మీ పేస్ట్‌లో ఫ్లోరైడ్ ఉందా? టూత్‌పేస్ట్‌ను ఎలా ఎంచుకోవాలి?

ఆరోగ్యం, దంతాలు, టూత్‌పేస్ట్, బ్రష్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, యాస్మిన్ రూఫో
    • హోదా, బీబీసీ న్యూస్

పళ్లు ఎలా తోముకోవాలో అందరూ తెలుసనే అనుకుంటారు. కానీ చిగుళ్ల నుంచి రక్తం వచ్చినా, వాచినట్లు కనిపిస్తున్నా అదొక సంకేతమని, మీరు సరిగ్గా బ్రష్ చేసుకోవాల్సిన అవసరం ఉందని యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్‌లోని స్కూల్ ఆఫ్ డెంటిస్ట్రీకి చెందిన డాక్టర్ ప్రవీణ్ శర్మ అన్నారు.

పళ్లకు సంబంధించి ఏదైనా సమస్య వస్తే దంత వైద్యులను తప్పక సంప్రదించడంతో పాటు దంతాల ఆరోగ్యానికి ఈ మూడు విషయాలను గుర్తుంచుకోవాలని ఆయన చెప్పారు.

మనం మారితేనే మన దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయనతో పాటు బీబీసీ వాట్సాప్ డాక్టర్ పాడ్‌కాస్ట్ కార్యక్రమంలో డాక్టర్ క్రిస్, డాక్టర్ జాండ్ అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఆరోగ్యం, దంతాలు, టూత్‌పేస్ట్, బ్రష్

ఫొటో సోర్స్, Getty Images

ఆరోగ్యం, దంతాలు, టూత్‌పేస్ట్, బ్రష్

రోజుకు రెండుసార్లు పళ్లు తోముకోవాలనేది అందరికీ తెలిసిన విషయమే. ఎన్‌హెచ్‌ఎస్ కూడా అదే సిఫార్సు చేస్తోంది.

అయితే, ఎన్నిసార్లు తోముతున్నామనే దానికంటే ఎంత బాగా బ్రష్ చేస్తున్నామన్నదే ముఖ్యమని డాక్టర్ ప్రవీణ్ శర్మ అన్నారు.

'మీకు సమయం ఉంటే రోజూ రెండుసార్లు పళ్లు తోమండి. మంచిదే, అయితే త్వరత్వరగా రెండుసార్లు బ్రష్ చేయడం కంటే సరిగ్గా ఒకసారి పళ్లు తోముకుంటే చాలా మంచిది' అని ఆయన సూచించారు.

రోజుకు ఒకసారే పళ్లు తోముతున్నట్లయితే తప్పకుండా ఫ్లాస్ చేసుకోవాలని ఆయన చెప్పారు.

ప్రతీ పంటికి మూడు ఉపరితలాలు ఉంటాయి. పన్ను బయటి భాగం, లోపలి భాగం, మధ్య భాగం.

ఈ మూడు ఉపరితలాలపై ఎక్కువ ఒత్తిడి లేకుండా వృత్తాకారంగా బ్రష్‌తో తోమాలని ఆయన సూచించారు. చిగుళ్లు, పంటికి మధ్య ఉండే జంక్షన్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, చిగుళ్ల వ్యాధులు అక్కడి నుంచే మొదలవుతాయని ఆయన చెప్పారు.

పళ్లు తోమడం అనేది ఫోన్ చూసుకుంటూ చేసే పని కాదని, చాలా జాగ్రత్తగా చేయాలని డాక్టర్ జాండ్ అన్నారు.

బ్రషింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఆరోగ్యం, దంతాలు, టూత్‌పేస్ట్, బ్రష్

చాలామంది ఏదైనా తిన్న వెంటనే పళ్లు తోముకుంటారు. ఇది ఏ రకంగానూ మీ ఎనామిల్‌కు మేలు చేయకపోవచ్చు.

'బ్రేక్‌ఫాస్ట్‌కు ముందే బ్రష్ చేసుకోవాలి. ఏదైనా ఆమ్ల పదార్థాలు తీసుకున్న తర్వాత చేయకూడదు. ఒకవేళ ఏదైన తిన్న తర్వాత చేయాలనుకుంటే కాస్త గ్యాప్ ఇవ్వాలి' అని డాక్టర్ ప్రవీణ్ శర్మ చెప్పారు.

ఆహారాలు, ముఖ్యంగా పండ్ల రసాలు, కాఫీలు వంటి పానీయాల నుంచి వచ్చే ఆమ్లాలు పంటిపై ఉండే ఎనామిల్‌ను మృదువుగా చేస్తాయి. తిన్న వెంటనే బ్రష్ చేయడం వల్ల ఎనామిల్ దెబ్బ తింటుంది.

తిన్న వెంటనే నోటిని నీరుతో శుభ్రం చేసుకోవడం వల్ల కాస్త ఆమ్ల ప్రభావం తగ్గుతుందని, ఆ తర్వాత కనీసం 30 నిమిషాలు ఆగి ఆపై బ్రష్ చేసుకోవాలని డాక్టర్ క్రిస్ చెప్పారు.

ఆరోగ్యం, దంతాలు, టూత్‌పేస్ట్, బ్రష్

ఫొటో సోర్స్, Getty Images

ఆరోగ్యం, దంతాలు, టూత్‌పేస్ట్, బ్రష్

వైటెనింగ్, ఎనామిల్ బూస్టింగ్, చార్‌కోల్ అంటూ రకరకాల టూత్‌పేస్ట్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఖరీదైన పేస్టు దంతాలకు మంచి చేస్తుందని భావించడం సహజమే.

మీ పేస్టులో ఒక ముఖ్యమైన పదార్థం ఉన్నంతవరకు అది ఏ బ్రాండ్‌దైనా పెద్ద తేడా ఏం ఉండదని డాక్టర్ ప్రవీణ్ శర్మ అన్నారు.

'మీ టూత్‌పేస్ట్‌లో ఫ్లోరైడ్ ఉన్నంతవరకు ఏ బ్రాండ్ పేస్ట్ వాడినా మంచిదే. ఫ్లోరైడ్ ఉన్న తక్కువ ధర లేదా ఆఫర్‌లో దొరికే పేస్ట్‌నే నేను కొంటాను' అని ఆయన చెప్పారు.

పంటి మీది ఎనామిల్‌ను కాపాడటానికి, దంత క్షయాన్ని నివారించడానికి ఫ్లోరైడ్ సహాయపడుతుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)