సానియా మీర్జా: ‘మహిళల విజయాలను గుర్తించడంలో సమాజం వైఖరి ఎప్పటికీ మారదా?’

ఫొటో సోర్స్, Sania Mirza/Facebook
మహిళల విజయాల వెనుక వారి నైపుణ్యం, శ్రమ కాకుండా సమాజం వేర్వేరు అంశాలను ఎందుకు చేరుస్తుంది? అర్బన్ కంపెనీ రూపొందించిన ‘ఛోటీ సోచ్’ అనే వాణిజ్య ప్రకటనపై మాజీ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా ఇలా స్పందించారు.
‘’2005లో డబ్ల్యూటీఏ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయ మహిళను నేను. రైట్? డబుల్స్‌లో నేను ప్రపంచ నెంబర్ వన్ అయినప్పుడు నేనెప్పుడు సెటిల్ అవుతానా అని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూశారు. ఆరు గ్రాండ్‌శ్లామ్‌లు గెలవడం ఈ సమాజానికి సరిపోలేదు. ఈ ప్రయాణంలో నాకు లభించిన మద్దతుకు కృతజ్ఞతలు. అయితే మహిళల విజయాల్లో వారి నైపుణ్యం, శ్రమ కాకుండా లైంగికత, రూపురేఖల ఆధారంగా చర్చ ఎందుకు జరుగుతోంది. అర్బన్ కంపెనీ వారి ఈ ప్రకటన అలాంటి భావనలను గుర్తుకు తెచ్చింది. సమాజం గురించి వాస్తవికమైన చర్చ కష్టమేనని నాకు తెలుసు. కొన్నిసార్లు అది అసౌకర్యంగా ఉంటుంది. మహిళల విజయాలను మనం చూసే దృక్కోణంపై ఆత్మపరిశీలన చేసుకోవడానికి బహుశా ఇంకా కొంతకాలం పట్టవచ్చేమో.’’
ఇది సానియా మీర్జా చేసిన ఎక్స్‌లో పోస్ట్ చేసిన మెసేజ్.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1

ఫొటో సోర్స్, Sania Mirza/X
"ఛోటీ సోచ్" వీడియోతో సమాజానికి సందేశం ఇచ్చే ప్రయత్నమా?
ఇంతకీ ‘ఛోటీ సోచ్’ పేరుతో అర్బన్ కంపెనీ రూపొందించిన ప్రకటనలో ఏముంది? మహిళల స్వావలంబన, వారి విజయాలను సమాజం ఎలా వక్రీకరిస్తుంది అనే దాన్ని ఈ మూడు నిముషాల 50 సెకన్ల వీడియోలూ చూపించారు.
అర్బన్ కంపెనీ తరపున బ్యూటీషియన్‌గా పని చేస్తున్న మహిళ, ఆమె తమ్ముడు, తల్లి ఇందులో కనిపిస్తారు. ఈ వీడియోను పెద్దల సమక్షంలో చూడాలనే కాషనరీ వార్నింగ్ కూడా ఉంది.
ఈ వీడియో ఓ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో ప్రారంభం అవుతుంది. మసాజర్‌గా పని చేస్తున్న మహిళ కారు కొంటుంది. ఆమె కారు కొనడంపై అపార్ట్‌మెంట్‌లో ఉండే మిగతా కుర్రాళ్లు ఆమె తమ్ముడి వద్ద అవమానకరంగా మాట్లాడతారు. దీంతో తమ్ముడు కోపంతో వచ్చి రూమ్‌లోకి వెళతాడు.
ఎందుకలా కోపంగా ఉన్నావని అక్క అతడిని అడుగుతుంది. అందుకతను “నువ్వు కస్టమర్లందరికీ హ్యాపీ ఎండిగ్ ఇస్తావని కింద అందరూ హేళన చేస్తున్నారు” అని ఆమెతో చెబుతాడు.
ఆ మాటలకు బాధ పడిన ఆ మహిళ “అలసిపోయిన ఓ హౌస్‌వైఫ్‌కు, బిడ్డకు జన్మనిచ్చిన తల్లికి హాయి కలిగినప్పుడు అది హ్యాపీ ఎండింగే కదా” అని చెబుతుంది.
“కొత్త కారు అందరికీ కనిపిస్తుంది. కానీ దాని వెనుకున్న కష్టం. ఎవరికీ కనిపించదు. ఎందుకంటే మహిళలు ఎంత ముందుకు వెళ్లినా ప్రజల ఆలోచన మాత్రం చిన్నదిగా అవుతూనే ఉంటుంది. మనం మన పని చేసుకుంటూ ముందుకు వెళదామా లేకపోతే లోకాన్ని చూసి వెనకే ఉందామా?” అని ఆమె తమ్ముడిని అడుగుతుంది.
