుందని, మందులు ఎక్కువ వాడినా తలనొప్పి తిరిగి వస్తుందని డాక్టర్ మున్రో హెచ్చరించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)