ఆహారం పాడైపోయిందో లేదో తెలుసుకోవడానికి వాసన ఒక్కటే సరిపోతుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మాథ్యూ గిల్మర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
శాండ్‌విచ్‌లు చేద్దామని ఫ్రిజ్‌లో నుంచి చికెన్ ట్రేని తీసుకున్నాను. ఆ చికెన్ గడువు ముగిసిపోలేదని నాకు తెలుసు. కానీ.. లోపల మాత్రం అనుమానం.
ఇంట్లోనే మరొకరు ఆ చికెన్ ప్యాకెట్‌ను తెరిచి ఉంచడంతో చికెన్ ముక్కలు కొద్దిరోజులుగా ఫ్రిజ్‌లో అలాగే ఉన్నాయి.
అయితే, అది ఇప్పటికీ తినొచ్చా? ఇది మంచిగా ఉందా లేదా అని చూసేందుకు వాసన చూస్తే బాగానే ఉంది.
నేను దాని గురించి ఇంకా బాగా తెలుసుకోవాలి. ఎందుకంటే, నేనొక మైక్రోబయాలజిస్ట్‌ని. వాసన రాకపోయినా మైక్రోబ్స్ (సూక్ష్మజీవులు) అనారోగ్యానికి కారణమవుతాయని నాకు తెలుసు. ఏదేమైనా, వాసన చూసి బాగుందో లేదో తెలుసుకోవడాన్ని నేను పూర్తిగా నమ్మలేకపోతున్నాను.

ఫొటో సోర్స్, Getty Images
మంచి వాసన వచ్చినంత మాత్రాన...
కొన్ని సూక్ష్మజీవులు అవి పెరుగుతున్న కొద్దీ దుర్వాసన పుట్టిస్తాయనేది నిజం.
ఉదాహరణకు తాజాగా కాల్చిన రొట్టె (బ్రెడ్) నుంచి వచ్చే వాసన ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ, సూక్ష్మజీవుల కారణంగా వచ్చే బ్రెడ్ నుంచి వచ్చే గ్యాస్, లేదా దుర్వాసన చూస్తే విరక్తి పుడుతుంది.
పదార్థాల్లోని కార్బన్, ఇతర మూలకాలను తమ శక్తి వనరులుగా మార్చుకుని సూక్ష్మజీవులు వేగంగా వృద్ధి చెందినప్పుడు దుర్వాసన కలిగించే వాయువులు ఉత్పన్నమవుతాయి.
అయితే, ఆహారం ద్వారా కలిగే వ్యాధులను కలగజేసే లిస్టెరియా, సాల్గొనెల్లా వంటి మైక్రోబ్స్‌ను కేవలం వాసన చూడడం ద్వారా గుర్తించడం దాదాపు అసాధ్యం.
ఇలాంటి బ్యాక్టీరియా ఆహారంలో తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు ప్రమాదం కూడా తక్కువే. పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల వాసన రూపంలో అవి మన ముక్కులకు కూడా చేరవు.

ఫొటో సోర్స్, Getty Images
ఇంకా చెప్పాలంటే, ఏదైనా బ్యాక్టీరియా వాసన మిగిలిన వాసనల కంటే తక్కువగా ఉంటే, అలాంటివి ఆహారంలో ఉన్నా అనారోగ్య సమస్యలను కలిగించే అవకాశం కూడా తక్కువే.
అది నిజం, గత వారం నేను తీరప్రాంతంలోని స్మోక్‌హౌస్ నుంచి స్మోక్డ్ సాల్మన్(వంటకం)లో లిస్టెరియా ఉండే అవకాశం ఉంది. అయితే, దాని తయారీలో మెంతులు, ఉప్పు వంటి పదార్థాలను వాడడం వల్ల దానిపై ఒకవేళ లిస్టెరియా(బ్యాక్టీరియా) ఉన్నా వాసన ద్వారా గుర్తించేందుకు అవకాశం లేదు.
ఇప్పుడు మన శాండ్‌విచ్ విషయానికి వద్దాం. ఫ్రిజ్‌లోని మరో అరలో నుంచి టమోటా బయటకు తీశా. దానిపై దుర్వాసన కలిగించే సాల్మొనెల్లా(బ్యాక్టీరియా) ఉన్నపటికీ వాసన వచ్చే అవకాశం తక్కువే. ఒకవేళ నాకు సాల్గొనెల్లా వాసనను పసిగట్టే అతేంద్రీయ శక్తి ఉన్నప్పటికీ గుర్తించడం కష్టమే.
వ్యాధులకు కారణమయ్యే ఈ సాల్మొనెలా టమోటా పండించేందుకు వినియోగించిన కలుషిత నీటిలో కూడా ఉండి ఉండొచ్చు. కాబట్టి ఈ బ్యాక్టీరియా టమోటా పైనే ఉండాల్సిన అవసరమేమీ లేదు. లోపల కూడా ఉండొచ్చు. అలాంటప్పుడు వాసన ద్వారా తెలుసుకోవడమనేది అసాధ్యం.

