ఫ్రాన్స్: జనం వైన్ తాగడం లేదని పరిశ్రమకు రూ.1,782 కోట్లు ఇస్తున్న ప్రభుత్వం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అలెక్స్ బిన్లీ
- హోదా, బీబీసీ న్యూస్
మిగులు వైన్‌ను నాశనం చేయడానికి, ఉత్పత్తి దారులను ప్రోత్సహించేందుకు ఫ్రెంచ్ ప్రభుత్వం రూ. 1,782 కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది.
ఫ్రాన్స్‌లో ప్రజలు క్రాఫ్ట్ బీర్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీంతో వైన్‌కు డిమాండ్ తగ్గింది. ఈ నేపథ్యంలో వైన్ పరిశ్రమ సంక్షోభంలో పడింది.
దీనికి తోడు అధిక ఉత్పత్తి, కాస్ట్ ఆఫ్ లివింగ్ తదితరాలు వైన్ పరిశ్రమను దెబ్బతీశాయి.
రూ. 1,782 కోట్లలో ఎక్కువ నిధులు అదనపు వైన్ స్టాక్‌ను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం వినియోగించనుంది.
ఇలా కొనుగోలు చేసిన వైన్‌ను ఇప్పుడు హ్యాండ్ శానిటైజర్లు, క్లీనర్లు, పెర్ఫ్యూమ్‌ల వంటి ఉత్పత్తులు తయారుచేయడానికి ఉపయోగిస్తున్నారు.
అంతేకాదు వైన్ కోసం ద్రాక్ష లాంటి పంట పండించే ఉత్పత్తిదారులు ఆలివ్ వంటి ఇతర ఉత్పత్తులు పండించేలా మద్దతు సాయం చేయనున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రభుత్వం ఏమంటోంది?
పరిశ్రమలోకి నిధులు మళ్లిస్తే ధరల పతనం ఆగిపోతుందని ప్రభుత్వం భావిస్తోంది.
దీంతో వైన్ తయారీదారులు ఆదాయాన్ని తిరిగి పొందగలరని ఫ్రాన్స్ వ్యవసాయ మంత్రి మార్క్ ఫెస్నో వెల్లడించారు.
వైన్ పరిశ్రమ భవిష్యత్తుపై ఆలోచించాలని, వినియోగదారుల ఇష్టాలను గౌరవించి, దానికి తగినట్లుగా మారాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు.
యూరోపియన్ కమిషన్ వార్షిక డేటా ప్రకారం జూన్ వరకు వైన్ వినియోగం ఇటలీలో 7 శాతం, స్పెయిన్‌లో 10 శాతం, ఫ్రాన్స్‌లో 15 శాతం, జర్మనీలో 22 శాతం, పోర్చుగల్‌లో 34 శాతం తగ్గింది.
అయితే ప్రపంచంలో వైన్ తయారీ మాత్రం 4 శాతం పెరిగింది.
ఇవి కూడా చదవండి
- ఈ వ్యాయామాలు చేస్తే మహిళలకు పీరియడ్స్ నొప్పులు తగ్గుతాయా?
- హలాల్ హాలిడేస్ అంటే ఏంటి... ముస్లింలలో వాటికి డిమాండ్ ఎందుకు పెరుగుతోంది?
- మహిళల ఫుట్‌బాల్ ప్రపంచ కప్: ఫైనల్స్ గెలిచాక స్పెయిన్ కెప్టెన్ ఓల్గా కర్మోనాకు ఆమె తండ్రి మరణించిన సంగతి చెప్పారు...
- దగ్గు మందు మరణాలు: ‘ఇండియా ఔషధం అంటే ముట్టుకోవాలన్నా భయమేస్తోంది’
- పెట్టుబడి పెట్టేటప్పుడు రిస్కును ఎలా అంచనా వేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