“అభిరుచితో చేసే ప్రతీ పని పెద్దదే. వాటి గురించి ఎవరు ఏమనుకుంటే ఏంటి? అనే వాయిస్ ఓవర్‌తో వీడియో ముగుస్తుంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, Sania Mirza/X
ఈ వీడియోతో అర్బన్ కంపెనీ ఒక మెసేజ్‌ను ఎక్స్‌లో పోస్ట్ చేసింది. “తమ వృత్తిలో విజయం సాధించిన మహిళల వెనుక ఉన్నదేమిటి?. ఒక పరమార్థం కోసం చేస్తున్న పని. దాన్ని అందరూ గౌరవించాలి. సమాజం చెప్పేది ఆమోదయోగ్యం కాదు. ఈ సమాజంలో ప్రతీ ఒక్కరికి తమకు నచ్చిన పని చేసే హక్కు ఉంది. దాన్ని అందరూ గౌరవించాలి”
మహిళలు తమ వృత్తిలో సాధించే విజయాల గురించి సమాజం ఆలోచనా ధోరణిలో మార్పు రావాలని ఈ పోస్ట్ సారాంశం.
ఈ వీడియోను ట్యాగ్ చేస్తూ సానియా మీర్జా తన సందేశాన్ని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మార్చ్ 1న అర్బన్ కంపెనీ పోస్ట్ చేసిన ఈ వీడియోకు 8.5 లక్షల వ్యూస్ వచ్చాయి.
‘ఛోటీ సోచ్’ పేరుతో మార్చ్ 1న యూట్యూబ్‌లో పబ్లిష్ అయిన వీడియోను లక్ష 26వేల మంది చూశారు.
ఈ వీడియోను ట్యాగ్ చేస్తూ సానియా మీర్జా రాసిన పోస్టుకు అర్బన్ కంపెనీ ధన్యవాదాలు తెలిపింది.
సానియా మీర్జా పోస్టుపై ఇంటర్నెట్‌లో చాలా చర్చ జరిగింది. ఆమె టెన్నిస్‌లో అడుగు పెట్టి రాణిస్తున్న సమయంలో మతపరంగా, సామాజికంగా చాలా వివాదాలు చెలరేగాయి.
సానియా వేషధారణను కొంమతంది విమర్శించారు. మరి కొంతమంది ఆమె ఆటతీరు కంటే అందచందాల గురించి ఎక్కువగా మాట్లాడారు.
అర్బన్ కంపెనీ ప్రకటనలో అంశాలకు, సానియా జీవితంలో జరిగిన కొన్ని పరిణామాలకు భావోద్వేగపూరిత సంబంధం ఉంది. అందుకే ఆమెను ఆ ప్రకటనపై అంతలా స్పందించారు.
గతంలో అర్బన్ క్లాప్స్ పేరుతో దేశవ్యాప్తంగా కొన్ని ప్రధాన నగరాల్లో సేవలు అందిస్తున్న ఈ టెక్నాలజీ ఫ్లాట్‌ఫామ్ తర్వాతి కాలంలో అర్బన్ కంపెనీగా మారింది.
ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది వృత్తి నిపుణులు తమ సంస్థలో పని చేస్తున్నారని, వారి ద్వారా ప్రజలకు ఇంటి వద్దనే సేవలు అందిస్తున్నాని సంస్థ తన వెబ్‌సైట్‌లో ప్రకటించుకుంది.
ప్రస్తుతం ఈ సంస్థ నాలుగు దేశాల్లోని 61 నగరాల్లో సేవలందిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- అనంత్ అంబానీ ప్రీ-వెడ్డింగ్: పాప్ స్టార్ రియానా, బిలియనేర్ బిల్‌గేట్స్, మార్క్ జుకర్ బర్గ్, ఇవాంకా ట్రంప్... ఇంకా భారతీయ హేమాహేమీల మెగా సందడి
- కోల్‌కతా: దేశంలోనే తొలి అండర్‌వాటర్ మెట్రోను ప్రారంభించిన ప్రధాని.. నిర్మాణానికి వందేళ్ల కిందటే ప్లాన్
- ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించిన బాంబే హైకోర్టు, ఈ కేసు పూర్తి వివరాలివీ...
- లంచం తీసుకునే ఎంపీలు, ఎమ్మెల్యేలకు విచారణ నుంచి మినహాయింపు లేదన్న సుప్రీంకోర్టు తీర్పు ఏమిటి? 1998 నాటి పీవీ నరసింహారావు కేసుకు దీనికి సంబంధం ఏమిటి
- హిందూమతం- నా అభిమతం-5: ఆరెస్సెస్‌లో చేరడం నుంచి ముస్లింను పెళ్లి చేసుకోవడం వరకు రసికా అగాషే కథ
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