ఫొటో సోర్స్, Getty Images
పాడైపోయిన ఆహారం నుంచి వాసన
అయితే, ఆహారం పాడైపోయిందని గుర్తించవచ్చు. ఎక్కువ సేపు బయట వదిలేసిన ఆహారం, లేదంటే సరైన పద్ధతిలో నిల్వచేయని ఆహారాన్ని బ్యాక్టీరియా తినే ప్రక్రియతో దీన్ని గుర్తించొచ్చు.
పాడైపోయిన పాలను గుర్తించడం ద్వారా మంచి పాలను పారబోసుకోకుండా, ఆహార వ్యర్థాలను తగ్గించుకోవడంలో ఈ వాసన చూసే పరీక్ష ఉపయోగపడుతుంది.
అయితే, కొన్ని ఆహారాలు అలా కాదు. చీజ్ వాడే ఆహారంలో బ్యాక్టీరియా ఉండడం వల్ల దుర్వాసన వస్తుంది. కిమ్చి వంటి పులియబెట్టిన ఆహారాల వాసనలు నా భార్యకు నచ్చకపోవడంతో వాటిని ఆమె ఇంట్లో నిషేధించింది. కానీ, నిజానికి అవి చెడ్డవి కావు. వాటిని చెత్తబుట్టలో పారేయాల్సిన అవసరం లేదు.
మరోవైపు, తాజా పండ్లు, కూరగాయలు, పాలు వంటి వాటి నుంచి వచ్చే వాసన వల్ల అవి మంచిగా ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు. ఒకవేళ వాటిని సరైన పద్ధతిలో భద్రపరిచినట్లు అనిపించకపోతే, మరోసారి ఆ తప్పు జరగకుండా చూసుకునేందుకు ఉపయోగపడుతుంది. సరైన సమయంలో వాటిని తినడం లేదని అనిపిస్తే కొనేప్పుడే ఆలోచించుకోవచ్చు.
అలాగే, పాడైపోయిన ఆహారం వల్ల వచ్చే కొన్ని వ్యాధులకు కారణాలు ఇంకా తెలియదు.
చాలా సందర్భాల్లో క్యాంపిలోబ్యాక్టర్, ఇతర బ్యాక్టీరియాల కారణంగా వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తెలిసినప్పటికీ, ఇంకా మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి.
అయితే, ఈ విషయంలో గతంతో పోలిస్తే పరిస్థితులు మెరుగవుతున్నాయి. ఆహారంపై పెరిగే వ్యాధికారక బ్యాక్టీరియాలను గుర్తించేందుకు మన ముక్కుల కంటే కచ్చితమైన పరికరాలను శాస్త్రవేత్తలు కనుగొంటున్నారు.
అలాగే, తినే ఆహారం వల్ల ఆరోగ్యం పాడవుతుందని అనిపించినప్పుడు వాసన చూసేందుకు ముక్కును వాడడం కంటే, వాటిని సరైన ఉష్ణగ్రతలో నిల్వ చేయడంతో పాటు వాటిని వండేందుకు అవసరమైన సమయం కేటాయించడం మంచిది.
*మాథ్యూ గ్లిమర్ ఒక రీసెర్చ్ సైంటిస్ట్. యూకేలోని క్వాడ్రమ్ ఇన్‌స్టిట్యూట్, ఫుడ్ సేఫ్టీ రీసెర్చ్ నెట్‌వర్క్ డైరెక్టర్‌గా ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
- తల్లిపాలు: మందులు వాడే తల్లులు బిడ్డకు పాలివ్వకూడదా... 7 అపోహలు, వాస్తవాలు
- చంపారన్ మటన్: ఆస్కార్ సెమీఫైనల్స్‌కు ఇండియన్ 'మటన్ కర్రీ' సినిమా... అసలు కథేంటి?
- టమాటా ఆరోగ్యానికి మంచిదా కాదా?
- ఫ్రాన్స్: జనం వైన్ తాగడం లేదని పరిశ్రమకు రూ.1,782 కోట్లు ఇస్తున్న ప్రభుత్వం
- హలాల్ హాలిడేస్ అంటే ఏంటి... ముస్లింలలో వాటికి డిమాండ్ ఎందుకు పెరుగుతోంది?














