అనంత్ అంబానీ ప్రీ-వెడ్డింగ్: పాప్ స్టార్ రియానా, బిలియనేర్ బిల్‌గేట్స్, మార్క్ జుకర్ బర్గ్, ఇవాంకా ట్రంప్... ఇంకా భారతీయ హేమాహేమీల మెగా సందడి

అనంత్ అంబానీ వివాహ ముందస్తు వేడుక

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, సల్మాన్ ఖాన్, రామ్‌చరణ్, షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్ డాన్స్
    • రచయిత, మెరిల్ సెబాస్టియన్ , ఫ్లోరా డ్రూరీ
    • హోదా, బీబీసీ

500కు పైగా వంటకాలు, బాలీవుడ్ తారలు, స్టార్ ఆటగాళ్ళ హంగామా, తొలిసారి ఇండియాలో పాప్‌స్టార్ రియానా ప్రదర్శన, బిల్‌గేట్స్, మార్క్ జుకర్ బర్గ్, ఇవాంకా ట్రంప్ లాంటి ప్రపంచ ప్రసిద్ధ ప్రముఖుల రాక.. ఇవీ మూడురోజులపాటు ఘనంగా జరిగిన అనంత్ అంబానీ ముందస్తు వివాహ వేడుకలోని ముఖ్యాంశాలు.

అపరకుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, అతనికి కాబోయే భార్య రాధిక మర్చంట్ ముందస్తు వివాహ వేడుకలు మూడురోజులపాటు ఘనంగా జరిగాయి.

ఈ వేడుకలో 500కుపైగా వంటకాలతో అతిథిమర్యాదలు చేశారు. బాలీవుడ్ తారలతోపాటు టెక్ దిగ్గజాలు, స్టార్ ఆటగాళ్ళే కాకుండా, అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ కూడా హాజరయ్యారు.

ప్రీ వెడ్డింగ్ వేడుకలు భారత్ నే కాదు ప్రపంచం దృష్టిని కూడా ఆకర్షించాయి. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఈ వారాంతంలో మూడురోజుల పాటు జరిగిన ఈ వేడుకలకు సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా ప్రపంచం దృష్టిని ఆకట్టుకుంది.

దేశం నలుమూలల నుంచే కాక, ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన అతిథుల కారణంగా స్థానిక విమానాశ్రయానికి తాత్కాలికంగా అంతర్జాతీయ హోదా లభించింది. ఈ వేడుక కోసం 130 విమానాలలో అతిథులు వచ్చారని విమానాశ్రయ వర్గాలు చెప్పాయి. టెక్ దిగ్గజాలు బిల్‌గేట్స్, మార్క్ జుకర్‌బర్గ్‌ లాంటివారు ఈ ప్రాంతానికి వచ్చారని చెప్పారు.

ముందస్తు వివాహ వేడుకు జరిగే వేదికకు సమీపంలోనే ఊహకు కూడా అందనంత అత్యంత విలాసవంతమైన టెంట్లలో ఎక్కువమంది అతిథులు బస చేశారు. దీంతోపాటు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన డజన్ల కొద్దీ చెఫ్‌లు తయారుచేసిన 500 రకాల వంటకాలను అతిథులు ఆస్వాదించారు.

అనంత్ అంబానీ వివాహ వేడుక

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, అంబానీ కుటుంబసభ్యులతో పాప్ స్టార్ రియానా (ఎడమవైపు నుంచి మూడో వ్యక్తి)

థీమ్ పార్టీలకు హాజరయ్యే అతిథులకు తదనుగుణంగా కేశాలంకరణ, మేకప్ చేయడానికి ఆర్టిస్టులు, లాండ్రీ సర్వీసులు, స్టైలిస్టులను అందుబాటులో ఉంచారు. అతిథులకు ఎలాంటి లోటు రాకుండా ఏ సమయానికి ఏం జరగాలనే విషయాన్ని 9పేజీల షెడ్యూల్‌లో పొందరుపరిచారు.

ఈ వేడుకలో పాప్‌స్టార్ రియానా ప్రదర్శన హైలైట్‌ అయింది. ఇండియాలో ఇది ఆమె తొలి ప్రదర్శన. ఇందుకోసం ఆమెకు 7 మిలియన్ల అమెరికన్ డాలర్లు (సుమారు 58 కోట్ల రూపాయలు) చెల్లించారని చెబుతున్నారు. అయితే ఈ విషయాన్ని బీబీసీ స్వతంత్రంగా నిర్థరించలేకపోయింది.

రియానా హిట్ పాటలకు దేశంలోని ప్రసిద్ధ సినీనటులు కూడా డాన్స్ చేశారు.

వేడుకకు వచ్చిన అతిథులందరూ వేలాది జంతువులకు ఆవాసంగా ఉన్న 3వేల ఎకరాల అంబానీ కలల ప్రాజెక్ట్‌ను సందర్శించారు.

స్థానికుల కథనం మేరకు ముకేష్ అంబానీ స్థానికంగా 14 ఆలయాలు నిర్మించారు.

ఇక ఇప్పుడు అందరి దృష్టి జులైలో జరగబోయే అనంత్ అంబానీ వివాహవేడుకపైనే ఉంది.

ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం ముకేష్ అంబానీ సంపద 115 బిలియన్ డాలర్లు.

అనంత్ అంబానీ ముందస్తు వివాహ వేడుక

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, అనంత్ అంబానీ (కుడి వైపు నుంచి రెండో వ్యక్తి) తన స్నేహితురాలు రాధిక మర్చంట్‌ (ఎడమవైపు నుంచి రెండో వ్యక్తి)ని జులైలో వివాహం చేసుకుంటారు.
అనంత్ అంబానీ ముందస్తు వివాహ వేడుకలు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ముకేష్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ వేడుకను దగ్గరుండి నిర్వహించారు
అనంత్ అంబానీ ముందస్తు వివాహ వేడుక

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, నీతా అంబానీ, రియానా, అనంత్ అంబానీ
అనంత్ అంబానీ ముందస్తు వివాహ వేడుక

ఫొటో సోర్స్, RELIANCE INDUSTRIES VIA REUTERS

ఫొటో క్యాప్షన్, (ఎడమ నుంచి ) మార్క్ జుకర్‌బర్గ్, పౌలా హర్డ్, బిల్ గేట్స్
అనంత్ అంబానీ ముందస్తు వివాహ వేడుక

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, ముకేష్ అంబానీతో ఇవాంకా ట్రంప్ , ఆమె భర్త జారెడ్ కుష్నర్, కుమార్తె అరబెల్లా
అనంత్ అంబానీ ముందస్తు వివాహ వేడుక

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, పాప్‌స్టార్ రియానా ఇండియాలో ప్రదర్శన ఇవ్వడం ఇదే మొదటిసారి
అనంత్ అంబానీ ముందస్తు వివాహ వేడుక

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, రణవీర్‌ సింగ్, దీపిక పదుకొనే బాలీవుడ్ హిట్ పాటలకు డాన్స్ చేశారు
అనంత్ అంబానీ ముందస్తు వివాహ వేడుక

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ఖుషీ కపూర్, జాన్వీ కపూర్, అనన్య పాండే ప్రదర్శన
వీడియో క్యాప్షన్, అనంత్ అంబానీ రాధికల మధ్య ప్రేమ ఎలా మొదలైందంటే...

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)